సారాంశం
ఎముకలు వాటికున్న సాంద్రతను కోల్పోయి పెళుసుబారడం ప్రారంభిస్తాయి, దీనినే “బోలు ఎముకల వ్యాధి” అని అంటారు. “ఎముకలు పెళుసుబారిపోయే వ్యాధి” అని కూడా ఎక్కువగా అంటారు దీన్ని. ఈ ఎముక పెళుసుబారడం లేదా బలహీనపడిపోవడం అనేది, తత్ఫలితంగా ఏర్పడే ఉపద్రవాలు పురుషుల కన్నా స్త్రీలలోనే చాలా సాధారణం. బోలు ఎముకల వ్యాధి యొక్క అత్యంత సాధారణ కారణాలు హార్మోన్ల మార్పులకు దారితీసే ఋతుస్రావము నిలుచుట (రుతువిరతి), కాల్షియం మరియు విటమిన్ డి యొక్క లోపం మరియు వారిలో ఇతర వ్యాధుల ఉనికి. బోలు ఎముకల వ్యాధి ఉన్నవారికి అతి పెద్ద ఆరోగ్య ప్రమాదం (a biggest health risk) ఏదంటే కింద పడిపోవడం. పడటం మూలంగా అయ్యే గాయాల కారణంగా ఎముకలు విరగడం అనేది అతి పెద్ద ప్రమాదం (risk). బోలు ఎముకల వ్యాధి ఉన్న వ్యక్తులకు ఎముకలు బలహీనపడటం మరియు వక్రమైన ఎముకలున్న కారణంగా నిస్సారమైన శరీర భంగిమలకు దారి తీయడం సర్వసాధారణం. అంటే విరిగిన ఎముకల కారణంగా మనిషి కూర్చునేవిధంలోనూ, నిల్చొనే విధంలోనూ దయనీయత గోచరిస్తుంది. హార్మోన్ థెరపీ, పథ్యసంబంధ మందులు మరియు ఆరోగ్యకరమైన జీవనశైలి ఈ వ్యాధి చికిత్సకు ప్రధానమైనవి. వ్యాధిని ప్రారంభదశలోనే కనుక్కుని వ్యాధి నిర్ధారణ చేసుకున్నట్లైతే, ఎముకలు మరింత దెబ్బతిని విరిగి పాడైపొయ్యేప్రమాదాన్ని గణనీయంగా తగ్గించి రోగిని కాపాడవచ్చు.