సారాంశం
టైఫాయిడ్ అనేది ‘సాల్మొనెల్లా టైఫి’ బ్యాక్టీరియ వల్ల కలిగే ఒక సాంక్రమిక విషక్రిమికారక వ్యాధి. టైఫాయిడ్ తో బాధ పడుతున్న రోగికి జ్వరం, కడుపు నొప్పి, తలనొప్పి, ఆకలి లేకపోవటం, గులాబీ రంగు మచ్చలేర్పడ్డం వంటి వ్యాధి లక్షణాలుంటాయి. సాధారణంగా రుతుపవనాలకు (ముంగారు వర్షాలు) ముందుకాలం, వర్షాకాలం సీజన్లో మరియు వర్షాకాలం తర్వాత టైఫాయిడ్ వ్యాపిస్తుంటుంది. ఈ వ్యాధి ఒకరి నుండి మరొకరికి మలం ద్వారా, మరియు నోటి మార్గం ద్వారా వ్యాపిస్తుంది. అందువల్ల, మలపరీక్ష (స్టూల్ టెస్ట్) ద్వారా రోగి టైఫాయిడ్ విషక్రిమితో (బ్యాక్టీరియాతో) బాధపడుతున్నాడా లేదా అన్న దాన్ని నిర్ధారించడం జరుగుతుంది. యాంటీబయాటిక్స్ మందులుపయోగించి టైఫాయిడ్ జ్వరానికి వైద్యులు పూర్తి చికిత్స చేస్తారు. చికిత్స చేయకపోతే, ప్రమాదకరమైన అంతర్గత రక్తస్రావం, కుళ్ళకం (సెప్సిస్) లాంటి సమస్యలకు దారి తీస్తుంది. అరుదైన సందర్భాల్లో సరైన సమయంలో చికిత్స పొందని టైఫాయిడ్ జ్వరం వల్ల మరణం కూడా సంభవించవచ్చు.