అరటిపండ్ల గురించి ప్రాసభరితమైన పాటలు మరియు ఆసక్తికరమైన కథలు పిల్లలకోసమని చాలానే రచింపబడ్డాయి. ఈ రుచికరమైన మరియు పుష్టికరమైన పండ్లు పచ్చని ఆకులతో కూడిన అరటి చెట్టుకు కాస్తాయి. ఆంగ్లంలో అరటిపండును “బనానా” (బనానా) అంటారు. ఈ బనానా అనే పదాన్ని అరబిక్ పదమైన "బనాన్" నుండి తీసుకోబడింది.బనాన్ అంటే వేలికొనలు అని అర్థం. ప్రపంచవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో అరటిపండ్లు పండుతాయి, ముఖ్యంగా ఉష్ణమండల ప్రాంతాల్లో అరటి తోటలు విరివిగా కనిపిస్తాయి. అరటి పండ్ల కొరకే ఎక్కువగా అరటి మొక్కల్ని (పిలకల్ని) నాటి పంట పండిస్తారు; వృక్షశాస్త్రపరంగా ఈ అరటి ఓ రకమైన బెర్రీ లేక ‘మృదుఫలం.’ కొన్ని అరటి రకాల్ని కేవలం అలంకారం కోసం లేదా వాటి నార కోసం పండిస్తారు, ఇలాంటి రకాల అరటి చెట్లు చాలా బలంగా ఉంటాయి. సుమారు 110 వివిధ రకాల అరటి జాతులు ఉన్నాయి. మన భారతీయ సంస్కృతి మరియు వాణిజ్యం ప్రకారం, "అరటి" ని సాధారణంగా “మృదు మధుర ఫలం” గా సూచించబడుతుంది, అంటే తీపిరుచితో కూడిన మెత్తని పండు అని అర్థం. అందువల్ల, అరటిని భోజనానంతరం తినే ‘ఫలహార అరటి పండ్లు’ (డెజర్ట్ అరటి) అని కూడా పిలుస్తారు. ఈ పండ్ల యొక్క ఇతర వృక్షరకాలు ఇచ్చే పండ్లు గట్టిగాను మరియు గంజి-గంజిగా (starchier) ఉండే అరటి పండ్లను కాస్తాయి. వీటినే సాధారణంగా “అరటి” చెట్లుగా పిలుస్తారు. పచ్చి అరటి కాయలను, అరటి చెట్టు భాగాల్ని ఎక్కువగా వంటలు, కూరలు వండడానికి ఉపయోగిస్తారు లేదా అరటి చెట్ల నుండి లభించే నార కోసం కూడా అరటిని పండిస్తారు.
అరటి బూడిదను ఉపయోగించి సబ్బులు తయారు చేస్తున్నారు. ఆసియాలో, నీడలో పెరిగే కొన్ని మొక్కలకోసం తన వెడల్పాటి ఆకులతో మంచి నీడను కల్పించే అరటి చెట్లను ఉపయోగించడం జరుగుతోంది. అలా అరటి చెట్ల నీడలో పెరిగే పంట రకాలేవంటే కోకోవ, కాఫీ, నల్ల మిరియాలు మరియు జాజికాయ తదితరాలు. అరటి యొక్క ఈ నీడనిచ్చే కారణంగానే, ఇతర పంటల తోటల్లో (plantations) అరటి చెట్లను కూడా మనం చూడవచ్చు.
