బాదం పప్పులు అన్నవి పోషక గింజలు, ఇవి ఒక చిన్న షెల్‌లో ప్యాక్ చేయబడి ఉంటాయి. సాధారణంగా బాదం అనే భారతీయ పేరుతో పిలువబడుతాయి, బాదం పప్పులు తినదగిన విత్తనాలు, ఇవి బాదం పండ్ల యొక్క గట్టి షెల్ లోపల ఏర్పడతాయి. బాదం యొక్క ఆకారం సాధారణంగా గుడ్డు ఆకారం కలిగి దాని ఒక వైపు పదునైన అంచుతో ఉంటుంది. విత్తనం తెల్లటి రంగు కలిగిఉండి పలుచటి గోధుమ రంగు చర్మంతో కప్పబడి ఉంటుంది, వీటిని కొన్ని గంటల పాటు నీటిలో ముంచినప్పుడు, వాటి తోలు సాధారణంగా ఒలిచి వేయబడుతుంది.
పీచ్‌లు, ఆపిల్స్, బేరి, రేగు, చెర్రీలు మరియు నేరేడు పండు వంటి ఇతర చెట్ల పండ్ల జాతితో పాటు బాదం కూడా రోసేసి (రోజ్) కుటుంబానికి చెందినవి. మధ్య ఆసియా మరియు చైనాలో ఇవి పుట్టాయని వారు నమ్ముతారు. ప్రస్తుతం, యునైటెడ్ స్టేట్స్ బాదం ఉత్పత్తిలో అతి పెద్దదిగా ఉంది, దాని తర్వాత స్పెయిన్ మరియు ఇరాన్ ఉత్పత్తిదారులుగా ఉన్నాయి. భారతదేశంలో, బాదం ఉత్పత్తి చేసే రెండు అతి పెద్ద రాష్ట్రాలుగా జమ్ము & కాశ్మీర్ మరియు హిమాచల్ ప్రదేశ్ ఉన్నాయి.
ఎక్కువమంది ప్రజలు బాదంను పచ్చిగా తినడానికి ఇష్టపడుతున్నప్పటికీ, ఇది విభిన్న రకాల వంటకాలలో ఉపయోగించబడుతుంది. మధ్య ప్రాచ్యంలో, మిఠాయిలు మరియు స్నాక్స్ తయారీలో బాదం ఉపయోగిస్తారు మరియు కాఫీలో కూడా జోడించబడ్డాయి. కేక్స్, కుకీలు, నగట్, క్యాండీస్, స్నాక్ బారస్ అలాగే డిజర్ట్స్ పైన టాపింగ్స్ వంటి అనేక రకాల ఉత్పత్తులలో ఇవి ఉపయోగించబడతాయి. బాదం వెన్న, బాదం పాలు మరియు బాదం నూనె తయారీలో కూడా బాదంను ఉపయోగిస్తారు.
అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలిగినదిగా బాదంను భావిస్తారు. ఇవి ప్రొటీన్లు, ఖనిజాలు, విటమిన్లు మరియు ఫైబర్లను సమృద్ధిగా కలిగిఉంటాయి. బాదం కొలెస్ట్రాల్ స్థాయిల్ని తగ్గిస్తుంది, హృదయ సంబంధ సమస్యలు మరియు క్యాన్సర్ నివారణలో ఇది సహాయం చేస్తుంది. డయాబెటిస్ రోగులకు ఇది ఒక ఆదర్శవంతమైన స్నాక్స్ ఎంపికగా ఉంటుంది.
బాదం గురించి కొన్ని ప్రాథమిక వాస్తవాలు:
- శాస్త్రీయ నామం: ప్రునస్ డల్సీస్
- కుటుంబం: రోసేసి.
- వ్యవహారిక నామం: ఆల్మండ్స్, బాదం
- జన్మించే ప్రాంతం మరియు భౌగోళిక పంపిణీ: బాదం నైరుతి ఆసియా స్థానికతకు చెందిన ఒక చెట్టు. ప్రునస్ డల్సీస్ అన్నది ఆర్థికంగా ముఖ్యమైన ఒక పంట చెట్టు, మధ్యధరా శీతోష్ణస్థితుల్లో ఇది ప్రధానంగా పెరుగుతుంది, ప్రంపంచంలోని మొత్తం ఉత్పత్తిలో దాదాపు 70 శాతం యు.ఎస్. ఉత్పత్తి చేస్తుంది. 25 కంటే ఎక్కువ బాదం రకాలు కాలిఫోర్నియాలో పెరుగుతాయి. మార్కోనా మరియు వలెన్సియా బాదం స్పెయిన్ నుండి వస్తాయి, మరియు ఫెర్రాగ్నెస్ బాదం గ్రీస్ నుండి దిగుమతి చేయబడతాయి. మధ్య ప్రాచ్యం, భారత ఉపఖండం మరియు ఉత్తర ఆఫ్రికాలలో కూడా బాదం చెట్టు పెరుగుతుంది.