నోటి పూత - Mouth Ulcer in Telugu

Dr Razi AhsanBDS,MDS

December 19, 2018

September 11, 2020

నోటి పూత
నోటి పూత

సారాంశం

నోటి పూత అనేది తేలికపాటి వాపు మరియు నొప్పితో కూడుకున్న మృదువైన పుండులా కనిపించే సాధారణ స్థితి. ఇది ప్రధానంగా నోటిలోని పొర సున్నితంగా మరియు మృదువుగా ఉండటం వల్ల దానికి హాని కలిగినప్పుడు వస్తుంది. నోటి పూతలు వివిధ వయస్సుల వారిలో చాలా సాధారణం మరియు గాయం, పోషకాహార లోపాలు లేదా నోటి అపరిశుభ్రత వంటివి దీనికి కారణాలు కావచ్చు. అవి క్లినికల్ పరీక్షలో సులభంగా నిర్ధారించవచ్చు మరియు రక్త పరీక్షలు అవసరం లేదు. అయినప్పటికీ, పునరావృత నోటి పూతల యొక్క కారణాన్ని గుర్తించడానికి రక్త పరీక్షలను నిర్వహించవచ్చు. సాధారణంగా, వైద్యుడు పుండు వేగంగా నయంకావడానికి మందులని సూచిస్తాడు. నోటి పూతలను నయం చేయడంలో సహాయపడే అనేకమైన ఇంటి చిట్కాలు కూడా ఉన్నాయి. నోటి పూతల చికిత్స చాలావరకు ప్రాచీనమైనది మరియు యాంటీమైక్రోబియల్ మౌత్వాషెస్, విటమిన్ బి కాంప్లెక్స్ సప్లిమెంట్లు మరియు పై పూతగా రాసే నొప్పి తెలీకుండా చేసే జెల్స్ వంటివాటి వాడకం కలిగి ఉంటుంది. విటమిన్ B12 మరియు ఫోలిక్ యాసిడ్ అధికంగా ఉండే ఆహారాలు తినడం వల్ల నివారించవచ్చు. 

నోటి పూత యొక్క లక్షణాలు - Symptoms of Mouth Ulcer in Telugu

నోరు పూతలు బుగ్గల లోపల , పెదవుల మీద లేదా నాలుక మీద కూడా రావచ్చు. ఒక వ్యక్తి ఒక సమయంలో ఒకటి కంటే ఎక్కువ నోటి పుండ్లు కలిగి ఉండవచ్చు. అవి సాధారణంగా చుట్టుపక్కల ఎరుపుధనంతో కూడిన వాపులాగా కనిపిస్తాయి. పుండుకి  మధ్యలో పసుపు లేదా బూడిద రంగులో ఉండవచ్చు.

నోటి పూతల యొక్క అత్యంత సాధారణ లక్షణాలలో ఇవి ఉన్నాయి:

  • నోటి లోపల మృదువైన ఎర్రని కోతలు.
  • మాట్లాడేటప్పుడు మరియు తినేటప్పుడు నొప్పి.
  • మండుతున్న భావన.
  • రేగుదల
  • ఎక్కువగా లాలాజలం ఊరటం లేదా చొంగ కారడం.
  • చల్లని ఆహారం లేదా పానీయాలు తీసుకోవడం వల్ల తాత్కాలిక ఉపశమనం.
  • మంట (పిల్లల విషయంలో).

నోటిపూతలు సాధారణంగా కొన్ని రోజుల్లనే  నయం అవుతాయి. అయితే, ఈ క్రింది వాటిని గనుక గమనిస్తే వైద్యుడిని సందర్శించడం చాలా అవసరం:

  • నొప్పి లేని పుండు కనిపించటం.
  • పుండ్లు వేరే ప్రదేశాలకు వ్యాపించడం.
  • పుండ్లు 2 -3 వారల కంటే ఎక్కువ ఉండటం.
  • ద్దవిగా పెరుగుతున్న పుండ్లు.
  • జ్వరంతో కూడుకున్న పుండ్లు.
  • పుళ్ళుతో పాటుగా రక్తస్రావం, చర్మపు దద్దుర్లు, మ్రింగుటలో ఇబ్బంది వంటివి ఉండటం. 

నోటి పూత యొక్క చికిత్స - Treatment of Mouth Ulcer in Telugu

నోటి పూతలకు వైద్యం అవసరం ఉండచ్చు లేకపోవచ్చు. అవి సాధారణంగా స్వీయ సంరక్షణ మరియు కొన్ని చిన్న ఇంటి చిట్కాల సహాయంతో నయం చేయవచ్చు. అయినప్పటికీ, డాక్టర్ వేగంగా ఉపశమనం కలగడానికి మందులను సూచించవచ్చు. వీటిలో

