మనందరికీ తెల్సినట్లుగానే జీవించడానికి నీరు చాలా అగత్యం. శిశువుల శరీరంలో 75% నీరు ఉంటుంది, అదే పెద్దలలో అయితే 55% నీరు ఉంటుంది. అయినప్పటికీ, మన శరీరం స్పష్టంగా నీటితో సంయోగం చెందలేదు. కాబట్టి, శరీర అవసరాలను నిర్వహించడానికి తగినంత నీరు మనకు చాలా అవసరం. మనం సాదా నీరు, వెచ్చని నీరు, నిమ్మరసంతో కూడిన నీరు లేదా నీటిని అధికంగా కల్గిఉన్న పండ్లు మరియు కూరగాయల్ని తినడం చేయవచ్చు. పేర్కొన్నవి కాకుండా, మనం తినే దాదాపు అన్ని ఆహారాలలో ఎంతో కొంత మొత్తంలో నీరు ఉండనే ఉంటుంది.
కానీ, ప్రతిరోజూ తగినంత నీరు త్రాగకుండా ఉండగలమని అర్థం కాదు. నీరు తాగడానికి రోజులో ఉత్తమ సమయం ఏదో తెలుసా?
నిపుణులు చెప్పేదేమంటే ప్రతి రోజు ఉదయాన్నే ఖాళీ కడుపుతో (పరగడుపున) రెండు గ్లాసుల నీటిని తాగడం మంచిది అని. అయినప్పటికీ, ఇది వ్యక్తి నుండి వ్యక్తికి మారుతూ ఉంటుంది. వయస్సు, లింగం మరియు శారీరక శ్రమ స్థాయిల ఆధారంగా, మనం తాగే నీటి పరిమాణం అవసరం ఉంటుంది, అంటే ఒకరు ఎక్కువగా నీరు తాగొచ్చు మరొకరు తక్కువ మొత్తం నీరు తాగొచ్చు, అంతే తేడా.
నీరు మన శరీరానికి ఏమి చేస్తుంది?
ఉదయాన్నే మనం తాగే నీళ్లు శరీరంలోని విషాన్ని తొలగిస్తుంది, జీర్ణక్రియలో సహాయం చేస్తుంది, బరువు కోల్పోవడంలో సహాయపడుతుంది అనేవి నీళ్ల తాగడంవల్ల ఉన్న ప్రయోజనాల జాబితాలో కొన్ని. ఉదయం నీటిసేవనంవల్ల కలిగే ఇతర ముఖ్యమైన ప్రయోజనాల గురించి ఈ వ్యాసంలో చర్చించడం జరిగింది.