క్యాలమైన్ లోషన్ అంటే ఏమిటి?
జింక్ ఖనిజం యొక్క పురాతనమైన పేరే ‘క్యాలమైన్.’ దీన్ని తెలుగులో ‘తుత్తునాగమ’ని మరియు ‘తగరం’ అని కూడా అంటారు. అనేక రకాల చర్మ వ్యాధులకు మరియు చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపర్చడానికి క్యాలమైన్ లోషన్ పలు విధాలుగా ఉపయోగపడుతుంది. క్యాలామైన్ లోషన్ ను క్రీస్తుకు పూర్వం 1500 నాటి నుండి ఉపయోగిస్తున్నారు. క్యాలమైన్ ప్రధానంగా జింక్ ఆక్సైడ్ మరియు ఇనుప ఆక్సైడ్తో కూడుకుని ఉంటుంది. అనేక కాస్మెటిక్ ఉత్పత్తులలో ఇనుము ఆక్సైడ్లను ప్రముఖ భాగాలలో ఒకటిగా ఉపయోగిస్తున్నారు.
ఫినాల్ మరియు కాల్షియం హైడ్రాక్సైడ్ వంటి అదనపు సమ్మేళనాలను కలిపి గ్లిజరిన్-లాంటి చిక్కదనాన్ని క్యాలమైన్ లోషన్కు జోడించడం జరుగుతుంది. క్యాలమైన్ ఔషధం యొక్క వైద్యం గుణం లేక మాన్పుడు ప్రభావం జింక్ ఆక్సైడ్ ద్వారా ఒనగూడిందని నమ్ముతారు. లాటిన్ పదం 'లాపిస్ కాలమినారిస్' నుంచి ‘క్యాలమిన్’ అనే పేరు వచ్చింది, ఇది సాధారణంగా జింక్ ఖనిజాలకు పాత పేరు.
క్యాలమైన్ లోషన్లను ప్రధానంగా దురద చికిత్సకు వాడే లోషన్లలో ఉపయోగిస్తారు. ఈ లోషన్ ను నేరుగా చర్మంపై రాయడమో లేక పూయడానికో ఉపయోగించడం జరుగుతోంది. అంతేకాకుండా, క్యాలమైన్ లోషన్ ఎండవల్ల కమిలిన మచ్చలు, కీటకాల కాట్లు మరియు ‘పాయిజన్ ఐవీ ఓక్’ అనబడే మరోరకమైన దద్దుర్లవంటి చర్మవ్యాధి వల్ల కలిగే నొప్పికి ఉపశమనం కల్గించే మందుగా కూడా ప్రసిద్ది చెందింది. ఈ వ్యాసంలో క్యాలమైన్ లోషన్ యొక్క అనేక ప్రయోజనాలు మరియు దాని భాగాల గురించి ఈ వ్యాసంలో వివరంగా చర్చించబడ్డాయి.