ఇప్పటికే చెప్పినట్లుగా, నిర్దిష్ట ఆహారాన్ని తినడం లేదా వ్యాయామం చేయడం ద్వారా నిర్దిష్ట కణజాల కొవ్వును కరిగించడం కష్టం. ఇది వ్యక్తి యొక్క శరీర రకం మరియు జన్యుల పై ఆధారపడి ఉంటుంది. అయినప్పటికీ, మీరు తీసుకునే ఆహారంలో కొన్ని ఆహారపదార్దాలను చేర్చవచ్చు, అవి అదనపు కిలోలను తగ్గించడంలో మీకు సహాయపడతాయి.
తక్కువ తక్కువగా మరియు తరచుగా తినడం ఉత్తమం. రోజుకు 3 పెద్ద మీల్స్ తీసుకునే బదులు, 6-8 చిన్న మీల్స్ ను ఎంచుకోవచ్చు. అలాగే, సమయానికి భోజనం తినడం కూడా ఎంతో సహాయపడుతుంది. బాగా జనాదరణ పొందిన నమ్మకం ప్రకారం, అల్పాహారం మానివేయడం వలన వేగంగా బరువు పెరగడానికి దారితీస్తుందని అంటారు కాని అధ్యయనాలు దీనికి ఎటువంటి రుజువులు ఇవ్వలేదు. అయితే, రోజులో మొదటి మీల్ ఇంట్లోనే తయారు చేసి తినడం వలన బరువు పెరిగే అవకాశాలను తగ్గించడంలో అది ప్రభావవంతంగా ఉన్నట్లు కనుగొనబడింది.
బరువును సులభంగా తగ్గించుకోవడంలో మీకు సహాయపడే కొన్ని ఆహారాల జాబితా క్రింద పేర్కొనబడింది:
ఫైబర్
ఫైబర్ అధికంగా ఉన్న ఆహారాన్ని తీసుకోవడం అదనపు బరువుకు వ్యతిరేకంగా పనిచేయడంలో ప్రభావవంతంగా ఉంటుంది. అవిసె గింజలు, తృణధాన్యాలు, బాదం మరియు వేరుశెనగ వంటి గింజలు, వోట్మీల్, గోధుమ ఊక, బంగాళాదుంపలు మరియు పై తొక్కతో పాటుగా ఆపిల్ పళ్ళు వంటి ఆహారాలు కరిగే మరియు కరగని ఫైబర్స్ (soluble and insoluble fibres) రెండింటిలోనూ పుష్కలంగా ఉంటాయి. అవి ఎక్కువసేపు కడుపు నిండుగా ఉన్నట్లు చేస్తాయి, తద్వారా భోజనాల మధ్య సమయం పెరుగుతుంది. ఇది అధికంగా తినడం మరియు అదనపు కేలరీలు తీసుకోవడాన్ని తగ్గిస్తుంది,తద్వారా బరువు తగ్గడానికి దారితీస్తుంది.
నీటి
రోజంతా తగినంత నీరు త్రాగటం వల్ల బరువు తగ్గడం చాలా సులభం అని మీకు తెలుసా? మిమ్మల్ని మీరు హైడ్రేటెడ్ గా ఉంచుకోవడం వల్ల శరీరం నుండి అదనపు కొవ్వులు తగ్గిపోవడంతో పాటు అధిక కేలరీలను తీసుకోవడం కూడా తగ్గుతుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఉదయం ఒక గ్లాసు నీరు త్రాగటం ఆరోగ్యకరమైనదని నమ్ముతారు. ఇది రోజంతా శక్తివంతంగా ఉండడంలో మీకు సహాయపడుతుంది. మరియు మీల్స్ మధ్య నీరు త్రాగడం వలన అది మీ మీల్ పరిమాణాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. నీటిలో కేలరీలు ఉండవు, కాబట్టి ఇది మీల్ కు అదనపు కేలరీలను జోడించదు.
(మరింత చదవండి: ఉదయం/పరగడుపున మంచినీటి త్రాగడం వల్ల కలిగే ప్రయోజనాలు)
కాఫీ
అవును, మేము మీ రెగ్యులర్ కాఫీ గురించే మాట్లాడుతున్నాము. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడం ద్వారా బరువు తగ్గడానికి ఇది సహాయపడుతుందని అనేక సార్లు నిరూపించబడింది. అయితే, దీనికి ఖచ్చితమైన మెకానిజం (క్రియావిధానం) ఇంకా తెలియలేదు.
చేపలు
క్లినికల్ అధ్యయనాలలో బరువు తగ్గడాన్ని ప్రోత్సహించడంలో కొవ్వు (ఫ్యాటీ) మరియు సన్నని (లీన్) చేపలు రెండూ ప్రభావంతంగా ఉంటాయని కనుగొనబడ్డాయి. చేపల వినియోగం శరీరంలో ట్రైగ్లిజరైడ్ స్థాయిలను తగ్గించటానికి దారితీస్తుందని కూడా ఈ అధ్యయనం నివేదించింది, ట్రైగ్లిజరైడ్ ఒక రకమైన చెడు కొలెస్ట్రాల్. అదనంగా, చేపలలో పియుఎఫ్ఏ (పాలీఅన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్లు) మరియు సిఎల్ఏ (కంజుగేటెడ్ లినోలెయిక్ ఆసిడ్) ఉంటాయి, ఈ రెండు ఆరోగ్యానికి చాలా మంచివి.
ఈ ఆహార పదార్దాలే కాక, ఆకుకూరలు మరియు ఆరోగ్యకర ఆహార పదార్దాలను మీరు తీసుకునే ఆహారంలో చేర్చడం చాలా మంచిది అలాగే ప్రాసెస్ చేసిన ఆహారాలు మరియు పంచదార తగ్గించడం ఉత్తమం.