ఆరోగ్యకరమైన సమమైన పొట్ట కోసం మరియు ఉబ్బరాన్ని నివారించడం కోసం అనేక ఆహార మరియు జీవనశైలి మార్పులను చెయ్యాలి. పొట్ట పెరుగుదలను నిరోధించడానికి మీకు సహాయపడే కొన్ని విషయాల జాబితా క్రింద ఉంది.
పాల ఉత్పత్తులు మానండి
చాలామందికి ఇది తెలియదు, కానీ వారు లాక్టోజ్ అసహనం కలిగి ఉండవచ్చు, అనగా పాలు మరియు పాల ఉత్పత్తులను జీర్ణం చేసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కోవచ్చు, ఇది ఉబ్బరానికి మూలమైన కారణం కావచ్చు. అందువల్ల, పాల ఉత్పత్తులు తీసుకున్న తర్వాత మీ పొట్ట ఎలా ఉందో గమనించండి. మీరు ఏవైనా వ్యత్యాసం గమనిస్తే కొన్ని వారాల పాటు మీ ఆహారాన్నిండి వాటిని తొలగించండి.
భారీ భోజనాన్ని మానేయాలి
భారీ భోజనం కడుపు నిండుదలకు కారణమవుతుంది మరియు జీర్ణం అవ్వడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఇది ఆహారాన్ని ఆలస్యంగా కడుపు నుండి ఖాళీ చేస్తుంది మరియు ఉబ్బరంనికి దారితీసే అజీర్ణానికి కూడా కారణం కావచ్చు. అందువల్ల ఒకేసారి పెద్ద మొత్తంలో భోజనం చెయ్యడం కంటే చిన్న చిన్నగా ఎక్కువ సార్లు తినాలి.
ప్యాకేజ్డ్ ఆహారం మానేయాలి
చాలా సార్లు ప్యాక్డ్ ఆహార ఉత్పత్తులు సంరక్షణకారిణులను (preservatives) మరియు కృత్రిమ ఆహార పదార్థాలను కలిగి ఉంటాయి. అవి మీ జీర్ణాశయానికి సరిపడక, వాయువును, మలబద్ధకం, లేదా అజీర్ణం మీ జీర్ణాశయ పూత యొక్క వాపుకు దారితీస్తాయి. అందువల్ల, ఉబ్బరంతో భాదపడుతున్నపుడు ప్యాక్డ్ ఆహార ఉత్పత్తులను నివారించడం మంచిది.
చక్కెర తీసుకోవడం తగ్గించండి
ఇదితీపి ఇష్టపడే వారికి ఆనందంగా అనిపించకపోవచ్చు, కానీ చక్కెర తీసుకోవడాన్ని పరిమితం చేస్తే కడుపు ఉబ్బరం తగ్గించడంలో మీకు సహాయపడుతుంది. ఎందుకంటే ఎక్కువ చక్కెర తీసుకోవడం వలన శరీరంలో ముఖ్యంగా ముఖం,పొట్ట మరియు మెడ ప్రాంతంలో నీటి నిలుపుదల పెరుగుతుంది.
ఉప్పు తీసుకోవడం తగ్గించండి
అధిక ఉప్పు తీసుకోవడం అనేది చక్కెర లాంటి ప్రభావాన్ని కలిగి ఉంటుంది. నీరు నిలుపుదల ఉబ్బరానికి దారితీస్తుంది అందుకే, మీ ఆహారంలో ఉప్పు శాతం తగ్గించడం మంచిది.
నీరు త్రాగాలి
తగినంత నీరు త్రాగడం వలన శరీరంలో కొవ్వు చేరడాన్ని తగ్గించి అలాగే అధిక చెక్కెర మరియు ఉప్పులను బయటకు పంపి ఉబ్బరాన్ని తగ్గిస్తుంది.
భోజనం చేసేటప్పుడు నీరు త్రాగవద్దు
భోజనం చేసేటప్పుడు కొంచెం కొంచెం నీటిని సేవించడం పెద్ద సమస్య కాదు, కానీ ఒక గ్లాసు లేదా రెండు గ్లాసుల నీటిని తాగితే జీర్ణ ప్రక్రియను ఆటంకపరుస్తుంది మరియు ఉబ్బరం కలిగించవచ్చు. అందువల్ల, మీ జీర్ణాశయ రసాలు పల్చబడకుండా ఉండడానికి తినేటప్పుడు అధిక శాతంలో నీరు తీసుకోకుండా ఉండాలి.
