మీకు దాపురించిన “బాధాకర‘మూత్రవిసర్జన వ్యాధి”ని నిర్ధారించడానికి వైద్యుడు మీనొప్పి యొక్క వివరణాత్మక చరిత్రతో ప్రారంభిస్తాడు. తరువాత శారీరక పరీక్ష మరియు విశ్లేషణ పరీక్షల్ని జరుపుతాడు.
చరిత్ర
మీ వైద్యుడు మీరు బాధ పడుతున్న “బాధాకరమైన మూత్రవిసర్జన” గురించిన వ్యాధి నిర్ధారణను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగడంతో ప్రారంభిస్తాడు. మీకొస్తున్న “మూత్రంలో మంట” యొక్క తీవ్రత, స్థానం, పౌనఃపున్యం (freequency), తత్సంబంధ లక్షణాలైన జ్వరం, చలి, కడుపు నొప్పి, మూత్రంలో చీము లేదా రక్త స్రావం అవుతోందా, మీ గర్భధారణ స్థితి, ఏమి మందులు వాడుతున్నారు, మద్యం గనుక పుచ్చుకుంటుంటే ఎంత ప్రమాణం పుచ్చుకుంటారు, మంట, నొప్పి మూత్రం పోయడానికి ప్రారంభించినపుడు వస్తుందా లేక మూత్రం పోస్తున్నంతసేపూ ఉంటుందా, ప్రస్తుతం మూత్రప్రవాహం ఎలా ఉంది, మూత్రవిసర్జన పౌనఃపున్యంలో పెరుగుదల ఉందా, మూత్రవిసర్జనకు పోవాలన్న ప్రేరేపణ (లేక ఉద్దేపన) కల్గుతోందా, గతంలో మూత్ర నాళాల సంక్రమణకారణంగా సతమతమయ్యారా వంటి కొన్ని ప్రశ్నలను అడగడం జరుగుతుంది.
శారీరక పరీక్ష
వివరణాత్మక వైద్యచరిత్రను మీనుండి రాబట్టుకున్న తరువాత మూత్రంలో నొప్పికి గల మూలమేంటి, మంట తీవ్రత, నొప్పి యొక్క స్వభావం గురించి తెలుసుకునేందుకు మీ వైద్యుడు మీ కటి ప్రాంతం యొక్క సంపూర్ణ భౌతిక పరీక్షను నిర్వహిస్తాడు. వివరణాత్మక వైద్య చరిత్రను తీసుకున్న తరువాత, మీ వైద్యుడు రోగనిర్ధారణ కోసం క్రింది ప్రయోగశాల మరియు రేడియోలాజికల్ పరీక్షల్ని చేయించామని మిమ్మల్ని కోరవచ్చు అలాంటి పరీక్తో కొన్ని:
మూత్రవిశ్లేషణ
మీ నుండి మూత్రం నమూనాను సేకరించిన తరువాత మూత్రంతో ప్రతిచర్య చెందే రసాయనిక పదార్థాలతో కొన్ని ప్రయోగశాల పరీక్షలను ‘మూత్రవిశ్లేషణ’ కోసం మీ వైద్యుడు నిర్వహించవచ్చు. మీ మూత్రం యొక్క రసాయన విశ్లేషణలో ఏమేమి విషయాలు బయటపడతాయంటే మూత్రంలో ఉన్న మిశ్రమాని (composition) కి సంబంధించిన పూర్తి సమాచారం. ఇంకా ముఖ్యంగా మూత్రంలో ఉండకూడని (అసాధారణంగా తయారైన లేక చేరిన) పదార్ధం యొక్క ఉనికిని గుర్తించి అందిస్తుంది ఈ ప్రయోగశాల పరీక్ష. టెలీస్కోపిక్ పరికరాన్ని ఉపయోగించి చేసే ఈ సూక్ష్మదర్శిని పరీక్షలో మూత్రమిశ్రమంలో ఉండే పదార్థాలు కంటికి పెద్దవిగా కన్పిస్తాయి. ప్రయోగశాల సాంకేతిక నిపుణుడు మూత్రంలో కనబడే రక్త కణాలు, చీము కణాలు, స్ఫటికాలు వంటి అసాధారణ పదార్థాలను గుర్తించడంలో ఈ సూక్ష్మదర్శిని పరీక్ష సహాయపడుతుంది.
