ప్రపంచవ్యాప్తంగా అనేకమంది మహిళలకు గర్భందాల్చడమనేది విశ్వంలోనే అత్యుత్తమ భావాల్లో ఓ భావాన్నికలిగి ఉండడమే అవుతుంది. మరి ఓ మహిళల గర్భం వచ్చిన వెంటనే, ఉత్సుకత కనబరిచేది దేనిగురించి అంటే తన గర్భంలో ఉన్నది ఆడ బిడ్డా లేక మగ బిడ్డా అనే దాని గురించి. ఏదేమైనా, తల్లిదండ్రులకు ప్రతి బిడ్డ, లింగంతో సంబంధం లేకుండా, దేవుడిచ్చిన బహుమానం. కాని (గర్భధారణ సమయంలో) దంపతులు వారి శిశువు యొక్క పోషణను తొందరగా మొదలుపెట్టాలని నిర్ణయించుకోవాలనుకుంటారు. అలాంటి దంపతులు చాలామందికి, గర్భధారణ వ్యవధి తొమ్మిది నెలలూ వేచి ఉండటం అంటే అది వాళ్లకు శతాబ్దాలుగానే అనిపిస్తుంది.
భారతదేశంలో, గర్భధారణ సమయంలో గర్భము లోని పిండం యొక్క లింగాన్ని (మగబిడ్డనా-ఆడబిడ్డనా అనే విషయం) నిర్ణయించడం చట్టవిరుద్ధం మరియు శిక్షార్హమైన నేరం. అనేకమంది పిండాల లింగాన్ని గుర్తించడానికి లైంగిక-నిర్ణాయక పరీక్షలను దుర్వినియోగం చేశారు, దీని ఫలితంగా గర్భంలోని ఆడ శిశువుల హత్యలకు (తల్లి గర్భంలోని ఆడ శిశువు యొక్క పిండాలను చంపడం) దారి తీస్తోంది. దేశంలో నిరంతరంగా కొనసాగుతున్న గర్భంలోని పిండం యొక్క లింగం ఎంపిక అభ్యాసం భారతదేశంలోని లింగ నిష్పత్తిని దెబ్బ తీయడానికి దారితీ స్తోంది (దేశంలో ప్రతి వేయిమంది మగవారికి మహిళల సంఖ్య ఉనికి).
గర్భంలోని శిశువు లింగ నిర్ధారణ మరియు ఎంపిక (సెక్స్ డిటర్మినేషన్ మరియు సెలెక్షన్) నేరానికి “ప్రీ-కాన్సెప్షన్ అండ్ ప్రీ-నాటల్ డయాగ్నొస్టిక్ టెక్నిక్స్ (PCPNDT)” చట్టం ప్రకారం, శిక్ష విధించబడుతుంది. ఆ శిక్ష మూడేళ్ళ జైలువాసంతో బాటు యాభైవేల రూపాయల జరిమానా లేదా ఐదు సంవత్సరాలు జైలు శిక్షను విధించి, దానితోబాటు జరిమానాను ఒక లక్ష రూపాయల వరకూ పెంచవచ్చు. ఈ శిక్ష గర్భంలోని శిశువు యొక్క లింగాన్ని తెలుసుకోవటానికి ప్రయత్నించే వ్యక్తులకు మాత్రమే కాక, రోగ నిర్ధారణ చేసే వైద్యుడికి కూడా వర్తిస్తుంది. అందువల్ల, బాధ్యతగల పౌరులు మరియు కాబోయే తల్లిదండ్రుడలుగా ఉండటంతో పాటుగా బిడ్డను ఆశిస్తూ తల్లి-దండ్రుల స్థానం పొందబోయే ఈ అధిక ఆనందదాయక దశలో మీరు ప్రతి క్షణాన్ని ఆస్వాదించడం ముఖ్యం.
మనందరం చూసినవిధంగా, ఓ మహిళ గర్భందాల్చింది అంటే ఆ వార్త కుటుంబం పరిధి దాటి పరిసర ప్రాంతాలలో తెల్సిన వారందరికీ దావానలం (wild fire అడవిలో మంట) లాగా వ్యాపిస్తుంది. చాలామంది మీరు మీ గర్భంలో మోస్తున్నది అబ్బాయా లేదా అమ్మయా అని అంచనా వేసేందుకు ప్రయత్నిస్తారు. ఏదేమైనా, ఈ అంచనాలకు సంబంధించి ఎలాంటి శాస్త్రీయమైన రుజువు లేదు. ఈ వ్యాసం, గర్భంలోని శిశువుకు సంబంధించి, ప్రజల ఉత్సుకత మరియు శిశువు యొక్క లింగనిర్ధారణ గురించి వారి సంప్రదాయిక నమ్మకాలను తృప్తిపరచడానికి మాత్రమే వ్రాయబడింది. మీరొక మగ శిశువును గర్భమందు మోస్తున్నారనే విషయాన్ని గుర్తించడానికి వివిధ సంస్కృతుల్లో అనుసరించబడుతున్న కొన్ని ప్రసిద్ధమైన పురాణకాలపు నమ్మకాలను ఇక్కడ చర్చించడమైంది.