అధిక వ్యాయామం అంటే ఏమిటి?
వ్యాయామం సరైన మరియు ఆరోగ్యకరమైన శరీరం కోసం అవసరం అయినప్పటికీ, శరీరం భౌతిక/శారీరక ఒత్తిడిని భరించడానికి కొన్ని పరిమితులు/హద్దులు ఉన్నాయి, మరియు ఈ పరిమితి/హద్దు దాటిపోవడాన్ని అధిక వ్యాయామం అంటారు. అధిక-వ్యాయామం అనేక సమస్యలకు దారి తీస్తుంది మరియు వ్యక్తి యొక్క రోజువారీ కార్యకలాపాలకు కూడా ఆటంకం కలిగించవచ్చు.
దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
అధిక వ్యాయామం యొక్క ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు:
- అలసట
- చిరాకు మరియు మానసికస్థితి మార్పులు
- నిద్ర పట్టడంలో సమస్యలు
- అధిక బరువు నష్టం/తగ్గుదల అది సాధారణ స్థాయి కంటే తగ్గిపోయే బాడీ మాస్ ఇండెక్స్ స్థాయికి దారితీస్తుంది
- ఆందోళన
- తరచుగా జలుబుకు గురికావడం
- కాళ్లు చేతులు బరువుగా మరియు కండరాలు పచ్చిగా (నొప్పిగా) ఉన్న భావన
- నిరాశగా అనిపించడం
- అధిక వ్యాయామం కారణంగా గాయాలు
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
అధిక వ్యాయామానికి ప్రధాన కారణాలు ఈ క్రింది విధంగా ఉంటాయి:
- వ్యక్తి వ్యాయామం చేయకపోతే నిరాశ, ఆందోళన, చిరాకు మరియు ఇతర సమస్యలకు కారణమయ్యే కంపల్సివ్ ఎక్సస్ర్సైజ్ (తప్పనిసరిగా వ్యాయామం చేయాలనే భావన).
- బులీమియా నెర్వోసా, అనే తిండి సంభందిత రుగ్మత, దీనిలో అతిగా తినడం దాని తర్వాత అతిగా వ్యాయామం జరుగుతుంది. బులీమియా నెర్వోసాతో ఉన్న వ్యక్తులు వారి శరీరం ఆకారం మరియు బరువు గురించి చాలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు, దాదాపు అబ్సెసివ్ గా ఉంటారు మరియు వారు అధిక బరువును కలిగి ఉన్నారని భావిస్తూ బరువును తగ్గించుకోవడం కోసం వివిధ పద్ధతులకు పాటిస్తారు.
దీనిని ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?
అతడు / ఆమె వారి యొక్క వ్యాయామ స్థాయిని నియంత్రించలేకపోతున్నట్లయితే మరియు అధిక వ్యాయామం యొక్క సంకేతాలు ఉంటే వారు వైద్యులని సంప్రదించాలి. వైద్యులు శారీరక పరిశీలన చేసి, ఈ పరిస్థితికి సంబంధించిన కొన్ని ప్రశ్నలను అడుగుతారు. వైద్యులు అధిక వ్యాయామం యొక్క కారణాన్ని గుర్తించి, కంపల్సివ్ ఎక్సస్ర్సైజ్ లేదా బులీమియా నెర్వోసాను అనుమానించినట్లయితే వ్యక్తిని కౌన్సిలర్ కు సిఫారసు చేయవచ్చు.
ఈ పరిస్థితి చికిత్సకు ఈ క్రింది పద్ధతులను ఉపయోగించవచ్చు:
- యాంటీ డిప్రెసెంట్ (Anti-depressant) మందులు
- కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ (Cognitive behavioural therapy)
- సహాయక విధానాలు (Support groups)
అధిక వ్యాయామాన్ని తగ్గించడానికి మరియు నిర్వహించడానికి ఉండే కొన్ని జీవనశైలి మార్పులు:
- వ్యాయామం చేసే స్థాయిని మరియు తీసుకునే ఆహారాన్ని సమతుల్యంలో ఉంచుకోవాలి
- వ్యాయామం చేస్తున్నప్పుడు ద్రవాలను పుష్కలంగా తాగాలి
- తీవ్ర చల్లని మరియు వేడి వాతావరణంలో వ్యాయామం చేయడం మానుకోవాలి
- రాత్రి కనీసం ఎనిమిది గంటలు నిద్రించాలి
- వ్యాయామం యొక్క రెండు సెషన్ల మధ్య కనీసం ఆరు గంటలు విశ్రాంతి తీసుకోవాలి
- ప్రతి వారం వ్యాయామం నుండి ఒక రోజు విరామం తీసుకోవాలి