మూత్రంలో ఉన్న సూక్ష్మక్రిముల సాగు
మూత్రంలో ఉన్న సూక్ష్మక్రిముల సాగులో, మీ మూత్రం నమూనాలో కొంత భాగం తీసుకొని బ్యాక్టీరియా అభివృద్ధికి అనుకూలమైన ఒక మాధ్యమంలో ఉంచబడుతుంది. కొంత కాలం తర్వాత, మీడియంపై ఏదైనా సూక్ష్మజీవి (bacteria) యొక్క పెరుగుదల ఉంటే అది ఈ పరిశీలనలో బయటపడ్డమనేది జరుగుతుంది. ఎటువంటి సూక్ష్మజీవుల పెరుగుదల లేకపోతే, మీ మూత్రం సంక్రమించకుండా ఉందన్నమాటే. అయితే, బ్యాకతేరియా పెరుగుదల కనిపించినట్లయితే, ఈ పరీక్షలో మరింత ప్రాసెస్ చేసి సూక్ష్మదర్శిని కింద పరిశీలించబడుతుంది, మీ మూత్ర నాళం ఎలాంటి మూత్ర సంక్రమణాన్ని కల్గివుందో ఈ పరీక్షలో బయల్పడొచ్చు.
స్త్రీలలో యోని దూది (స్వాబ్) మరియు మగవాళ్లలో యూరేత్రల్ దూది(స్వాబ్)
మూత్రనాళ సంక్రమణాన్ని పరీక్షించేందుకు యోని మరియు మూత్రనాళపు స్రావాల నమూనాను ఒక స్టెరైల్ (బ్యాక్టీరియా-రహిత) దూదిని ఉపయోగించి తీసుకోబడతాయి. సేకరించిన స్రావాల నమూనాల్ని కొంతకాలం బ్యాక్టీరియా పెరుగుదల మాధ్యమంలో ఉంచబడుతాయి. ఆ మాధ్యమంలో బాక్టీరియా కొంత పెరిగిన తర్వాత, మీ యోని లేదా మూత్రనాళంలో ఉన్న స్రావాన్ని పరీక్ష చేయడానికి సూక్ష్మదర్శినిని ఉపయోగిస్తారు.
రేడియోలాజికల్ పరీక్ష
లాబ్ పరీక్షలు అసంపూర్తిగా ఉన్నప్పుడు, వైద్యుడు మీ నొప్పి యొక్క కారణం తెలుసుకోవడానికి కొన్ని రేడియోలాజికల్ పరీక్షలు చేయించుకోవాలని మీకు సలహా ఇస్తారు:
- ఎక్స్- రే
మీ మూత్ర వ్యవస్థ మరియు దాని ప్రక్కనే ఉన్న అవయవాలను మెరుగ్గా చిత్రించటానికి మీ వైద్యుడు మీకు ఎక్స్-రే (X-ray) చేయించుకొమ్మని సూచించవచ్చు. X- కిరణాలు సులభంగా రాళ్లు లేదా కణితుల ఉనికిని గుర్తించగలవు, రాళ్లు లేదా కణితులే మూత్రావాహికలో అడ్డుపడటానికి కారణం కావచ్చు. పురుషుల X- రే ప్రోస్టేట్ గ్రంధి (మూత్రాశయం మరియు కేవలం మూత్రాశయంలోని ప్రక్కన ఉన్న మగ ప్రత్యుత్పత్తి వ్యవస్థ యొక్క గ్రంధి) మూలాన్ని చూపుతుంది. ఒక విరుద్ధ మాధ్యమాన్ని ఇంజెక్ట్ చేసిన తరువాత తీసుకునే కొన్ని ఎక్స్-రేలు ఉన్నాయి. వీటిలో IVP (ఇంట్రావెనస్ పైలెగోగ్రామ్) మరియు VCUG (వాయిడింగ్ సిస్టోరెత్రోగ్రాం/voiding cystourethrogram) అనే రకాలు ఉన్నాయి.
