గ్లిసరాల్, లేదా గ్లైకాల్ అని కూడా గ్లిసరిన్ ను పిలుస్తారు, ఇది ఒక ఆర్గానిక్ సమ్మేళనం, ఇది కూరగాయల కొవ్వు మరియు నూనె నుండి తయారవుతుంది. ఇది రంగు, వాసన లేని మరియు విషరహిత (నాన్-టాక్సిక్) ద్రవం. ఇది తీపి రుచితో ఉంటుంది.
గ్లిసరిన్ హైడ్రేటింగ్ లక్షణాలను కలిగి ఉంటుంది మరియు పొడి చర్మం, సోరియాసిస్ మరియు తామర వంటి వివిధ చర్మ సమస్యలకు సమర్థవంతమైన చికిత్సగా పనిచేస్తుంది. ఇది చర్మానికి గొప్ప మాయిశ్చరైజింగ్ ఏజెంట్‌గా పనిచేస్తుంది మరియు క్రమంగా దీనిని ఉపయోగిస్తే చర్మానికి పోషణను అందించగల సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంటుంది. చర్మంపై కొన్ని రసాయనాల వలన కలిగే ప్రతికూల చర్యలను నివారించడంలో కూడా ఇది సహాయపడుతుంది. సాధారణంగా శిశువు సంరక్షణ ఉత్పత్తులు (baby care products), సబ్బులు మరియు ఇతర సౌందర్య ఉత్పత్తులలో గ్లిజరిన్ ఉంటుంది.
దాని విషరహిత మరియు తీపి లక్షణాల కారణంగా, గ్లిసరిన్ ను సంరక్షణకారిగా (preservative) మరియు ఆహార స్వీటెనర్ గా కూడా ఉపయోగిస్తారు.
గ్లిసరిన్ గురించి కొన్ని ప్రాథమిక వాస్తవాలు:
- శాస్త్రీయ నామం: గ్లిజరిన్ యొక్క శాస్త్రీయ నామం ప్రొపేన్- 1, 2, 3-ట్రైయోల్
- రసాయన సూత్రం: గ్లిజరిన్ యొక్క రసాయన సూత్రం C3H8O3.
- సాధారణ పేరు: గ్లిసరిన్
- వనరులు: జంతువుల కొవ్వులు, కూరగాయల నూనెలు మరియు పెట్రోలియం - ఈ మూడు ప్రధాన వనరుల నుండి గ్లిసరిన్ను పొందవచ్చు.
- గ్లిసరిన్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు: శీతాకాలం సమీపిస్తున్నప్పుడు, చాలా కీటకాలు వాటి శరీరంలోని నీటి పరిమాణాన్ని(కంటెంట్‌ను) గ్లిసరాల్‌తో భర్తీ చేసుకుంటాయి. ఎందుకంటే ముఖ్యంగా ప్రపంచంలోని అతి శీతల ప్రాంతాలలో, గ్లిసరాల్ ఈ కీటకాలను గడ్డకట్టకుండా నిరోధించే యాంటీ-ఫ్రీజింగ్ ఏజెంట్ గా పనిచేస్తుంది.