గర్భధారణ సమయంలో ఆకలి లేకపోవడమంటే ఏమిటి?
ఆకలి లేకపోవడం (ఆకలి యొక్క నష్టం) అనేది గర్భధారణ సమయంలో కలిగే సాధారణ సంకేతాలు మరియు లక్షణాల్లో ఒకటి. ఇది అనేక కారణాల వలన గర్భవతుల్లో సంభవిస్తుంది. ప్రధానంగా గర్భధారణ సమయంలో సంభవించే హార్మోన్ల మార్పుల కారణంగా ఆకలి లేకపోవడం జరుగుతుంది.
దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
గర్భధారణ సంకేతాలు మరియు లక్షణాలు ప్రతి మహిళ-మహిళకూ మారుతూ ఉన్నప్పటికీ, ఆకలి నష్టంతో సంబంధం ఉన్న లక్షణాలు సాధారణంగా కనిపిస్తాయి. ఆ లక్షణాలేవంటే:
- బరువు తగ్గడం
- తీవ్రమైన వికారం మరియు వాంతులు (ఉదయవేళ అస్వస్థత)
- తీవ్రమైన అలసట (ఎక్స్ట్రీమ్ ఫెటీగ్)
- అసాధారణ రుచి మార్పు, సాధారణంగా ఇష్టపడే ఆహారాలపట్ల కూడా అరుచి
- ఏమీ తిననపుడు కూడా పులుపు లేదా లోహ రుచి (డైస్జియుసియా) యొక్క అనుభూతి.
- చిత్తవృత్తి (మూడ్) మార్పులు (కారణం చెప్పలేని రోదన (క్రయింగ్) వంటివి)
- మలబద్ధకం
దీనికి ప్రధాన కారణాలు ఏమిటి?
గర్భధారణలో ఆకలిని కోల్పోవడానికి కారణకారకాలు
- గర్భధారణ యొక్క మొదటి లేదా రెండవ త్రైమాసికంలో ప్రధానంగా ఏర్పడిన ఉదయవేళ అస్వస్థత (మార్నింగ్ అనారోగ్యం), తినాలనే కోరిక అణచివేయబడి అటుపై ఆకలి కోల్పోవడానికి దారితీస్తుంది.
- హార్మోన్ల మార్పులు
- గర్భధారణ-సంబంధమైన ఒత్తిడి మరియు ఆందోళన
- తరచుగా మారుతుండే చిత్తవృత్తి (మూడ్ మార్పులు)
- వాసన యొక్క జ్ఞానం: గర్భధారణ సమయంలో కొంతమంది స్త్రీలలో వాసన యొక్క జ్ఞానం ఎక్కువవటంవల్ల ఆకలిని కోల్పోవటం జరుగుతుంది.
దీనిని ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?
సంపూర్ణ చరిత్రను అడిగి తెల్సుకోవడం మరియు శారీరక పరీక్షను నిర్వహించడం ద్వారా వైద్యుడు ఆకలిలేకపోవడమనే సమస్యను నిర్ధారణ చేస్తారు, ఈ నిర్ధారణ పోషకాహారలోపాన్ని మరియు కొలవగల బరువు నష్టం మరియు తీవ్రమైన అలసటను సూచిస్తుంది. పోషకాహార లోపాలను అంచనా వేయడానికి రక్త పరీక్షలు సూచించబడతాయి.
గర్భధారణ సమయంలో ఆకలి లేకపోవడమనే పరిస్థితి నిర్వహణ ఇలా ఉంటుంది
- ఇంటివద్దనే గర్భవతి నిర్వహణ
గర్భధారణ సమయంలో తీసుకునే ఆహారంలో చాలా పండ్లు మరియు కూరగాయలు (పీచులు పదార్దాలు సమృద్ధిగా ఉండేవి), పాల ఉత్పత్తులు (పాలు , జున్ను, మరియు పెరుగు), పిండి పదార్ధాలు (పాస్తా, బియ్యం, చపాటిస్, రొట్టె మరియు అల్పాహారం తృణధాన్యాలు) మరియు బీన్స్ మరియు పప్పు ధాన్యాలు, ప్రోటీన్లను దండిగా కల్గిఉండే మాంసం మరియు పౌల్ట్రీ ఉత్పత్తులు ఉండేట్లు చూసుకోవడం ముఖ్యం. ఆహారాన్ని ఎక్కువగా ఉడకబెట్టడం లేదా మరిగించదాన్ని నివారించాలి. - మందులతో వైద్య నిర్వహణ (మెడికల్ మేనేజ్మెంట్)
- గ్యాస్, అజీర్ణం , ఆమ్లత (యాసిడ్ రిఫ్లక్స్), మరియు గుండెల్లో మంటలను తగ్గించడానికి ఆమ్లావిరోధి మందులు (లేక యాంటాసిడ్లు)
- వాంతులను ఆపడానికి ప్రొమెథజైన్, ఆన్డాన్ సెట్రాన్ మరియు మెటోక్లోప్రైమైడ్ వంటి ఆంటీమేటిక్ మందులు
- పోషక లోపాలేవైనా ఉంటే వాటిని సరిచేయడానికి విటమిన్ సప్లిమెంట్స్ ఇవ్వటం
- కాల్షియం సప్లిమెంట్స్ వంటి ఖనిజాలు
- విటమిన్ D3 అనుబంధాలు