మానసిక ఉద్రిక్తత (టెన్షన్) అంటే ఏమిటి?
మానసిక ఉద్రిక్తత (టెన్షన్) అనేది జీవితంలోని వివిధ పరిస్థితులు, ఒత్తిళ్లు మరియు సంఘటనలకు మన శరీరం మరియు మెదడు యొక్క ప్రతిస్పందన. టెన్షన్ మరియు ఒత్తిడికి దోహదపడే కారకాలు ఒక వ్యక్తికి మరొకరికి భిన్నముగా ఉంటాయి. జరుగుతున్న సంఘటనల మీద చాలా తక్కువ లేదా అస్సలు నియంత్రణ లేకపోవడం, ఊహించని సంఘటనల లేదా కొత్త విషయాలతో వ్యవహరించేటప్పుడు కంగారు/భయం కలగడం, టెన్షన్ కు దారితీస్తాయి. దీర్ఘకాలిక టెన్షన్ మరియు ఒత్తిడి అధిక రక్తపోటు, ఊబకాయం మరియు మధుమేహం వంటి ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయి.
దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
మానసిక ఉద్రిక్తతకు సంబంధించిన ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు:
- నిద్రలేమి
- ఆత్మనూన్యతా భావం
- అలసట
- కుంగుబాటు (డిప్రెషన్)
- చాలా తక్కువ లేదా చాలా ఎక్కువ తినడం
- మద్యపానం మరియు ధూమపానం వంటి హానికరమైన అలవాట్లు చేసుకోవడం
- దృష్టి కేంద్రీకరించడంలో కఠినత
- బరువు తగ్గడం లేదా బరువు పెరగడం
- తలనొప్పి
- నిరంతరం కంగారుగా అనిపించడం
- మలబద్ధకం
- కలత మరియు అవిశ్వాసం
- అతిసారం
- ఆందోళన
- కండరాల నొప్పి
- భయంగా అనిపించడం
- మైకము
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
మానసిక ఉద్రిక్తతకు ప్రధాన కారణాలు:
- కుటుంబం, పని మరియు వ్యక్తిగత సమస్యలకు సంబంధించిన ఒత్తిడి
- ఒత్తిడి రుగ్మతలు, ఉదాహరణకు, పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ (PTSD) వంటివి
- సన్నిహిత కుటుంబ సభ్యులని కోల్పోవడం
- చాలా ఒత్తిడికి గురికావడం
- నిరాశావాదం
- పెద్ద (ముఖ్య) జీవిత మార్పులు
- చంటి బిడ్డను కలిగి ఉండడం
దీనిని ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?
వైద్యులు పూర్తి ఆరోగ్య చరిత్రను తెలుసుకుంటారు మరియు ఒత్తిడిని నిర్ధారించడానికి శారీరక పరీక్షను నిర్వహిస్తారు.
ఈ కింది పద్ధతులను ఉపయోగించి టెన్షన్కు చికిత్స చేస్తారు:
- కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ (Cognitive behavioural therapy): ఈ చికిత్స మనస్సు నుండి ప్రతికూల భావాలు మరియు ఆలోచనలను తొలగించడానికి సహాయపడుతుంది మరియు వ్యక్తిని ప్రశాంతంగా మరియు సానుకూలంగా (positive) ఉంచుతుంది. ఇది నిద్ర, తిండి అలవాట్లను మెరుగుపరుస్తుంది మరియు మద్య దుర్వినియోగం వంటి సమస్యల ఉపశమనానికి సహాయపడుతుంది.
- విశ్రామక పద్ధతులు (Relaxing techniques): ధ్యానం, యోగ మరియు తాయ్ చి (Tai Chi) లేదా కొన్ని రకాల నూనెలతో చేసే పరిమళ చికిత్స (aromatherapy) వంటి విశ్రామక పద్ధతులు అలాగే సోషల్ సపోర్ట్ (సామజిక సహకారం) మరియు ఘాడ శ్వాస వ్యాయామాలు (deep breathing exercises) మనస్సుకు విశ్రాంతినిస్తాయి.
- శారీరక శ్రమ: మానసిక స్థితిని మెరుగుపరచడం మరియు కండరాల ఒత్తిడిని తగ్గించడానికి క్రమమైన శారీరక శ్రమ ఉండాలని సిఫార్సు చేయబడుతుంది.
- సమూహిక చికిత్స మరియు మనస్తత్వ సెషన్లు (Group therapy and psychology sessions): ఓపెన్ గ్రూప్ (open group) మరియు క్లోజ్డ్ గ్రూప్ (closed group) సెషన్లలో పాల్గొనడం అనేది భావోద్వేగాలను మెరుగుపరచడంలో, సామాజిక నైపుణ్యాలను మరియు ఆత్మవిశ్వాసాన్ని పెంచడానికి సిఫారసు చేయబడతాయి.
- ఆల్కాహాల్ ఉపయోగ రుగ్మత (alcohol use disorder), గంజాయి ఉపయోగ రుగ్మత (cannabis use disorder), ఓపియాయిడ్ ఉపయోగ రుగ్మత (opioid use disorder) మరియు పొగాకు ఉపయోగ రుగ్మత (tobacco use disorder) వంటి వ్యసనాలు కోసం థెరపీ/చికిత్స.