- ఇంట్రావీనస్ పైలోగ్రామ్ (Intravenous Pyelogram)
ఈ పరీక్షలో, ఒక విరుద్ధమైన మాధ్యమాన్ని సదరు వ్యక్తి యొక్క చేతి నరం ద్వారా ఇంజెక్ట్ చేయబడుతుంది. కొంత సమయం తర్వాత ఇంజెక్ట్ చేయబడిన వ్యతిరేక మాధ్యమం మూత్రపిండాల ద్వారా వడగట్టబడుతుంది. మూత్రవ్యవస్థలోని అవయవాలను ఈ ఎక్స్-రే స్పష్టంగా చూపుతుంది. ఇది మూత్ర నాళంలో ఉన్న అవరోధం యొక్క ఉనికిని కూడా చూపిస్తుంది.
- వాయిడింగ్ సిస్టోరెత్రోగ్రాం (VCUG)
ఈ పరీక్ష లో, మీ డాక్టర్ పరీక్షకు ముందు మిమ్మల్ని నీరు త్రాగమని అడగవచ్చు. కొంత సమయం తరువాత, ఒక మూత్రోద్ధరణనాళిక/కాథెటర్ చేర్చబడుతుంది. అటుపైన మూత్రాశయం పూర్తిగా భర్తీగా ఉన్నప్పుడు, అలాగే పూర్తిగా ఖాలీ అయినపుడు కూడా ఎక్స్-రే (X-ray) తీసుకోబడుతుంది. ఈ పరీక్ష ద్వారా మూత్రంలో మంట సమస్య మీ మూత్రాశయం లో ఉందా, మూత్రనాళంలో ఉందా లేక మూత్రద్వారంలో ఉందా అనే విషయాన్ని నిర్ణయించడానికి ఓ మంచి పధ్ధతి.
- సిస్టోస్కోపీ
ఈ పరీక్ష మీ మూత్రాశయాన్ని పరిశీలించేందుకు జరుపబడుతుంది. ఒక సన్నని “సీస్టోస్కోప్” (టెలీస్కోప్తో ఉన్న పరికరం) ను మూత్రద్వారం ద్వారా మూత్రాశయం చేరుకునే వరకు జొప్పిస్తారు. సిస్టోస్కోపీ రెండు రకాలు: 1. వంగనిది (దృఢమైనది) మరియు 2. వంగేది (వంగే గుణంతో సౌకర్యవంతమైనది). ఫ్లెక్సిబుల్ సిస్టోస్కోపీ గాయపరచదు, ఎందుకంటే పరికరం వంగేగుణంతో అనువైనది కాబట్టి. ఈ వంగుడు గుణం కారణంగానే ఈ పరీక్షలో దీన్ని జొప్పించేందుకు కటి వలయము/పెల్విక్ ప్రాంతంలో మత్తుమందును ఇంజెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. అయితే, దృఢమైన సిస్టోస్కోపీ పరీక్షలో, మీ వైద్యుడు మీరు నిద్రపోయేలా చేయవచ్చు లేదా పరీక్షను ప్రారంభించబడటానికి ముందుగా మీ కటిభాగం లోపలివైపున తిమ్మిరెక్కించ వచ్చు. పరీక్ష నిమిత్తం, మీ వైద్యుడు మూత్రాశయంలోకి నీటిని పంప్ చేసి తద్వారా మూత్రాశయం యొక్క మెరుగైన చిత్రాన్ని పొందుతాడు.
- అల్ట్రాసౌండ్
అల్ట్రాసౌండ్ అనేది మీ శరీరం యొక్క అంతర్గత అవయవాలను మరియు నిర్మాణాలను పరిశీలించేందుకు మీ వైద్యుడు ధ్వని తరంగాలను ఉపయోగించే పరికరం. రెండు రకాల అల్ట్రాసౌండ్లున్నాయి, 1 పొత్తి కడుపు ఆల్ట్రాసౌండ్ (మీ ఎముకలు మరియు పొత్తికడుపు మధ్య భాగం) మరియు 2. ట్రాన్స్ రెక్టల్ (పురీషనాళం ద్వారా) ఆల్ట్రాసౌండ్. పొత్తికడుపు అల్ట్రాసౌండ్లో, ఒక జెల్ మీ కడుపు ప్రాంతానికి పూయబడుతుంది, అటుపైన ఓ పరికరం చర్మంపై కదులుతుంది. ఇలా పరికరం పొత్తికడుపు చర్మంపై కదులుతుండగా ఈ అవయవాల చిత్రాలను చూపించే ఒక తెరపై వైద్యులు పరిశీలిస్తారు, పరీక్ష చేస్తారు. ట్రాన్స్ రెక్టల్ ఆల్ట్రాసౌండ్డ్లో, పెన్ కన్నా కొంచం పెద్దదిగా ఉండే పరికరాన్ని పాయువు ద్వారా మీ పురీషనాళంలోకి చొప్పించబడుతుంది. అది ప్రోస్టేట్ గ్రంధి దగ్గరకు చేరుకున్నప్పుడు, డాక్టర్ ప్రొస్టేట్ గ్రంధి లేదా దాని ప్రక్క ప్రదేశంలో ఏదైనా అసాధారణ పెరుగుదల జరిగుంటే వాటి చిత్రాలను పరీక్షలో నిశితంగా పరిశీలిస్తాడు.