మద్యపానం ఆపండి
మద్యపాన వ్యసనం మరియు ఆల్కహాల్ దుర్వినియోగం యొక్క నేషనల్ ఇన్స్టిట్యూట్ (National Institute of Alcoholism and Alcohol Abuse) యొక్క ఒక వ్యాసం ప్రకారం, మద్యపానం అనేది శరీరంలోని జీర్ణ మరియు ఇతర జీవక్రియల విధులతో సంబంధం కలిగి ఉంటుందని, తత్ఫలితంగా, ఆహారం సరిగా జీర్ణించబడదు మరియు ఇతర తీవ్రమైన వ్యదులతోపాటు ఉబ్బరం కలిగించే విధంగా కాలేయం లోపల మరియు వెలుపల కొవ్వును ఏర్పరచే ప్రమాదం కూడా ఉంది అని తెలిపింది. అందువల్ల, శారీరక రుగ్మత నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి మద్యపానాన్ని నివారించాలి.
కొవ్వు ఆహారం మానుకోండి
కొవ్వులో అధికంగా ఉన్న ఆహారం ముఖ్యంగా వనస్పతి నూనెలో ఉన్న ట్రాన్స్-కొవ్వు ఉదర భాగంలో కొవ్వు పేరుకునేలా చేస్తుంది. అందువల్ల, కొవ్వును నివారించడానికి వీలైనంతగా కొవ్వు పదార్ధాల నుండి దూరంగా ఉండటం మంచిది.
పొగ త్రాగుట ఆపండి
ధూమపానం మరియు గ్యాస్ట్రోఇంటెస్టినల్ రుగ్మతలపై దాని ప్రభావాలపై ఇటీవల అధ్యయనం ధూమపానం అనేది కడుపు నొప్పి మరియు మలబద్ధకం వంటి ఇతర సమస్యలతో పాటు ఉబ్బరంతో సంబంధం కలిగి ఉందని సూచించింది. అందువల్ల, మీరు ఆరోగ్యకరమైన జీవితాన్ని మరియు సంతోషకరమైన పొట్టను కలిగి ఉండడానికి సిగరెట్లను మానేయాలి.
మద్యపానాన్ని పరిమితం చెయ్యాలి
"మద్యపాన వ్యసనం మరియు మద్యం దుర్వినియోగం యొక్క నేషనల్ ఇన్స్టిట్యూట్" (“National Institute of Alcoholism and Alcohol Abuse”) యొక్క ఒక వ్యాసం ప్రకారం, మద్యపానం అనేది శరీరంలోని జీర్ణ మరియు ఇతర జీవక్రియల విధులతో సంబంధం కలిగి ఉంటుందని, తత్ఫలితంగా, ఆహారం సరిగా జీర్ణించబడదు మరియు ఇతర తీవ్రమైన వ్యదులతోపాటు ఉబ్బరం కలిగించే విధంగా కాలేయం లోపల మరియు వెలుపల కొవ్వును ఏర్పరచే ప్రమాదం కూడా ఉంది అని తెలిపింది. అందువల్ల, శారీరక రుగ్మత నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి మద్యపానాన్ని నివారించాలి.
జంక్ ఫుడ్ తగ్గించాలి
జంక్ ఫుడ్లో క్రొవ్వు పదార్దాలు, సంరక్షణకారులు (preservatives), కృత్రిమ సంకలనాలు (artificial additives), పంచదార వంటి అనేక అనారోగ్యకరమైన పదార్థాలు ఉంటాయి, ఇవి క్యాలరీలో అధికంగా ఉంటాయి మరియు పూర్తిగా జీర్ణం కావడానికి మరియు పూర్తిగా వ్యవస్థ నుండి బయటకు వెళ్లడానికి చాలా సమయం పడుతుంది. అందువల్ల, ఉబ్బరాన్ని నివారించడానికి సాధ్యమైనంత వరకు బయట జంక్ ఫుడ్ నుండి దూరంగా ఉండటం మంచిది.
