పిండం యొక్క గర్భస్రావానికి అనేక ప్రమాద కారకాలు ముడిపడి ఉంటాయి. వీటిలో వృద్ధాప్యం, ఊబకాయం మరియు మద్యం, ధూమపానం వంటి జీవనశైలి అలవాట్లు ఉన్నాయి. అయితే, సాధారణంగా స్త్రీ దీనికి బాధ్యత కలిగి ఉండదు.
మొదటి మరియు రెండవ త్రైమాసికంలో గర్భస్రావం కావడానికి కారణమైన కొన్ని రుజువు-ఆధారిత కారకాలను పరిశీలిద్దాం.
క్రోమోజోమ్ల అసాధారణతలు
ప్రతి బిడ్డ తన తల్లి మరియు తండ్రి నుండి చెరో సగం డీఎన్ఏ (DNA) ను పొందుతుంది, కాబట్టి, తల్లిదండ్రుల క్రోమోజోమ్ నిర్మాణంలో ఏదైనా అసాధారణత పిండానికి బదిలీ చేయబడుతుంది. పిండంలో అసాధారణమైన కార్యోటైప్ (క్రోమోజోమల్ నిర్మాణం) అకాలపు మరియు పునరావృత గర్భస్రావాలకు అత్యంత సాధారణ కారణాలలో ఒకటి. ఏదేమైనా, అటువంటి అసాధారణతలను కలిగి ఉన్న జంటలలో గర్భస్రావం అయ్యే అవకాశం ఉన్నప్పటికీ, అసాధారణతలు లేని జంటలలో కూడా గర్భస్రావం అయ్యే అవకాశం సమానంగా ఉంటుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి.
అలాగే, తల్లిదండ్రులు వారి డీఎన్ఏ లో ఏవైనా అసాధారణతలు కలిగి ఉన్నారా అని తనిఖీ చేసే క్రోమోజోమ్ పరీక్షలు కూడా ఉన్నాయి. అటువంటి పరిస్థితులలో గర్భం ధరించడానికి ఉత్తమమైన మార్గాల గురించి మీరు వైద్య సలహా పొందవచ్చు. ఇవి కొంచెం ఖరీదైనవైనప్పటికీ, పునరావృత గర్భస్రావాలు జరిగితే సాధారణంగా డీఎన్ఏ విశ్లేషణ పరీక్ష సూచించబడుతుంది. కాబట్టి, ఇది ఖచ్చితంగా ఆందోళన చెందాల్సిన విషయం కాదు.
సాధారణంగా, ప్రీఇంప్లాంటేషన్ జెనెటిక్ డయాగ్నసిస్ (పిజిడి [preimplantation genetic diagnosis]) ప్రాణముతో ఉండే శిశువు ప్రసవ అవకాశాలను పెంచుతుందని నమ్ముతారు, కాని ఉన్న ఆధారాలు దానికి సరిపోవు. అటువంటి సందర్భాల్లో ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ ద్వారా గర్భం ధరించడం కూడా ఒక మార్గంగా ఉంటుంది.
థైరాయిడ్ సరిగ్గా పనిచేయకపోవడం (Thyroid dysfunction)
హ్యూమన్ కోరియోనిక్ గోనాడోట్రోపిన్ (Human chorionic gonadotropin [HCG]) యొక్క పెరిగిన స్థాయి వివిధ థైరాయిడ్ హార్మోన్‌లపై ప్రభావం చూపుతుంది. చాలా మంది మహిళల్లో ఈ పరిస్థితి నయమైపోతుంది మరియు హానికరం కానప్పటికీ, ఇప్పటికే హార్మోన్ల అసాధారణతలను కలిగి ఉన్న మహిళల్లో గర్భస్రావం మరియు మృతపిండ జననం వంటి ప్రమాదాన్ని కలిగిస్తుంది. ఒక అధ్యయనం ప్రకారం, టి ఎస్ హెచ్ (TSH) స్థాయిల యొక్క పెరిగిన స్థాయిలు, > 2.5 mlU / L గర్భస్రావం ప్రమాదాన్ని పెంచుతాయి.