  • నొప్పి తగ్గించడానికి నాన్-స్టెరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ (NSAIDs) ఇవ్వవచ్చు.
  • యాంటీమైక్రోబయల్ మౌత్వాషెస్ మరియు నొప్పి తెలీకుండా చేసే ఆయింట్మెంట్లు మంట (వాపు) మరియు నొప్పి తగ్గడానికి సహాయపడతాయి.. 
  • పుండు యొక్క అంతర్లీన కారణం నిర్ణయించబడితే, వ్యాధికి సంబంధించిన ప్రత్యేక చికిత్సను aఅనుసరించవచ్చు. యాంటీబయాటిక్స్ లేదా యాంటివైరల్స్ వంటి నిర్దిష్ట ఇన్ఫెక్షన్ల కోసం ఓరల్ యాంటీమైక్రోబియాల్స్.
  • విటమిన్ B12 లేదా B కాంప్లెక్స్ లోపాలకు అవే ఇవ్వడం.
  • నొప్పి మరియు వాపు నుండి ఉపశమనం కలిగించడానికి పుండుపై రాసే అనల్జెస్జిక్ (నొప్పి-నివారించే) మరియు / లేదా యాంటీ -ఇంఫ్లమ్మెటరీ ఆయింట్మెంట్లు
  • నోటి క్యాన్సర్ దశ ఆధారంగా, కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ లేదా రేడియోథెరపీ, లేదా శస్త్రచికిత్సను కలిగి ఉన్న సరైన చికిత్స.

జీవనశైలి నిర్వహణ

నోటి పూతలను సమర్థవంతంగా ఎదుర్కోవటానికి తీసుకోవలసిన కొన్ని జాగ్రత్తలు ఉన్నాయి.

ఏం చేయాలి?

  • మీ దంతాలను  శుభ్రపరుచుకునేటప్పుడు మృదువైన, ఎక్కువ నాణ్యత గల టూత్ బ్రష్ను ఉపయోగించండి. రోజుకు రెండుసార్లు బ్రష్ చేయండి.
  • విటమిన్లు A, C మరియు E వంటి అనామ్లజనకాలు పుష్కలంగా ఉన్న ఆహారాలు తినండి. ఉదా: సిట్రస్ పండ్లు, బొప్పాయి, మామిడి, క్యారట్లు, నిమ్మ, జామ, క్యాప్సికమ్, బాదం, ఉసిరి.
  • నమలటానికి సులభంగా ఉండే ఆహార పదార్ధాలను తినండి.
  • క్రమం తప్పకుండా దంత పరీక్షలు చేయించుకోండి.
  • ఎక్కువ నీటిని తాగండి

ఏమి చేయకూడదు?

  • మసాలా లేదా ఎసిడిక్ ఆహారాన్ని తినడం.
  • సోడా తాగడం.
  • ఘాటైన మౌత్వాష్ లేదా టూత్ పేస్టును ఉపయోగించడం..
  • పుండును చిదమడానికి  దాన్ని నొక్కడం.
  • నిరంతరం పుండును  తాకుతూ ఉండటం.
  • మద్యపానం లేదా ధూమపానం.
  • ఎక్కువ వేడిగా ఉన్న పానీయాలు త్రాగటం.
  • చాక్లెట్లు మరియు వేరుశెనగలను ఎక్కువగా తినడం, మరియు రోజుకు అనేకసార్లు కాఫీ తాగడం.

నోటి పూత అంటే ఏమిటి? - What is Mouth Ulcer in Telugu

నోటి పూత అనేది, జనాభాలో 20-30 శాతం మందిని ప్రభావితం చేసే ఒక పరిస్థితి. ఇది నోటి చుట్టూ ఉండే శ్లేష్మ పొర అనబడే ఒక పొర తొలగిపోవడం వల్ల సంభవిస్తుందిఇవి ప్రాణాంతకమైనవి కావు, మరియు దీనికి అనేక రకాల కారణాలు అలాగే చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. పెద్దలు, అలాగే పిల్లలు, నోటి పూతల వల్ల బాధపడతారు మరియు సాధారణంగా ఇవి బాధాకరంగా ఉంటాయి. బుగ్గలు లేదా పెదాల లోపలి భాగంలో ఈ పుళ్ళు కనిపిస్తాయి మరియు ఇవి రెండు నుంచి ఒక వారం లేదా అంతకంటే ఎక్కువ రోజులు ఉండవచ్చు.



వనరులు

  1. Better health channel. Department of Health and Human Services [internet]. State government of Victoria; Mouth ulcers
  2. National Health Portal [Internet] India; Mouth Ulcers (Stomatitis)
  3. Nidirect [Internet]. Government of Northern Ireland; Mouth ulcers
  4. Oral Health Foundation, Smile House, 2 East Union Street, Rugby, Warwickshire, CV22 6AJ, UK [Internet] Mouth ulcers
  5. Dental Health Foundation, Dublin, Ireland [Internet] Mouth Ulcers
  6. National Health Service [Internet]. UK; Mouth ulcers.
  7. MedlinePlus Medical Encyclopedia: US National Library of Medicine; Mouth ulcers

నోటి పూత కొరకు మందులు

Medicines listed below are available for నోటి పూత. Please note that you should not take any medicines without doctor consultation. Taking any medicine without doctor's consultation can cause serious problems.

Lab Tests recommended for నోటి పూత

Number of tests are available for నోటి పూత. We have listed commonly prescribed tests below: