కొత్తిమీర లేదా ధనియాలు అన్నది ఒక వార్షిక మూలిక, సంప్రదాయ భారతీయ వంటకాల్లో ఇది విస్తృతమైన ఉపయోగం కలిగిఉంది.  ఆహార ఫైబర్ యొక్క ఒక మంచి వనరు,  అలాగే, కొరియండ్ర‌మ్ సాటివ‌మ్  అపారమైన ఔషధ విలువ కలిగిఉంది.  ఒక సంప్రదాయ నివారిణి మరియు సువాసన ఏజెంట్‌గా కొత్తిమీరను విభిన్న నాగరికతలు ఉపయోగిస్తున్నాయి.  కొత్తిమీర మొక్క మొత్తం, లిపిడ్లకు ఒక గొప్ప వనరుగా ఉంది, అనగా పెట్రోసెలినిక్ ఆమ్లం మరియు ముఖ్యమైన నూనెలు వంటివి.

దక్షిణ ఐరోపా ప్రాంతం, మరియు ఉత్తర మరియు నైరుతి ఆఫ్రికా ప్రాంతాలకు స్థానికంగా చెందినది, కొత్తిమీర మొక్క ఒక మృదువైన మూలిక, సాధారణంగా 50 సెం.మీ. ఎత్తు కలిగి ఉంటుంది.  ఆకులు పీఠం దగ్గర విస్తృతమైన తమ్మెలుగా ఉంటాయి, బయటి అంచుల వైపుగా సన్నగా మరియు ఈకలు గలవిగా ఉంటాయి మరియు ఆకారం‌లో అస్థిరంగా ఉన్నట్లు కనిపిస్తాయి.  ఆయుర్వేదంలో, ఆకలిని పెంచడం, జీర్ణక్రియలో సహాయం చేయడం మరియు అంటువ్యాధులతో పోరాడటం ద్వారా కొత్తిమీర ఒక త్రిషోడిక్ (మూడు ప్రయోజనాలను అందిస్తుంది) మసాలాగా అత్యధిక ప్రశంసలు పొందింది.

కొత్తిమీర అనేక బయోయాక్టివ్ అంశాలను కలిగిఉంటుంది, దీని వల్ల ఈ మూలికలోని వివిధ భాగాలు అనేక ఔషధ లక్షణాలను ప్రదర్శిస్తాయి.   వీటిలో యాంటి-బయాటిక్, యాంటి-ఆక్సిడంట్, యాంటి-మైక్రోబయల్, యాంటి-ఎపిలెప్టిక్ (మూర్ఛను నివారిస్తుంది) , యాంటి-డిప్రెసంట్, యాంటి-ఇన్‌ఫ్లమేటరీ (వాపును తగ్గిస్తుంది) యాంటి-డైస్లిపిడెమిక్ (కొలెస్ట్రాల్ మరియు ట్రైగ్లిజరైడ్స్ వంటి రక్త లిపిడ్లను తగ్గిస్తుంది), న్యూరోప్రొటెక్టివ్ (మెమరీ కణాలను రక్షిస్తుంది), యాంటి-హైపర్‌టె‌న్సివ్ (రక్తపోటును తగ్గిస్తుంది) మరియు మూత్రవిసర్జన (మూత్రవిసర్జనను పెంచుతుంది) లక్షణాలను కలిగిఉంది.  

కొత్తిమీర గురించి కొన్ని ప్రాథమిక వాస్తవాలు

  • వృక్ష శాస్త్రీయ నామంకొరియండ్ర‌మ్ సాటివ‌మ్
  • జాతి: ఎపియాసియె
  • వ్యవహారిక నామం: కొరియాండర్, సిలాన్‌ట్రో, చైనీస్ పార్స్లీ
  • సంస్కృత నామంధనియ
  • ఉపయోగించే భాగాలు: ఆకులు, కాండం, విత్తనాలు
  • జన్మించే ప్రాంతం మరియు భౌగోళిక పంపిణీ: దక్షిణ ఐరోపా, ఉత్తర ఆఫ్రికా, నైరుతి ఆఫ్రికా
  1. కొత్తిమీర పోషక విలువలు - Coriander nutrition facts in Telugu
  2. కొత్తిమీర ఆకు ప్రయోజనాలు - Coriander leaf benefits in Telugu
  3. కొత్తిమీర ఆకుల రసం ప్రయోజనాలు - Coriander leaves juice benefits in Telugu
  4. కొత్తిమీర యొక్క వైద్యపరమైన ప్రయోజనాలు - Medicinal Benefits of Coriander in Telugu
  5. కొత్తిమీర యొక్క ఇతర ప్రయోజనాలు - Other benefits of Coriander in Telugu
  6. కొత్తిమీర రసాన్ని ఎలా తయారుచేస్తారు - How to make coriander juice in Telugu
  7. కొత్తిమీర యొక్క దుష్ప్రభావాలు - Side effects of coriander in Telugu

కొత్తిమీర దాని యొక్క ఆరోగ్య ప్రయోజనాలకు ప్రసిద్ధి చెందింది.  యుఎస్‌డి‌ఎ ప్రకారం, ఒక 100 గ్రా. సేవలకు కొత్తిమీర యొక్క పోషక విలువలు ఈ పట్టికలో వలె ఉంటాయి. 

