స్ట్రోక్ అంటే ఏమిటి?
స్ట్రోక్ అనేది ఒక ప్రాణాంతకమైన నరాల సంబంధిత వైద్య పరిస్థితి/సమస్య, మెదడులోని ఒక భాగానికి రక్త సరఫరా నిలిపివేయబడిన్నప్పుడు ఇది సంభవిస్తుంది. వేగవంతమైన మరియు ప్రత్యేకమైన వైద్య చికిత్స శాశ్వత నష్టం మరియు వైకల్యం నుండి మెదడును రక్షిస్తుంది.
దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
సంకేతాలు మరియు లక్షణాలు మారుతూ ఉంటాయి మరియు హఠాత్తుగా సంభవిస్తాయి మరియు ప్రతి వ్యక్తికి వేరుగా ఉంటాయి. లక్షణాలను ఎఫ్.ఏ. యస్.టి (F.A.S.T) గా గుర్తుంచుకుంటారు:
- ఫేస్ (ముఖం) - కళ్ళు లేదా నోరు వాలిపోవడంతో పాటుగా ముఖం ఒక వైపుకి వాలిపోతుంది మరియు నవ్వడంలో అసమర్థత ఏర్పడుతుంది
- అర్మ్స్ (చేతులు) - బలహీనత లేదా తిమ్మిరి కారణంగా రెండు చేతులను పైకి ఎత్తలేకపోతారు
- స్పీచ్ (మాట్లాడడం) - మాటలు (పలుకులు) అస్పష్టంగా ఉండవచ్చు లేదా మాట్లాడలేకపోవచ్చు
- టైం (సమయం) - వెంటనే వైద్య సహాయం కోసం పిలవాలి
ఇతర లక్షణాలు వీటిని కలిగి ఉండవచ్చు
- శరీరం ఒక వైపు లేదా కొన్ని భాగాలకు పూర్తిగా పక్షవాతం ఏర్పడడం, ఉదాహరణకు, ముఖం యొక్క ఒక వైపు
- అస్పష్టమైన చూపు లేదా దృష్టి/చూపుని కోల్పోవడం
- మైకము
- గందరగోళం
- శరీరాన్ని సంతులనం మరియు సమన్వయం చేసుకోవడంలో సమస్యలు
- మింగడం లో కఠినత
- స్పృహ కోల్పోవడం
- శరీరంలోని ఒకటి లేదా రెండు వైపుల తిమ్మిరి
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
- ఇస్చిమిక్ స్ట్రోక్ (Ischemic stroke) మెదడు యొక్క రక్త సరఫరాకు అడ్డు ఏర్పడడం వలన సంభవిస్తుంది. రక్తనాళాల గోడల లోపల ఫలకం (plaque,కొలెస్ట్రాల్ మరియు కాల్షియంతో కూడినది) ఏర్పడిన కారణంగా రక్త సరఫరాకు అడ్డంకులు కలుగుతాయి.
- మెదడులో ఒక ఆర్టరీ (ధమని) చీలినప్పుడు హెమరేజిక్ స్ట్రోక్ (సెరెబ్రల్ లేదా ఇంట్రాక్రానియల్ హేమరేజ్) సంభవిస్తుంది. అధిక రక్తపోటు హెమరేజిక్ స్ట్రోక్ యొక్క ప్రధాన కారణాలలో ఒకటి.
- స్వల్ప స్ట్రోక్ (mini-stroke) లేదా హెచ్చరిక స్ట్రోక్ (warning stroke) అని పిలువబడే ట్రాన్సిస్టెంట్ ఇస్చిమిక్ ఎటాక్ (Transient ischemic attack), ఆర్టరీ (ధమని) యొక్క పాక్షిక నిరోధం/అడ్డంకి వల్ల సంభవిస్తుంది. ఇది ఒక గంట కంటే తక్కువ సమయం పాటు ఉంటుంది మరియు ఇది రాబోయే/జరుగబోయే తీవ్రమైన స్ట్రోక్ యొక్క హెచ్చరిక చిహ్నం.
దీనిని ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?
రోగి యొక్క లక్షణాలు, ఆరోగ్య చరిత్ర, కుటుంబ చరిత్ర మరియు శారీరక పరీక్షల ఆధారంగా, వైద్యులు రోగ నిర్ధారణ చేయవచ్చు. వారు ముఖం, చేతులు మరియు కాళ్ళ యొక్క తిమ్మిరిని గుర్తించడం కోసం; అస్పష్ట దృష్టి; గందరగోళం; మాట్లాడటంలో కష్టం వంటి వాటి గురించి కూడా తనిఖీ చేస్తారు. రక్త పరీక్షలు, పల్స్ రేటు మరియు రక్తపోటును తనిఖీ చెయ్యడం, సిటి (CT) స్కాన్, సిటి ఆంజియోగ్రామ్ (CT angiogram), ఎంఆర్ఐ (MRI) స్కాన్, స్వల్లో టెస్ట్ (మింగడాన్ని పరీక్షించడం), కరోటిడ్ అల్ట్రాసౌండ్ (carotid ultrasound), మరియు ఎలక్ట్రోకార్డియోగ్రామ్ (electrocardiogram) వంటి పరీక్షలను నిర్వహించవచ్చు.
ఇస్చిమిక్ స్ట్రోక్ చికిత్సలో థ్రోంబోలైసిస్ (thrombolysis), థ్రోంబెక్టమి (thrombectomy), యాంటీప్లేట్లెట్ థెరపీ (antiplatelet therapy), యాంటీ కోయాగులెంట్ థెరపీ (anticoagulant therapy), యాంటీ హైపర్టెన్సివ్ డ్రగ్స్ (anti-hypertensive drugs), స్టాటిన్స్, మరియు కరోటిడ్ ఎండార్టెరెరక్టమీ (carotid endarterectomy) ఉంటాయి.
హేమోరేజిక్ స్ట్రోకులకు శస్త్రచికిత్స ద్వారా మెదడు నుండి రక్తాన్నీ తొలగించి, మెదడులో ఒత్తిడి పెరుగుదలను నిర్వహిస్తారు.