యోని క్షీణత అంటే ఏమిటి?
యోని క్షీణత అనేది మహిళలు మెనోపాజ్ (రుతువిరతి) సమయంలో ఎక్కువగా ఎదుర్కునే ఒక పరిస్థితి. దీనిలో యోని కణజాలం పొడిబారడం, పల్చబడడం మరియు కొన్నిసార్లు వాపు ఏర్పడడం వంటి క్షీణత యొక్క లక్షణాలు కనిపిస్తాయి. మెనోపాజ్ (రుతువిరతి) తరువాత శరీరంలో ఈస్ట్రోజెన్ స్థాయిలు తగ్గిపోవడం వలన ఇది సంభవిస్తుంది.
దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
యోని క్షీణత యొక్క కొన్ని సాధారణ లక్షణాలు ఈ క్రింది విధంగా ఉంటాయి:
- అసాధారణమైన చుక్కలు పడడం లేదా రక్తస్రావం లేదా యోని నుండి ఇతర అసాధారణ స్రావాలు స్రవించడం
- యోనిలో మంట మరియు/లేదా దురద అనుభూతి
- యోని యొక్క పొడిదనం
- లైంగిక కార్యకలాపాలు బాధాకరముగా మారడం
- మూత్రవిసర్జన తరచుదనం పెరగడం, బాధాకరమైన మూత్రవిసర్జన లేదా తరచూ మూత్ర మార్గము అంటురోగాలు/ఇన్ఫెక్షన్లు (మూత్ర మార్గము కూడా వచ్చినట్లైతే) ఏర్పడడం
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
యోని క్షీణత ప్రధానంగా ఈస్ట్రోజెన్ స్థాయిలు తగ్గిన మహిళల్లో కనిపిస్తుంది, అది ఈ కింది కారణాల వలన సంభవిస్తుంది:
- అండాశయాల తొలగింపు
- గర్భాదరణ
- బిడ్డ పుట్టిన వెంటనే
- చనుబాలు ఇవ్వడం
- అరోమాటాస్ ఇన్హిబిటర్స్ (aromatase inhibitors) వంటి మందులతో రొమ్ము క్యాన్సర్ యొక్క చికిత్స తీసుకుంటున్నవారు.
దీనిని ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?
వైద్యులు క్షుణ్ణంగా వైద్య చరిత్రను తెలుసుకుంటారు, మరియు యోని క్షీణతను నిర్ధారించడానికి యోని యొక్క పూర్తిస్థాయి భౌతిక పరీక్ష నిర్వహించబడుతుంది. భౌతిక పరీక్ష ద్వారా రోగ నిర్ధారణకు సహాయపడే సంకేతాలు - ఎరుపుదనం, వాపు, పొడిబారడం, యోని తెల్లగా మారిపోవడంతో పాటు కుదించబడుతుంది లేదా సంకుచితమైవుతుంది మరియు యోని యొక్క సాగేగుణం (elasticity) తగ్గిపోతుంది.
యోని క్షీణత యొక్క నిర్వహణలో లక్షణాలు తగ్గించడం లేదా ఈస్ట్రోజెన్ నష్టాన్ని పరిష్కరించడం ఉంటాయి, దానిలో ఇవి ఉంటాయి:
- పొడిదానానికి చికిత్స చేయడానికి తేమను అందించే లోషన్లు మరియు నూనెలు ఉపయోగించడం
- యోని లూబ్రికెంట్లను ఉపయోగించడం
- వజైనల్ జెల్స్ ఉపయోగించడం
- లోకల్ హార్మోన్ థెరపీతో కలిపి డైలెటర్ల వాడకం, ఇది చర్మపు ఆరోగ్యంతో పాటు యోని క్షీణత యొక్క లక్షణాలను మెరుగుపరుస్తుంది. యోని యొక్క సాధారణ యాసిడ్ బ్యాలెన్స్ పునరుద్ధరణ ద్వారా, సహజ తేమను నిర్వహించడం, చర్మాన్ని గట్టిపరచడం మరియు బ్యాక్టీరియా సంతులనాన్ని మెరుగుపరచడం ద్వారా దీనిని సాధించవచ్చు
హార్మోన్ల చికిత్సలో ఇవి ఉంటాయి:
- లోకల్ వజైనల్ ఈస్ట్రోజెన్ థెరపీ (Local vaginal oestrogen therapy), ఇది క్రీమ్లు లేదా మాత్రల రూపంలో ఉపయోగించబడుతుంది, ఇది యోని పొడిబారడం యొక్క లక్షణాలను తగ్గిస్తుంది.
- సిస్టమిక్ హార్మోన్ రిప్లేస్మెంట్ చికిత్స (Systemic hormone replacement therapy) ను కూడా ఉపయోగించవచ్చు.