పోషకము విలువ (100 గ్రా.లకు)
కార్బోహైడ్రేట్లు 3.67 గ్రా.
పీచు పదార్థం 2.80 గ్రా.
కొలెస్ట్రాల్ 0 గ్రా.
కొవ్వు 0.52 గ్రా.
ప్రొటీన్ 2.13 గ్రా.
విటమిన్లు
విటమిన్ ఎ 67.48 మి.గ్రా.
విటమిన్ సి 27 మి.గ్రా.
విటమిన్ ఇ 2.50 మి.గ్రా.
విటమిన్ కె 310 మి.గ్రా.
థయామిన్ 0.067 మి.గ్రా.
నియాసిన్ 1.114 మి.గ్రా.
రిబోఫ్లేవిన్ 0.162 మి.గ్రా.
పైరిడాక్సిన్ 0.149 మి.గ్రా.
పాంటోథెనిక్ ఆమ్లం 0.570 మి.గ్రా.
ఖనిజాలు
కాల్షియం 67 మి.గ్రా.
మెగ్నీషియం 26 మి.గ్రా.
ఇనుము 1.77 మి.గ్రా.
మాంగనీస్ 0.426 మి.గ్రా.
సెలీనియం 0.9 మి.గ్రా.
ఫాస్ఫరస్ 48 మి.గ్రా.
జింక్ 0.50 మి.గ్రా.
ఎలక్ట్రోలైట్స్
పొటాషియం 521 మి.గ్రా.
సోడియం 46 మి.గ్రా.
myUpchar doctors after many years of research have created myUpchar Ayurveda Urjas Capsule by using 100% original and pure herbs of Ayurveda. This ayurvedic medicine has been recommended by our doctors to lakhs of people for sex problems with good results.
Long Time Capsule
₹712  ₹799  10% OFF
BUY NOW

అధిక భాగం ఆహారాలలో కొత్తిమీర ఒక సంభారంగా (రుచి పెంచేది) ఉపయోగించబడింది.  అదనంగా, కొత్తిమీర వాడకం అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుందని చూపబడింది.  ఉత్తమమైన ఆరోగ్యాన్ని ప్రోత్సహించడానికి కొత్తిమీర యొక్క ఉపయోగాలు ఈ వ్యాసంలో చర్చించబడ్డాయి.  

కొత్తిమీర మొక్క యొక్క మొత్తం శరీరం అనేక ఉపయోగాలు మరియు ప్రయోజనాలు కలిగిఉంది.  అయితే, మొక్క భాగం‌లో ఎక్కువగా ఉపయోగపడే భాగం కొత్తిమీర యొక్క ఆకులు.  కొత్తిమీర ఆకుల యొక్క ఉపయోగాలు మరియు ఆరోగ్య ప్రయోజనాలు మనం పరిశీలిద్దాము.

యాంటిఆక్సిడంట్లుగా కొత్తిమీర ఆకులు - Coriander leaves as antioxidants in Telugu

మానవ శరీరం చుట్టుప్రక్కల వాతావరణం‌లో ఉండే బాహ్య టాక్సిన్లకు నిరంతరం గురవుతూ ఉంటుంది.

ఈ టాక్సిన్లతో ప్రతిచర్యగా, శరీరం స్వేచ్చా రాడికల్స్‌ను ఉత్పత్తి చేస్తుంది, అది కణాలకు నష్టం కలిగిస్తుంది మరియు దీర్ఘకాలం‌లో గుండె వ్యాధులు, డయాబెటిస్ మరియు అలాగే క్యా‌న్సర్ వంటి వ్యాధులను కలుగచేస్తుంది.

కొత్తిమీర యాంటిఆక్సిడంట్ల యొక్క ఒక మంచి వనరుగా ఉంది.  కొత్తిమీర ఆకుల నుండి తయారుచేసిన సారం, గ్లూటాతియోన్ వంటి పెద్ద సంఖ్యలో గల యాంటిఆక్సిడంట్ల యొక్క చర్యల ద్వారా ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది మరియు స్వేచ్చా రాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని తగ్గిస్తుంది.  

రక్తపోటు కోసం కొత్తిమీర ఆకులు - Coriander leaves for blood pressure in Telugu

కొత్తిమీర ఆకులతో తయారుచేసిన సలాడ్, హైపర్‌టె‌న్షన్  బాధపడుతున్న రోగులకు తరచుగా చాలా ప్రయోజకనకరమైనదిగా గుర్తించబడింది.

కొత్తిమీరలో కాల్షియం అధికంగా ఉంటుంది, ఇది ఎసిటైల్కోలిన్‌తో సంకర్షణ జరిపిన తర్వాత రక్త టె‌న్షన్ విడుదలకు బాధ్యత వహిస్తుంది.

అందువల్ల కొత్తిమీర తీసుకోవడం, రక్తపోటు స్థాయిలను తగ్గించే సామర్థ్యం కలిగిఉంటుంది.  కొత్తిమీర యొక్క ఈ లక్షణం, గుండె స్తంభన మరియు గుండెపోటు వంటి అనేక హృదయనాళ (గుండె) పరిస్థితులు సంభవించే అవకాశాలు తగ్గించడంలో సహాయపడుతుంది.

మంచి జ్ఞాపకశక్తి కోసం కొత్తిమీర ఆకులు - Coriander leaves for good memory in Telugu

కొత్తిమీర మూలిక మెమరీ విధులను మెరుగుపరచడంలో గణనీయంగా సహాయపడుతుందని ఈ కొత్తిమీర పైన చేసిన విస్తృతమైన అధ్యయనాలు బలంగా సూచిస్తున్నాయి.

కొలినెస్టెరాస్ ఎంజైము (కేంద్ర నాడీ వ్యవస్థలో ఉండే ఎంజైము)ను అడ్డుకోవడం ద్వారా మెమరీ విధులను పెంచేందుకు కొత్తిమీర మొక్క ప్రాథమిక పద్దతిలో సహాయపడుతుంది, ఈ ఎంజై‌మ్ ఎసిటైల్కోలిన్ పతనానికి బాధ్యత వహిస్తుంది, ఇది ఒక న్యూరోట్రా‌న్స్మిటర్ (నరాల సంకేతాలను నిర్వహించడం‌లో సహాయపడుతుంది).

శరీరంలో కండర కణాల క్రియాశీలత కోసం ఎసిటైల్కోలిన్ అవసరం.  మెదడులో ఆక్సీకరణ ఒత్తిడి యొక్క స్థాయిలను కొత్తిమీర తగ్గిస్తుంది, ఇది కొలినెస్టెరాస్ యొక్క కార్యకలాపాన్ని నిరోధిస్తుంది మరియు ఎసిటైల్కోలిన్ యొక్క నిర్మాణాన్ని ప్రోత్సహిస్తుంది.  ఇది, క్రమంగా, మెమరీ ఫంక్షన్‌ మెరుగుదలలో సహాయపడుతుంది.  

కాలేయం కోసం కొత్తిమీర ఆకులు - Coriander leaves for the liver in Telugu

మానవ శరీరంలో మెటాబొలిక్ విధుల యొక్క ఒక విస్తృత ఆధిక్యత, కాలేయం ద్వారా నిర్వహించబడుతుంది.  కొరియాండ్ర‌మ్ సాటివ‌మ్ యాంటిఆక్సిడంట్లను సమృద్ధిగా కలిగిఉంటుంది, ఇది క్యాటలైజ్, గ్లూటాథియోన్ పెరాక్సిడేస్, మరియు సూపరాక్సైడ్ డిస్మ్యుటేజ్ వంటి కొన్ని ఎంజైముల చర్యలను పెంచడం ద్వారా ఇది హెపటోప్రొటెక్టివ్ (కాలేయాన్ని రక్షిస్తుంది)గా పనిచేస్తుంది. ఈ ఎంజైములు, హైడ్రాక్సిల్ రాడికల్స్ (నష్టం కలిగించే ఏజెంట్లు) వంటి వ్యర్థాలతో కలవడం ద్వారా వాటిని తొలగించడంలో సహాయం చేస్తుంది మరియు కాలేయం యొక్క సరైన పనితీరు సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది.

కొలెస్ట్రాల్ కోసం కొత్తిమీర ఆకులు - Coriander leaves for cholesterol in Telugu

కొత్తిమీరలో ఉండే బయోయాక్టివ్ సమ్మేళనాలు శక్తివంతమైన యాంటిఆక్సిడంట్ల వలె పనిచేస్తాయి.  ఈ సమ్మేళనాలు శరీరం‌లో కొలెస్ట్రాల్ స్థాయిలను క్రమబద్ధీకరించడం‌లో సహాయపడతాయి.  క్రమముగా కొత్తిమీర వినియోగం ద్వారా, హృదయ వ్యాధులు గల రోగులలో, తక్కువ-సాంద్రత కొలెస్ట్రాల్ (ఎల్‌డి‌ఎల్) మరియు చాలా-తక్కువ-సాంద్రత-కొలెస్ట్రాల్ (వి‌ఎల్‌డి‌ఎల్) శాతం చాలా తక్కువగా ఉన్నట్లు కనుగొనబడింది.

రక్తంలో ట్రైగ్లిజరైడ్లు తగ్గించడం ద్వారా కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో కూడా కొత్తిమీర సహాయపడుతుంది మరియు మంచి కొలెస్ట్రాల్ అని పిలిచే అధిక-సాంద్రత కొలెస్ట్రాల్ కంటెంట్ (హెచ్‌డి‌ఎల్) ను పెంచడంలో కూడా సహాయపడుతుంది.  

 (మరింత చదవండి: అధిక కొలెస్ట్రాల్ లక్షణాలు

మూత్రపిండాల కోసం కొత్తిమీర ఆకులు - Coriander leaves for kidney in Telugu

పొటాషియం, కాల్షియం, ఇనుము, మాంగనీస్, మరియు మెగ్నీషియమం వంటి ఖనిజాల మూలకారకాలు కొత్తిమీరలో కనిపిస్తాయి. ఉత్తమమైన ఆరోగ్యం కాపాడుకోవడం కోసం అవసరమైన   విటమిన్ ఎవిటమిన్ సివిటమిన్ బి వంటి విటమిన్లు మరియు బీటా-కెరోటిన్ (విటమిన్ ఎ నిర్మాణం కోసం బాధ్యత వహించే ఒక వర్ణద్రవ్యం) వంటివి కొత్తిమీర ఆకులలో కనిపిస్తాయి. కొత్తిమీర ఒక మూత్రవిసర్జకంగా పనిచేస్తుంది మరియు మూత్రవిసర్జన మొత్తాన్ని పెంచడం ద్వారా మూత్రపిండాల యొక్క శుభ్రపరిచే ప్రక్రియలో సహాయం చేస్తుంది మరియు శరీరం‌ నుండి విష వ్యర్థాలను తొలగించడంలో సహాయం చేస్తుంది.

నీటిలో తాజా కొత్తిమీర ఆకులు గ్రైండింగ్ నుండి తయారుచేసిన రసం అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలిగిఉంది.  అంతేకాకుండా, కొత్తిమీర ఆకులను గ్రైండింగ్ చేయడం మరియు వాటిని ఇతర పదార్థాలతో కలపడం ద్వారా అనేక కషాయాలు (మిశ్రమాలు) తయారుచేయబడతాయి మరియు అనేక ఆరోగ్య ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు.  కొత్తిమీర ఆకుల నుండి తయారైన రసం నుండి పొందే ప్రధాన ప్రయోజనాలు క్రింద చర్చించబడ్డాయి.  

బరువు తగ్గడం కోసం కొత్తిమీర ఆకుల రసం - Coriander leaves juice for weight loss in Telugu

నిపుణులకు సమయం ఉంటుంది మరియు సమర్థవంతంగా బరువు తగ్గడం కోసం మరలా కొత్తిమీర ఆకుల రసాన్ని సిఫార్సు చేసారు.

