ద్రాక్షపళ్ళు అత్యంత సాధారణ పండ్లలో ఒక రకమైనవి మరియు పురాతన కాలం నుండి వాటిని "పండ్లలో రాణి" గా భావిస్తారు. ఈ చిన్న పండ్ల యొక్క మూలాలు ఐరోపా మరియు మధ్యధరా ప్రాంతాలలో ఉన్నాయి. ద్రాక్షలో విటమిన్లు, ఖనిజాలు (మినరల్స్) మరియు యాంటీఆక్సిడెంట్స్ వంటి ఆరోగ్యాన్ని పెంపొందించే వివిధ రకాల ఫైటోన్యూట్రియెంట్స్ ఉంటాయి. వాటి ఆరోగ్య ప్రయోజనాలు మరియు వాటి యొక్క రుచి కారణంగా ద్రాక్షపళ్ళను ఎక్కువగా ఆహారంలో తీసుకుంటారు.
ఇవి చిన్నగా గుండ్రంగా ఉండే పళ్ళు, ఇవి ద్రాక్ష మొక్క మీద గుత్తులు గుత్తులుగా పెరుగుతాయి, శాస్త్రీయంగా ఈ మొక్కను విటిస్ (Vitis) అని పిలుస్తారు. ప్రపంచవ్యాప్తంగా ద్రాక్ష తోటలను విస్తృతంగా సాగు చేస్తారు. ఆకృతి పరంగా, ఒకొక ద్రాక్ష పండు ఒక మృదువైన పలుచని తోలులో గుజ్జును కలిగి ఉంటుంది. ద్రాక్షలో ఉండే వివిధ పాలిఫినోలిక్స్ (polyphenolics) పండు యొక్క రంగుకు బాధ్యత వహిస్తాయి. ఎరుపు ద్రాక్ష రంగుకు కారణమయ్యే పిగ్మెంట్ ఆంథోసియానిన్ (anthocyanin), అయితే తెలుపు మరియు ఆకుపచ్చ ద్రాక్షలు ఎక్కువగా టానిన్లను ప్రత్యేకంగా కేటికిన్ను (catechin) కలిగి ఉంటాయి. వీటిలో ఉండే అన్ని యాంటీఆక్సిడెంట్ కాంపౌండ్లు ద్రాక్ష గింజలు మరియు ద్రాక్షపళ్ళ తోలు మీద అధిక సాంద్రతలో ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా పెరిగే ద్రాక్షలలో మూడు ప్రధాన రకాలు ఉన్నాయి, అవి; ఉత్తర అమెరికావి (విటిస్ రోయుండిఫోలియా [Vitis rotundifolia] మరియు విటిస్ లాబ్రాస్కా [Vitis labrusca]), యూరోపియన్ (విటీస్ వినిఫెరా [Vitis vinifera]) మరియు ఫ్రెంచ్ హైబ్రిడ్లు (French hybrids).
ద్రాక్షపళ్ళ గురించి కొన్ని ప్రాథమిక వాస్తవాలు:
- శాస్త్రీయ నామం: విటిస్ వినిఫెరా (Vitis vinifera)
- కుటుంబము: విటేసియే (Vitaceae)
- సాధారణ నామం: అంగూర్, ద్రాక్ష
- స్థానిక ప్రాంతం: యూరోపియన్ ద్రాక్ష రకం మధ్యధరా మరియు మధ్య ఆసియా ప్రాంతాలకు చెందినది. భారతదేశంలో, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక మరియు మహారాష్ట్రలలోని కొన్ని ప్రాంతాలలో కొన్ని రకాలైన ద్రాక్షలు పెరుగుతాయి.
- ద్రాక్షపళ్ళ గురించి కొన్ని ఆసక్తికరమైన వాస్తవాలు:
- ద్రాక్షపళ్ళ యొక్క ఆకుపచ్చ రకాల్లో కొన్ని ప్రసిద్ధమైనవి థాంప్సన్ సీడ్లెస్ (Thompson seedless), కాల్మెరియా (Calmeria) మరియు చక్కెర రకం.
- ఎరుపు ద్రాక్ష రకాలు కార్డినల్ (cardinal), ఫ్లేమ్ సీడ్లెస్ (flame seedless), రెడ్ గ్లోబ్ (red globe) మరియు ఎంప్రేర్ (emperor).
- ప్రసిద్ధ బ్లూ-బ్లాక్ (నలుపు-నీలం) రంగు రకాలు కాంకర్డ్ (Concord) మరియు జెన్ఫెండెల్ (Zinfandel) వంటివి.
- వాణిజ్యపరంగా, ద్రాక్షపళ్ళు వివిధ ప్రయోజనాల కోసం వివిధ రకాలుగా సాగు చేయబడుతున్నాయి వాటిని వైన్ (మద్య) ఉత్పత్తికి లేదా సాధారణంగా తినడానికి తాజాగా లేదా ఎండుద్రాక్ష రూపంలో (కిస్మిస్ పళ్ళు, సుల్తానా)