అరటి మొక్క పచ్చని ఆకులతో కూడిన అతిపెద్ద పుష్పించే చెట్టుగా లెక్కించబడింది. అందువలన, అరటి చెట్లను తరచుగా మాన్లు (trees) గా పొరబాటుగా అర్థం చేసుకోవడం జరుగుతుంది. పండని అరటికాయలు ఎప్పుడూ ఆకుపచ్చ రంగులో ఉంటాయి. పచ్చి అరటి కాయలు ఎప్పుడూ పసుపు రంగులో ఉండే పండిన అరటి పండ్లతో పోలిస్తే భిన్నంగా ఉంటాయి. పచ్చిఅరటికాయ మాగి పసుపు రంగులోకి లేదా ఎర్రటి రంగులోకి మారుతుంది. అరటి ఆకు నిర్మాణం మెలికెలు కలిగి ఆకు పెద్దగా ఉంటుంది, మరియు ఆకు 2.65 మీటర్ల పొడవు మరియు 60 సెంమీ వెడల్పు పెరుగుతుంది. గట్టిగా వీచే గాలికి సులభంగా చిరిగిపోగలవు కూడా, అందుకే ఒకింత ముదిరిన అరటి ఆకులు చిరిగి చీలికల రూపంలో (frayed) కనబడతాయి.
ప్రపంచవ్యాప్తంగా 170 కంటే ఎక్కువ దేశాలు అరటిని పండిస్తున్నాయి. అరటిపండ్లను ముఖ్యంగా దాని యొక్క పోషక ప్రయోజనాల కోసం ప్రేమపంచమంతటా పండించబడుతోంది. అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్ధికవ్యవస్థను పెంచడంలో అరటి ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. దాని అనేక ఆరోగ్య ప్రయోజనాల కారణంగా అరటి ఒక అద్భుతమైన ఆహారం (super food)గా పరిగణించబడుతుంది. అరటిపండు విటమిన్ B6 ను అధికంగా కల్గి ఉంటుంది. కేలరీలు మరియు కొవ్వుల్ని తక్కువగా కల్గిన అరటి సులభంగా జీర్ణం అవుతుంది. అరటి పండును సంపూర్ణ ఆహారంగా పరిగణించబడుతుంది, ఎందుకంటే, దీనిలో పీచుపదార్థాలు, విటమిన్ సి, పొటాషియం మరియు మెగ్నీషియం కలిగి ఉంటాయి కాబట్టి. అరటిపండ్లకు అర్ద చంద్రాకృతి లాంటి ఒక విలక్షణమైన ఆకారం ఉంటుంది దీని రూపం చాలా ఆకర్షణీయంగా ఉండి అందర్నీ ఆకర్షిస్తుంది. అరటి పండ్లు కోతులకు కూడా ఎంతో ఇష్టం!
అరటి గురించిన ప్రాథమిక వాస్తవాలు
- వృక్షశాస్త్రంలో అరటి పేరు: ముసా అక్యూమినేట్ (Musa acuminate)
- కుటుంబం: ముసాసెయే
- జాతి: ముసా
- సాధారణ పేరు: అరటి
- సంస్కృతం పేరు: “కదళీ” ఫలం
- అరటిచెట్టులో ఉపయోగించే భాగాలు: తోలు, గుజ్జు, పండ్లు మరియు కాండం.
- అరటి పండే ప్రాంతాల పంపిణీ: ఇతర ఉష్ణమండల పండ్లు లాగానే అరటిపండ్లు ఆఫ్రికా, లాటిన్ అమెరికా, పసిఫిక్, మరియు కరేబియన్లలో పెరుగుతాయి. అనేక అభివృద్ధి చెందుతున్న దేశాలకు అరటి ప్రధాన ఆహారంగా ఉంది. అన్ని అరటి రకాల్లో 15 నుండి 20% మాత్రమే వాణిజ్య ఉపయోగం కోసం ప్రపంచ మార్కెట్కు ఎగుమతి చేయబడుతున్నాయి.
- అరటి గురించిన ఆసక్తికరమైన నిజాలు: తొలిగా ఉపయోగించిన అరటి యొక్క శాస్త్రీయ నామం ముసా స్యాపియంటం, అంటే అర్థం "జ్ఞానుల యొక్క ఫలము" అని. యాపిల్ పండు మరియు పుచ్చకాయలు వలె అరటిపండు కూడా నీటిలో తేలుతుంది. US లో అరటిని వాణిజ్యపరంగా పండించే ఏకైక ప్రదేశం హవాయ్, అయినా; ఒకప్పుడు దక్షిణ కాలిఫోర్నియా మరియు ఫ్లోరిడాలో కూడా అరటిని పండించారు.