కొత్తిమీర‌లో ఉండే ముఖ్యమైన నూనెలు, ప్రేగులలోని ఏదేని అనవసర సూక్ష్మజీవులను తొలగించడం ద్వారా ప్రేగులను శుభ్రపరచడానికి సహాయంచేస్తాయి మరియు ఉబ్బరం కలగడానికి కారణమయ్యే వ్యర్థాలను తొలగించడం‌లో బాధ్యత వహిస్తాయి.  ఇది బరువు తగ్గడం‌ సాధించడం‌లో సహాయపడుతుంది.

అదనంగా, కొత్తిమీర ఆకులలోని పాలీఫినాల్స్ కొవ్వులతో పోరాడడం‌లో మరియు వాటి డిపాజిషన్ నివారించడం‌లో సహాయపడుతుంది. కొత్తిమీర ఆకు యొక్క ఈ లక్షణాలు అన్నీ వ్యక్తులు బరువు తగ్గడాన్ని ప్రోత్సహిస్తాయి.  

myUpchar doctors after many years of research have created myUpchar Ayurveda Kesh Art Hair Oil by using 100% original and pure herbs of Ayurveda. This Ayurvedic medicine has been recommended by our doctors to more than 1 lakh people for multiple hair problems (hair fall, gray hair, and dandruff) with good results.
Bhringraj Hair Oil
₹546  ₹850  35% OFF
BUY NOW

ఆరోగ్యకరమైన చర్మం కోసం కొత్తిమీర ఆకుల రసం - Coriander leaves juice for healthy skin in Telugu

కొత్తిమీర ఆకులు, రసంగా ఉపయోగించినప్పుడు లేదా పేస్ట్ గా అప్లై చేసినప్పుడు,  మొటిమలు మరియు నల్లమచ్చలను తగ్గిస్తుంది. జిడ్డు చర్మం కలిగిన వ్యక్తులు కూడా, చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకోవడానికి కొత్తిమీర ఆకు రసం లేదా పేస్ట్‌ను ఉపయోగించవచ్చు.

కొత్తిమీర ఆకు రసం యాంటిబ్యాక్టిరియల్ మరియు యాంటిఫంగల్ లక్షణాలను కలిగిఉంటుంది, జిడ్డు చర్మం మరియు ఇతర సంబంధిత చర్మ సమస్యలకు బాధ్యత వహించే బ్యాక్టీరియా మరియు ఫంగి తొలగింపులో ఇది ఒక క్లీ‌న్సర్‌గా పనిచేస్తుంది.  

జుట్టు నష్టం కోసం కొత్తిమీర ఆకుల రసం - Coriander leaves juice for hair loss in Telugu

కొత్తిమీర ఆకు రసం లేదా పేస్ట్ జుట్టు రాలడం నిరోధించడానికి సహాయపడుతుంది.  కొత్తిమీర పుష్కలంగా విటమిన్ ఎవిటమిన్ బి, మరియు విటమిన్ కె లను కలిగిఉంటుంది.  కెరాటిన్ అన్నది జుట్టు మూలాల్ని బలపరచడం కోసం మరియు జుట్టు పగలడం నివారించడానికి అవసరమైన ప్రొటీన్.

కెరాటిన్ ఏర్పడటానికి విటమిన్ కె చాలా అవసరం.  కొత్తిమీర ఆకు రసాన్ని తీసుకోవడం, కెరాటిన్ యొక్క చేరిక లేక ఏర్పాటుకు సహాయపడుతుంది, ఫలితంగా మెరుగైన జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.  ఇది జుట్టుకు మరింత ఘనపరిమాణం మరియు మెరుపు (ప్రకాశం) ను కూడా చేకూర్చుతుంది.  

పైన పేర్కొన్న ఆరోగ్య ప్రయోజనాలే కాకుండా, వివిధ వ్యాధులకు సంబంధించి అనేక ఉపయోగకరమైన ఔషధ ప్రయోజనాలను కొత్తిమీర కలిగిఉంది.  కొత్తిమీర యొక్క వైద్య ప్రయోజనాలు క్రింద వివరంగా చర్చించబడ్డాయి.  

  • శరీరాన్ని నిర్విషీకరణ చేస్తుంది: కొత్తిమీర కాలేయం మరియు మూత్రపిండాల యొక్క పనితీరును మెరుగుపరుస్తుంది, ఇవి మన శరీరం యొక్క సహజ నిర్విషీకరణ అవయవాలు.  ఇది డైయూరిసిస్‌ను కూడా ప్రోత్సహిస్తుంది మరియు రక్తం నుండి వ్యర్థాల బహిష్కరణను పెంచుతుంది.
  • మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది: కొత్తిమీర ఆకులు మెదడు పైన యాంటిఆక్సిడేటివ్ ప్రభావాన్ని కలిగిఉంటాయి, ఇది జ్ఞానం, మరియు జ్ఞాపకశక్తిని మెరుగుపరచడానికి కనుగొనబడింది.  ఇది యాంటి-స్ట్రెస్ మరియు యాంటి-డిప్రసంట్ ప్రభావం  యొక్క మధ్యవర్తిత్వం‌తో పాటు న్యూరోడిజెనరేటివ్ ప్రమాధాన్ని కూడా తగ్గిస్తుంది.
  • బరువు తగ్గడాన్ని ప్రోత్సహిస్తుంది: కొత్తిమీర యొక్క నిర్వీషకరణ ప్రభావాలు దీనిని ఒక అద్భుతమైన బరువు తగ్గించే నివారిణిగా తయారుచేసాయి.  ఇది శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కూడా తగ్గిస్తుంది మరియు గట్ మైక్రోఫ్లోరాను మెరుగుపరుస్తుంది, శరీర బరువులో తగ్గుదలను ప్రోత్సహిస్తుంది.
  • చర్మం కోసం ప్రయోజనాలు: కొత్తిమీర పేస్ట్ మరియు జ్యూసును, సమయోచితంగా వినియోగించినప్పుడు లేదా అప్లై చేసినప్పుడు, మొటిమలు మరియు నల్ల మచ్చలు తగ్గిస్తుందని తెలుపబడింది.  ఇది చర్మం పైన బ్యాక్టీరియల్ మరియు ఫంగల్ పెరుగుదలను కూడా తగ్గిస్తుంది మరియు జిడ్డు చర్మం గల వారి కోసం ప్రత్యేక ఉపయోగకారిగా ఉంది. 
  • నోటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది: కొత్తిమీర సహజ యాంటిబ్యాక్టీరియల్, ఇది అంగిలిని శుభ్రపరుస్తుంది మరియు చెడు శ్వాసను తగ్గిస్తుంది.  నోటి పూతల వైద్యంలో సమర్థవంతంగా పనిచేస్తుందని కూడా ఇది సూచించబడింది.
  • మూత్ర మార్గ అంటువ్యాధుల కోసం: యుటిఐ లక్షణాలను తగ్గించడం‌లో కొత్తిమీర ద్వంద్వ ప్రయోజనాలను కలిగిఉంది.  ఇది శరీరం‌లోని వ్యాధికారకాలను బయటకు పంపించడంలో సహాయం చేయడం మాత్రమే కాకుండా మూత్రనాళంలో సూక్ష్మజీవుల పెరుగుదలను నిరోధించడం‌లో కూడా సహాయం చేస్తుంది. 