- ఎమ్మారై పరీక్ష (MRI, మాగ్నెటిక్ రెసొనెన్స్ ఇమేజింగ్)
ఈ ప్రక్రియలో, మీ అంతర్గత అవయవాలు యొక్క చిత్రాల శ్రేణిని విభిన్న కోణాల నుండి తీసుకోబడుతుంది. ఈ ప్రక్రియలో మీ శరీరం ఒక MRI మెషిన్ యొక్క సొరంగం లాంటి భాగంలోకి ప్రవేశిస్తుంది, తర్వాత ఆ ఎమ్మారై యంత్రం చిత్రాలను తీస్తుంది. ఈ విధానంలో కొన్నిసార్లు ఒక విరుద్ధ మాధ్యమా న్నీ(ఒక రంగును) ఇంజెక్ట్ చేసే అవసరం రావచ్చు. ఈ ఎమ్మారై పరీక్ష వివిధ కోణాల నుండి మీ మూత్రావాహిక యొక్క చిత్రాల శ్రేణిని అందిస్తుంది.
- సీటీ స్కాన్ (కంప్యూటెడ్ టోమోగ్రఫీ స్కాన్)
ఈ విధానంలో కూడా మిమ్మల్ని పడుకోబెట్టి ఒక సొరంగం లాంటి యంత్రం ద్వారా పంపబడడం అవసరం అవుతుంది. ఇందులోనూ ఒక విరుద్ధ మాధ్యమాన్ని ఇంజెక్షన్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. ఈ యంత్రం X- కిరణాలను (ఎక్స్-రే) ఉపయోగించి వేర్వేరు కోణాల నుండి మీ శరీర భాగాల చిత్రాలను తీస్తుంది మరియు ఒక కంప్యూటర్ తెరపై మీ అంతర్గత అవయవాల యొక్క త్రిమితీయ (three-dimensional) చిత్రాన్ని అందిస్తుంది. సీటీ స్కాన్ మూత్రపిండాలలో రాళ్ళు, మూత్ర నాళంలో ఏర్పడి ఉండే కణితలు, ఇతర అడ్డంకులు, ఊతలు (swellings), ఇంకా, మీ శరీర అవయవాలేవైనా విడ్డూరంగా పెరిగి ఉంటే వాటిని కూడా చూపిస్తుంది.
- రేడియోన్యూక్లిడ్ స్కాన్స్
రేడియోన్యూక్లిడ్ స్కాన్లో, రేడియోధార్మికత (రేడియోధార్మికతను విడుదల చేసే రసాయనాలు) పదార్థాన్ని రక్తంలోకి ఎక్కించబడుతుంది. ఈ రేడియోధార్మిక పదార్థం మీ మూత్రావాహికను చేరుకుంటుంది, అదే సమయంలో శరీరంలో రేడియోధార్మిక పదార్ధం వెళ్ళేటప్పుడు ప్రత్యేక కెమెరాల ద్వారా చిత్రాలు తీసుకోబడతాయి. ఈ పరీక్ష మీ మూత్రపిండాలు సరిగ్గా పని చేస్తున్నాయా లేదా అని తనిఖీ చేస్తుంది.
పైన పేర్కొన్న అన్ని పరీక్షలకు ముందుగా మీ వైద్యుని సూచనలను తూచా-తప్పకుండా పాటించాలి. ఎందుకంటే, ఈ పరీక్షలను మీకు చేసే ముందు తినడం మరియు తాగడం వంటి జాగ్రత్తలు తీసుకోవలసిన ఖచ్చితమైన అవసరాలు ఉన్నాయి.