ఒత్తిడిని తగ్గించాలి
మేము పైన చెప్పినట్లుగా, ఉబ్బరంతో పాటు చాలా జీర్ణకోశ సమస్యలలో ఒత్తిడి ఉంటుంది. అందువల్ల, మీ షెడ్యూల్లో కొంత సమయాన్ని మానసిక విశ్రాంతి (mind relaxation)కోసం కేటాయించండి. ఆరోగ్యకరమైన శరీరం మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థ కలిగి ఉండటంలో ఆరోగ్యకరమైన మనస్సు గొప్ప పాత్ర పోషిస్తుంది. సంతోషంగా ఉండండి మరియు ఉబ్బరాన్ని నిర్ములించండి.
క్రమం తప్పకుండా వ్యాయామం చెయ్యండి
ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడం మరియు మీ రక్త ప్రసరణను మెరుగుపరుచుకోవడంలో క్రమబద్ధమైన వ్యాయామం ఎల్లప్పుడూ ఉపయోగకరంగా ఉంటుందని చెప్పవలసిన అవసరం లేదు. కాబట్టి, ఉబ్బరం నుండి దూరంగా ఉండటానికి, మీరు చురుగ్గా మారాలి మరియు ఉదర కండరాలను మరియు శరీర కండరాలను క్రమం తప్పకుండా సాగదియ్యాలి.
నీటిని పుష్కలంగా త్రాగాలి
మేము ముందు చెప్పినట్లుగా, నీరు శరీరం నుండి విషాలని, అదనపు చక్కెర, అధిక ఉప్పును, మరియు పొట్ట కొవ్వు వృద్ధిని నిరోధిస్తుంది. అందువల్ల, ఆరోగ్యకరమైన పొట్ట మరియు మెరిసే చర్మం కోసం నీటి పుష్కలంగా త్రాగాలి.
చక్కెర మరియు ఉప్పు తీసుకోవడం తగ్గించాలి
ఉప్పు మరియు చక్కెర తగ్గించడం అనేది నీరు నిలుపుదల నిరోధించడానికి మరియు ఉబ్బరాన్ని నిరోధించడానికి సహాయం చేస్తుంది, కానీ అది దీర్ఘకాలంలో, మీ శరీరం పూర్తి ఆరోగ్యానికి మంచి నిర్ణయం అని తెలుస్తుంది.
కార్బొనేటెడ్ పానీయాలను నివారించండి
రుచి గల సోడా మరియు బీర్ వంటి కార్బొనేటెడ్ పానీయాలు కార్బన్ డయాక్సైడును కలిగి ఉంటాయి, ఇది మీ ప్రేగులు మరియు పెద్దప్రేగులో చేరి పొట్టను సాగదీస్తుంది. బీరు చక్కెర మరియు ఆల్కహాల్ను కుడా కలిగి ఉంటుంది, కాబట్టి ఉబ్బరాన్ని నిరోధించడానికి దానిని తీసుకోవడం తగ్గించాలి.
ఆరోగ్యకరమైన ఆహారం తినండి
ఆరోగ్యవంతమైన ఆహారం ఆరోగ్యకరమైన మరియు సంతోషమైన జీర్ణకోశాన్ని తయారు చేస్తుంది. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఆరోగ్యవంతమైన బ్యాక్టీరియా, ముఖ్యంగా పెరుగు, కూరగాయలు, పండ్లు, కూరగాయల రసాలు త్రాగడం, ఆకుపచ్చ ఆకు కూరలు తినడం, పాలు తీసుకోవడం వంటివి చెయ్యండి.
అతిగా తినడం మానుకోండి
మనం చాలా సార్లు మన కడుపు నిండడం కంటే మనసు నిండేలా తింటాము. దీనినే మనం అతిగా తినడం (over eating) అంటాము. అతిగా తినడం వల్ల అసౌకర్యంగా ఉండి, కొంత సమయం పాటు అది కొనసాగుతుంది, అది పెద్ద బొజ్జకు దారి తీస్తుంది. అందువల్ల, మీ భోజనాన్ని చిన్నగా మరియు తరచూ చెయ్యండి.