మూత్రనాళ ఇన్‌ఫెక్షన్ల కోసం కొత్తిమీర - Coriander for urinary tract infections in Telugu

యూరినరీ ట్రాక్ట్ ఇన్‌ఫెక్షన్ (యుటిఐ) అన్నది జననేంద్రియ ప్రాంతాల్లో వ్యాధికారక ఇన్‌ఫెక్షన్ల వల్ల ప్రదానంగా సంభవిస్తాయి, మూత్ర విసర్జన సమయంలో, అది మండుచుండే అనుభూతిని కలుగచేస్తుంది. వివిధ సంప్రదాయ నాటు వైద్యాలలో, కొత్తిమీర యొక్క యాంటీ మైక్రోబయల్ మరియు మూత్రవిసర్జక లక్షణాల కారణంగా మరియు అనేక యుటి‌ఐ వ్యాధుల వ్యాధికారకాలకు వ్యతిరేకంగా ఉండే వాటి ప్రభావము కారణంగా కూడా అది మూత్ర మార్గ ఇన్‌ఫెక్షన్ల చికిత్సలో ఉపయోగించబడుతుంది, అది లేకపోతే మందులకు తట్టుకోగలదు.

దద్దుర్లు మరియు అలెర్జీల కోసం కొత్తిమీర - Coriander for rashes and allergies in Telugu

కొత్తిమీర తన యొక్క యాంటి-ఇన్‌ఫ్లమేటరీ లక్షణాల వలన ప్రసిద్ది చెందింది.  కొత్తిమీర యొక్క రసం,  దురద, మంట, చర్మం దద్దుర్లు మరియు పురుగు కాట్లు ద్వారా కారణమైన అలెర్జీల యొక్క చికిత్స కోసం ఆయుర్వేద అభ్యాసకుల ద్వారా సిఫార్సు చేయడమైనది.  కొత్తిమీర రసం  కాలిన గాయాలుగవత జ్వరం (అలెర్జీ రినైటిస్) యొక్క చికిత్సలో ప్రభావవంతమైనదిగా కూడా రుజువైంది.

క్యా‌న్సర్ కోసం కొత్తిమీర - Coriander for cancer in Telugu

కొత్తిమీర యాంటి-మ్యుటాజెనిక్ (క్యా‌న్సర్ వంటి పరిస్థితులను పెంచే మ్యుటేష‌న్స్‌ను తగ్గించడం)  లక్షణము కలిగిఉన్నందువల్ల,ఇది క్యా‌న్సర్‌కు వ్యతిరేకంగా పనిచేస్తుందని పేర్కొనబడింది.  ఒక అధ్యయనం‌లో, కొత్తిమీర రసం యాంటి-మ్యుటాజెనిక్ లక్షణాలను కలిగిఉన్నట్లు కనుగొనబడింది, డి‌ఎన్‌ఎ‌ లో మ్యుటేషన్‌ తగ్గించగల సామర్థ్యం ఇది కలిగిఉన్నది, ప్రత్యేకించి కార్సినోజెనిక్ ఉత్పత్తులలో (క్యా‌న్సర్ కలిగిస్తుంది).  అయితే, యాంటి-కార్సినోజెనిక్ గా పనిచేయగల కొత్తిమీర యొక్క సామర్థ్యం, ఇంకా ఇన్-వివో ‌లో పరీక్షించబడలేదు.

ఆందోళన మరియు కుంగుబాటు కోసం కొత్తిమీర - Coriander for anxiety and depression in Telugu

కొత్తిమీర యొక్క యాంటి-డిప్రసంట్ లక్షణాల వల్ల దానిని విస్తృతంగా ఉపయోగిస్తున్నారు.  అల్జీమర్స్ వ్యాధి పైన కొత్తిమీర యొక్క ప్రభావాల గురించి నిపుణల అధ్యయనం  ఆందోళన చికిత్సలో దాని యొక్క పొటె‌న్షియల్ ఉపయోగాలను కనుగొన్నారు.    అధ్యయనం‌లో, కొత్తిమీర నుండి తీసిన అస్థిర నూనెలను, నాడీ వ్యవస్థ వ్యాధులు గల రోగులకు ఇచ్చినప్పుడు, ఆందోళన మరియు ఒత్తిడిని ఎదుర్కొనేందుకు కూడా ఇది సహాయపడుతుందని కనుగొనబడింది.  ఇది గ్లూటాతియోన్ స్థాయిలలో క్షీణత వల్ల ప్రధానంగా సాధ్యపడుతుంది, ఇది మెదడు కణాల యొక్క వ్యతిరేక ఆక్సీకరణను సూచించే పెరుగుదలకు కారణమవుతుంది, అందువల్ల, ఆందోళన మరియు సంబంధిత పరిస్థితులు తగ్గుతాయి.