థైరాయిడ్ ఆటో ఇమ్యునిటీ (శరీరం థైరాయిడ్ గ్రంధికి వ్యతిరేకంగా ఆంటీబాడీలను తయారుచేసినప్పుడు) ఉన్న మహిళలకు కూడా అదే జరుగుతుంది. ఒక నమ్మకం ఏమిటంటే, అధిక సంఖ్యలో ఆటోఆంటిబాడీలు గర్భధారణను ఆలస్యం చేస్తాయి మరియు రోగనిరోధక శక్తిని అధికంగా ప్రేరేపిస్తాయి, అప్పుడు సాధారణంగా, అది పిండం యొక్క నష్టానికి దారితీస్తుంది. అయితే, దీనికి థైరాయిడ్ ఆటోఆంటిబాడీ టైటర్ తో సంబంధంలేనట్లు కనుగొనబడింది.
పిసిఓఎస్ (PCOS) లేదా పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్
పిసిఒఎస్ హార్మోన్ల అసమతుల్యత వలన కలిగే మరొక రుగ్మత, ఇది గర్భధారణ ప్రారంభంలోనే గర్భస్రావాలకు బాధ్యత వహిస్తుందని తేలింది. ఈ పరిస్థితి వెనుక ఉన్న మెకానిజంను అర్థం చేసుకోవడానికి విస్తృతమైన పరిశోధనలు జరిగాయి. అయితే, తెలిసిన అధరాలు అసంపూర్తిగా ఉన్నాయి. పిసిఒఎస్ సంబంధిత గర్భస్రావంతో అనేక అంశాలు ముడిపడి ఉంటాయి. వాటిలో ఇవి ఉంటాయి:
- ఊబకాయం
- అసాధారణ లూటినైజింగ్ హార్మోన్
- ఇన్సులిన్ నిరోధకత పెరుగుతుంది
- ఎండోమెట్రియం పనిచేయకపోవడం
- మాయ (ప్లెసెంటా)లో రక్తం గడ్డకట్టడం పెరుగుతుంది
రోగనిరోధక శక్తి పనిచేయకపోవడం
తల్లి రోగనిరోధక వ్యవస్థ పిండం యొక్క ఇంప్లాంటేషన్‌కు మద్దతు ఇస్తుందని తెలిసినప్పటికీ, తల్లి యొక్క రోగనిరోధక వ్యవస్థ సరిగ్గా పనిచేయకపోవడం వలన గర్భస్రావం కలుగుతుందనే ఆధారాలు కూడా ఉన్నాయి (ఈ ఆధారాలు వివాదాస్పదంగా కూడా ఉన్నాయి). సాధారణంగా, ఆటోయాంటిబాడీలు పునరావృత (recurrent) గర్భస్రావాల ప్రమాదంతో ముడిపడి ఉంటాయి. జంతు అధ్యయనాలు కొన్ని రోగనిరోధక అణువుల లేకపోవడం అనేది పిండ నష్టంతో సంబంధం కలిగి ఉన్నట్లు తెలుపుతున్నాయి.
హ్యూమన్ రీప్రొడక్షన్ లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం, గర్భస్రావం కల్గిన మహిళలలో టిఎన్ఎఫ్ (TNF) స్థాయి మరియు వాపు పెరుగుతుందని తెలుస్తుంది. మునుపటి అధ్యయనంలో, NK (నేచురల్ కిల్లర్) కణాల చర్యలు మరియు పనితీరులో అసమతుల్యత ప్రెగ్నన్సీ యొక్క ముందస్తు గర్భస్రావానికి కారణమని మరొక అధ్యయనం పేర్కొంది.
థ్రోమ్బోఫిలియా (Thrombophilia)
థ్రోమ్బోఫిలియా అంటే శరీరంలో రక్తం అధికంగా గడ్డకట్టే పరిస్థితిని సూచిస్తుంది. ఇది జన్యుసంబంధమైనది లేదా మాములుగా ఇతర కారణాల వలన కూడా సంభవించవచ్చు. థ్రోంబోఫిలియాతో బాధపడుతున్న మహిళలలో గర్భస్రావం అయ్యే ప్రమాదం ఉందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఎందుకంటే రక్తం అధికంగా గడ్డకట్టడం వలన మాయ (ప్లెసెంటా) కి రక్త ప్రవాహం పరిమితమైపోతుంది తద్వారా అది గర్భస్రావానికి దారితీస్తుంది. ఈ మహిళలకు తక్కువ మోతాదులో యాంటీ-క్లాటింగ్ ఔషధాలను అందించడం వల్ల పిండం మనుగడకు అవకాశాలు పెరుగుతాయని క్లినికల్ అధ్యయనాలు సూచిస్తున్నాయి. అయితే, అధరాలు అంత బలంగా లేవు. కాబట్టి, థ్రోంబోఫిలియాతో బాధపడుతుంటే, స్వీయ-మందులను ఉపయోగించడానికి బదులుగా వైద్యులని సంప్రదించాలని బలంగా సిఫార్సు చేయబడుతుంది.