 (మరింత చదవండి: కుంగుబాటు లక్షణాలు)

అల్జీమర్స్ వ్యాధి కోసం కొత్తిమీర - Coriander for Alzheimer’s Disease in Telugu

న్యూరోడిజనరేటివ్ (నాడీ వ్యవస్థ యొక్క క్షీణత) రుగ్మతలైన    అల్జీమర్స్ వంటివి మోతాదు-ఆధారిత పద్ధతిలో కొత్తిమీర యొక్క నిర్వహణ ద్వారా నిరోధించవచ్చు. న్యూరోట్రా‌న్స్మిటర్, ఎసిటైల్కోలిన్ యొక్క లోపం అల్జీమర్స్‌కు దారితీస్తుంది. కండరాల కదలిక ఫంక్షన్ కోసం ఎసిటైల్కోలిన్ అవసరమవుతుంది మరియు దాని డిగ్రెడేషన్ పక్షవాతం వంటి పరిస్థితులకు దారి తీస్తుంది.  ఎంజై‌మ్ కొలినెస్టెరేస్ యొక్క చర్యను అడ్డుకోవడం ద్వారా కొత్తిమీర,  వ్యాధిని నిరోధిస్తుంది, ఇది ఎసిటైల్కోలిన్ పతనానికి బాధ్యత వహిస్తుంది.

ఆర్థరైటిస్ కోసం కొత్తిమీర - Coriander for arthritis in Telugu

కొరియండ్ర‌మ్ సాటివ‌మ్ యాంటి-ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలను కలిగిఉంటుంది. ఆర్థరైటిస్ వంటి వ్యాధుల విషయం‌లో కొత్తిమీర యొక్క యాంటి-ఇన్‌ఫ్లమేటరీ లక్షణం చాలా ప్రభావవంతంగా ఉంటుంది.  రుమటాయిడ్ ఆర్థరైటిస్ కలిగిన రోగులు తీవ్రమైన చర్మ వాపులు మరియు చర్మపు కణాంకురణం అనుభవిస్తారు. కొత్తిమీర సారం చర్మం వాపు తగ్గించడంలో సహాయపడుతుంది, ఇది అసౌకర్యాన్ని తగ్గిస్తుంది మరియు చర్మ ఆకృతిని మెరుగు పరుస్తుందని ఒక అధ్యయనంలో కనుగొనబడింది.

కొత్తిమీర ఒకవేళ క్రమంగా సాధారణ ఆహారంలో చేర్చబడితే, కొత్తిమీర దాని ఆరోగ్య మరియు ఔషధ ఉపయోగాలకు మాత్రమే కాకుండా, కొన్ని ఇతర ముఖ్యమైన ప్రయోజనాలకు కూడా దారితీస్తుంది.  కొత్తిమీర యొక్క ఇతర ప్రయోజనాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి.

భారీ లోహాల తొలగింపు కోసం కొత్తిమీర - Coriander for removing of heavy metals in Telugu

ఒక అధ్యయనం ప్రకారం, కాలుష్యానికి గురికావడం వలన, శరీరం‌లో కనుగొనబడిన విష భారీ లోహాలను కొత్తిమీర తొలగిస్తుంది మరియు వాటి ద్వారా ఏర్పడే నష్ట స్థాయిని తగ్గిస్తుంది.  భారీ లోహాలుగా సీసం, కాడ్మియ‌మ్, ఆర్సెనిక్, పాదరసం, శరీరంలో సేంద్రియ ఒత్తిడి యొక్క స్థాయిని తగ్గించవచ్చు మరియు హెర్పెస్ సిం‌ప్లెక్స్ మరియు క్లామిడియా ట్రోకోమాటిస్ వంటి వ్యాధికారకాల ద్వారా ఏర్పడ్డ ఇన్‌ఫెక్షన్ యొక్క దీర్ఘకాలిక పున:స్థితి కారణంగా అనేక ముఖ్యమైన అవయవాల నష్టానికి దారితీస్తుంది.  కొత్తిమీర, శరీరం‌ నుండి ఇటువంటి విషపూరిత లోహాల విసర్జనను మెరుగుపరుస్తుంది మరియు యాంటీబయాటిక్స్ వైపుగా మరింత బాధ్యతాయుతంగా వీటిని చేస్తుంది.

ఫుడ్ పాయిజనింగ్ కోసం కొత్తిమీర - Coriander for food poisoning in Telugu

కొత్తిమీర యొక్క వినియోగం ఆంత్రము యొక్క శుద్ధిలో సహాయపడుతుంది మరియు మైక్రోబయల్ ఇన్‌ఫెక్షన్లను నివారించడం‌లో సహాయపడుతుంది.  అనవసర బ్యాక్టీరియా మరియు ఫంగి వంటి వ్యాధికారకాలు అన్నవి అపరిశుభ్ర పరిస్థితుల క్రింద తయారుచేసిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల దాని గుండా శరీరం‌లోకి ప్రవేశించవచ్చు.  కొత్తిమీర యొక్క యాంటిమైక్రోబయల్ లక్షణాలు అన్నవి ఆహార సంబంధ వ్యాధికారకాల నుండి తలెత్తే ఏ విధమైన విషాహారము నైనా కూడా నివారించడంలో ఉపయోగపడతాయి మరియు ఇన్‌ఫెక్షన్లను నివారించడం‌లో ఉపయోగపడతాయి.

మైక్రోబయల్ ఇన్‌ఫెక్షన్ల కోసం కొత్తిమీర - Coriander for microbial infections in Telugu

కొత్తిమీర యొక్క ఎసె‌న్షియల్ ఆయిల్‌లోని పొడవైన-గొలుసు ఆల్డీహైడ్ల ఉనికి కారణంగా, ఇది అనేక సూక్ష్మజీవుల సంక్రమణలను నిరోధించడానికి సహాయపడుతుంది.  వ్యాధికారకాల ద్వారా ఏర్పడిన ఇన్‌ఫెక్షన్లుగా లిస్టెరియా మోనోసైటోజె‌న్స్సాల్మోనెల్లా ఎంటెరికాఎస్చెరిచియా కోలిబాసిల్లస్ ఎస్‌పిపిస్టాఫైలాకోకస్ ఏరియస్, మరియు కాండిడా ఆల్బికా‌న్స్ లు ఉన్నాయి, ఇవి తీవ్రమైన అంటురోగాలు రావడానికి కారణమవుతాయి కొత్తిమీరను తీసుకోవడం ద్వారా వీటిని నిరోధించవచ్చు.

నోటి పరిశుభ్రత కోసం కొత్తిమీర - Coriander for oral hygiene in Telugu

కొత్తిమీరను వ్యక్తిగతంగా ఉపయోగించవచ్చు లేదా లవంగాలు అనే ఇతర శుద్ధి ఏజెంట్లతో కషాయాలతో సమర్థవంతంగా నోటి పరిశుభ్రత కోసం ఉపయోగించవచ్చు.  కొత్తిమీరలో ఉండే ఎసె‌న్షియల్ ఆయిల్, సిట్రోనెల్లాల్, పనితీరులో  యాంటిసెప్టిక్‌గా పనిచేస్తాయి.  ఈ లక్షణం నోటి పుండు యొక్క వైద్యంలో మరియు శ్వాస  పరిశుభ్రతలో సహాయపడుతుంది. కొత్తిమీర పేస్ట్ యొక్క వాడకం మీద నోటి పుండ్లలో ఒక గణనీయమైన తగ్గుదల జరిగిందని అధ్యయనాలు వెల్లడించాయి.  

ఆరోగ్యకరమైన కళ్ల కోసం కొత్తిమీర - Coriander for healthy eyes in Telugu

కొత్తిమీరలో విటమిన్ ఎ సమృద్ధిగా ఉంటుంది, ఇది కంటిలోని కడ్డీలు మరియు కోన్ అబివృద్ధికి చాలా అవసరం ఉంది, ఇది దృష్టిలో సహాయం చేస్తుంది.    కొత్తిమీరలో అధిక మొత్తంలో ఉండే విటమిన్ ఎ కళ్లను రక్షించడానికి సహాయపడుతుంది.  ఇది రేచీకటి నివారించడానికి కూడా సహాయం చేస్తుంది.  కొత్తిమీరలో ఉండే విటమిన్ ఎ కెరోటినాయిడ్ల నుండి బీటా-కెరోటిన్‌ (దీని నుండి విటమిన్ ఎ ఉత్పత్తి చేయబడుతుంది) గా వస్తుంది,  అందువల్ల, చాలా అధిక మొత్తం కూడా విషపూరితానికి కారణం కాదు. 

కొత్తిమీర రసం యొక్క అనేక ఆరోగ్య ప్రయోజనాల దృష్ట్యా దానిని వినియోగిస్తారు, క్రింద పేర్కొన్న సాధారణ దశలను అనుసరించడం ద్వారా దీనిని ఇంట్లో తయారుచేయవచ్చు.

  • చేతినిండుగా తీసుకున్న కొత్తిమీర ఆకులను పూర్తిగా శుభ్రం చేయాలి మరియు తర్వాత సన్నగా కత్తిరించాలి.
  • కొత్తిమీర ఆకులకు 1/2 కప్పు నీటిని కలపాలి మరియు దానిని ఒక జ్యూసర్‌లో రుబ్బాలి.
  • ఒక స్ట్రయినర్ గుండా జ్యూస్‌ను వడపోయాలి మరియు వెంటనే దానిని సర్వ్ చేయాలి.  వినియోగించడం కోసం అదనపు నీటిని జోడించడం ద్వారా (1/4 కప్పు నీరు) కూడా ఈ రసాన్ని కరిగించవచ్చు.
myUpchar doctors after many years of research have created myUpchar Ayurveda Urjas Energy & Power Capsule by using 100% original and pure herbs of Ayurveda. This Ayurvedic medicine has been recommended by our doctors to lakhs of people for problems like physical and sexual weakness and fatigue, with good results.
Power Capsule For Men
₹495  ₹799  38% OFF
BUY NOW

కొత్తిమీర, సాధారణంగా, ఒక క్రమమైన మొత్తం‌లో వినియోగించి నప్పుడు మరియు సూచించిన ఔషధ మొత్తం‌లో తీసుకున్నప్పటికీ కూడా సురక్షితమైనది.  అయితే, క్రింద ఇవ్వబడిన వాటితో కలుపుకొని కొన్ని దుష్ప్రభావాలు తలెత్తవచ్చు.