ఎక్టోపిక్ గర్భం
గర్భాశయంలో కాకుండా ఫెలోపియన్ ట్యూబ్ లో పిండం నాటుకున్నపుడు (ఇంప్లాంట్) ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఏర్పడుతుంది. ఫెలోపియన్ ట్యూబ్ ఒక నిర్దిష్ట పరిమాణానికి మించి విస్తరించలేదు, అందువలన ఈ రకమైన త్వరగా గర్భం ముగిసిపోతుంది (గర్భస్రావం కలుగుతుంది) లేదా తొలగించాల్సిన అవసరం ఉంటుంది, ఎందుకంటే ఇది తల్లికి కూడా తీవ్రమైన ముప్పును కలిగిస్తుంది. గణాంకాల ప్రకారం నాలుగు ఎక్టోపిక్ గర్భాలలో ఒకదానిలో గర్భస్రావం అవుతుంది.
ఎక్టోపిక్ గర్భం యొక్క కొన్ని సాధారణ లక్షణాలు:
ఈ సంకేతాలలో వేటినైనా గమనించినట్లయితే, వెంటనే మీ వైద్యులని సంప్రదించడం మంచిది.
స్పెర్మ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ (Sperm DNA fragmentation)
విచ్ఛిన్నమైన/చిన్న చిన్న ముక్కలుగా మారిన వీర్యకణ డిఎన్ఏ యొక్క గర్భం ఏర్పడే సౌలభ్య ప్రభావాలను అంచనా వేయడానికి అనేక అధ్యయనాలు జరిగాయి. ఫలితాలు వైరుధ్యం లేకుండా లేవు. ఏదేమైనా, ఏఆర్ సి జర్నల్ ఆఫ్ గైనకాలజీ మరియు ఒబెస్ట్ట్రిక్స్ (ARC Journal of Gynaecology and obstetrics)లో ప్రచురించబడిన ఒక అధ్యయనం, అధిక స్థాయిలో వీర్యకణ డిఎన్ఏ నష్టం అనేది గర్భస్రావం అయ్యే ప్రమాదంతో ముడిపడి ఉందని సూచిస్తుంది, ఇది మరీ ముఖ్యంగా పునరావృత గర్భధారణ నష్టాల విషయంలో ఉంటుందని కూడా సూచించింది.
గర్భస్రావానికి ఇతర కారణాలు
పై కారకాలు కాకుండా, గర్భస్రావం ఈ కింది వాటి వల్ల కూడా సంభవించవచ్చు:
- తక్కువ బరువు ఉండటం
- లైంగిక సంక్రమణ వ్యాధులు
- ఫైబ్రాయిడ్లు
- లిస్టిరియోసిస్ మరియు సాల్మొనెలోసిస్ వంటి ఇన్ఫెక్షన్లు
- అధిక రక్తపోటు, మధుమేహం మరియు ల్యూపస్ వంటి దీర్ఘకాలిక వ్యాధులు
- అసాధారణ గర్భాశయ ఆకారం
- ఎన్ఎస్ఏఐడి (NSAID) లు వంటి కొన్ని రకాల మందులు
- గర్భాశయ గోడలలో బలహీనత ఇది శస్త్రచికిత్సా విధానం వల్ల కావచ్చు లేదా కాకపోవచ్చు
- తక్కువ స్థాయి హెచ్‌సిజి ([HCG] హ్యూమన్ కోరియోనిక్ గోనాడోట్రోపిన్)
ఆరోగ్యకరమైన మహిళల్లో ఈ కింది కారణాల వలన గర్భస్రావం జరగదు
- వ్యాయామం
- సెక్స్
- అంతకుముందు గర్భస్రావం
- వంశపారంపర్య
- ఆకస్మిక షాక్
- వికారము
- గర్భధారణకు ముందు గర్భనిరోధక మందులు వాడటం
ఈ కారణాల వలన గర్భస్రావం కలుగుతుందేమో అని చాలామందిలో అనుమానం ఉంటుంది కానీ అది నిజం కాదు.