  • కొంతమంది ప్రజలలో కొత్తిమీర యొక్క కొన్ని సందర్భాలుగా  కడుపునొప్పి మరియు అతిసారం ఏర్పడటానికి కారణమయ్యే కొత్తిమీర యొక్క కొన్ని సందర్భాలుగా రిపోర్ట్ చేయబడ్డాయి. ఒకవేళ ఈ పరిస్థితి కొనసాగుతుంటే, ఆ వ్యక్తి వైద్యుడిని సంప్రదించడం ముఖ్యం.
  • కొత్తిమీర యొక్క పెరిగిన వినియోగం కొంతమంది ప్రజలలో అలెర్జీ ప్రతిచర్యలకు కారణం కావచ్చు.  ఏదైనా అలెర్జీ అభివృద్ధి చెందుతున్న సందర్భం‌లో, వెంటనే మీ వైద్యుడిని సంప్రదించాలి మరియు సరైన సంప్రదింపుల వరకూ మరింత ఉపయోగించడం ఆపివేయాలి.
  • కొత్తిమీర యొక్క అధిక వినియోగం, కొంతమంది ప్రజలలో రక్తపోటు చాలా తక్కువగా మారేందుకు కారణమవుతుంది.  ఇది మూర్ఛ ఏర్పడే సమయాలకు లేదా స్పృహ కోల్పోయే సమయాలకు దారితీస్తుంది.
  • శ్వాస రుగ్మతలు ఉన్నవారు, కొత్తిమీర వినియోగానికి ముందుగా వైద్యుడిని సంప్రదించవలసిన అవసరమున్నది, ఎందుకంటే ఇటువంటి పరిస్థితులు కలిగిన కొంతమంది వ్యక్తులలో  శ్వాస తక్కువగా తీసుకోవడం మరియు శ్వాస రుగ్మతలు యొక్క నివేదికలు ఉన్నాయి.
  • కొత్తిమీరలో ఉండే కొన్ని ఆమ్ల అంశాలు కొంతమంది వ్యక్తులలో సూర్యకాంతి వైపుగా సున్నితత్వం కలుగుటకు కారణమవుతాయి.
  • కొత్తిమీర తీసుకోవడం వల్ల కొంతమంది వ్యక్తులలో ఛాతీ నొప్పి యొక్క నివేదికలు ఉన్నాయి. అందువలన, ఔషధ ప్రయోజనాల కోసం కొత్తిమీరను వినియోగించడానికి ముందుగా, వైద్యుడిని సంప్రదించడం అత్యంత అవసరం.  
  • కొత్తిమీర మానవ పునరుత్పత్తి గ్రంథి యొక్క కార్యకలాపాలకు హాని కలిగిస్తుంది మరియు గర్భిణీ స్త్రీలలో పిండం యొక్క అభివృద్ధిని దెబ్బ తీయవచ్చు.  అందువల్ల, గర్భిణీ స్త్రీలు, అధిక మొత్తం‌లో కొత్తిమీరను తినకూడదు.

Medicines / Products that contain Coriander

వనరులు

  1. Liu QF et al. Coriandrum sativum Suppresses Aβ42-Induced ROS Increases, Glial Cell Proliferation, and ERK Activation. Am J Chin Med. 2016;44(7):1325-1347. Epub 2016 Oct 25. PMID: 27776428
  2. van Dort JB, Ketelaars GA, Daems WT, de Bruijn WC. Ultrastructural electron probe X-ray microanalytical reaction product identification of three different enzymes in the same mouse resident peritoneal macrophage. Histochemistry. 1989;92(3):243-53. PMID: 2777642
  3. Samojlik I, Lakić N, Mimica-Dukić N, Daković-Svajcer K, Bozin B. Antioxidant and hepatoprotective potential of essential oils of coriander (Coriandrum sativum L.) and caraway (Carum carvi L.) (Apiaceae). J Agric Food Chem. 2010 Aug 11;58(15):8848-53. PMID: 20608729
  4. Wattanathorn J. Anticataractogenesis and Antiretinopathy Effects of the Novel Protective Agent Containing the Combined Extract of Mango and Vietnamese Coriander in STZ-Diabetic Rats. Oxid Med Cell Longev. 2017;2017:5290161. PMID: 28904737
  5. Aissaoui A, El-Hilaly J, Israili ZH, Lyoussi B. Acute diuretic effect of continuous intravenous infusion of an aqueous extract of Coriandrum sativum L. in anesthetized rats. J Ethnopharmacol. 2008 Jan 4;115(1):89-95. Epub 2007 Sep 16. PMID: 17961943
  6. Sahib NG et al. Coriander (Coriandrum sativum L.): a potential source of high-value components for functional foods and nutraceuticals--a review. Phytother Res. 2013 Oct;27(10):1439-56. PMID: 23281145
  7. Tang EL, Rajarajeswaran J, Fung SY, Kanthimathi MS. Antioxidant activity of Coriandrum sativum and protection against DNA damage and cancer cell migration. Format: AbstractSend to BMC Complement Altern Med. 2013 Dec 9;13:347. PMID: 24517259
  8. Patel DK et al. Cardio protective effect of Coriandrum sativum L. on isoproterenol induced myocardial necrosis in rats. Food Chem Toxicol. 2012 Sep;50(9):3120-5. PMID: 22750725
  9. Nishio R, Tamano H, Morioka H, Takeuchi A, Takeda A. Intake of Heated Leaf Extract of Coriandrum sativum Contributes to Resistance to Oxidative Stress via Decreases in Heavy Metal Concentrations in the Kidney. Plant Foods Hum Nutr. 2019 Jun;74(2):204-209. PMID: 30783906.
  10. Cuppari Lilian, et al. A practical approach to dietary interventions for nondialysis-dependent CKD patients: the experience of a reference nephrology center in Brazil. BMC Nephrol. 2016; 17: 85. PMID: 27423180.
  11. Rajeshwari C.U., Siri Suphi, Andallu Bondada. Antioxidant and antiarthritic potential of coriander (Coriandrum sativum L.) leaves. e-SPEN Journal. 2012; 7(6): e223–e228.
  12. Cioanca O, Hritcu L, Mihasan M, Hancianu M. Cognitive-enhancing and antioxidant activities of inhaled coriander volatile oil in amyloid β(1-42) rat model of Alzheimer's disease. Physiol Behav. 2013 Aug 15; 120: 193-202. PMID: 23958472.
Read on app