సారాంశం
హెచ్ఐవి అనగా హ్యూమన్ ఇమ్యునోడెఫిషియెన్సీ వైరస్, అది ఎయిడ్స్ వ్యాధిని, అనగా అక్వైర్డ్ ఇమ్యునోడెఫిషియెన్సీ సిండ్రోమ్ ను కలుగజేస్తుంది. మామూలుగా ఈ వైరస్ శరీర ద్రవాలను పరస్పర లైంగికంగా మార్పిడి చేసుకోవడం ద్వారా, ఇన్ఫెక్షన్ సోకిన సూదులచే రక్తము ఎక్కించుకోవడం ద్వారా లేదా ఇన్ఫెక్షన్ సోకిన తల్లి నుండి బిడ్డకు వ్యాపిస్తుంది. ఈ వైరస్,శరీరము యొక్క అత్యంత రక్షణాత్మక వ్యవస్థ అయిన రోగనిరోధక వ్యవస్థను నిష్క్రియం చేస్తూ బలహీనపరుస్తుంది మరియు వ్యక్తిని ఇతర సంక్రమణలకు మరియు వ్యాధులకు గురయ్యేలా చేస్తుంది. రెండు రకాల వైరస్ లు ఉన్నాయి, హెచ్ఐవి 1 మరియు హెచ్ఐవి 2. ఈ వ్యాధి తీవ్రత స్థాయి నుండి దీర్ఘాకాలిక దశకు పురోగమిస్తుంది మరియు ఆఖరుకు ఎయిడ్స్ కు దారి తీస్తుంది, ఆ దశలో జీవితకాలము తగ్గిపోతుంది. 1 వ దశలో లక్షణాలు ఫ్లూ వంటి స్థితి నుండి వేర్వేరుగా ఉంటూ, దశ 2 లో అత్యంత క్షీణ పరిస్థితులు మరియు 3 వ దశలో మరింత తీవ్రమైన క్యాన్సర్ మరియు అవయవ వైఫల్యం వంటి సమస్యలు ఉంటాయి. మత్తుమందులు దుర్వినియోగపరచుకునే వారు, అసురక్షిత లైంగిక సంపర్కము కలిగియుండే వారు, మరియు సున్తీ చేయించుకోనివారు హెచ్ఐవి ని తెచ్చుకునే అధిక ప్రమాదములో ఉంటారు.
రక్త పరీక్షలు మరియు కొన్ని గృహ పరీక్షలు వ్యాధి స్థితిని నిర్ధారణ చేసుకోవడంలో సహాయపడతాయి, ఐతే ఫలితాన్ని నిర్ధారణ చేసుకోవడానికి వాళ్ళు తప్పనిసరిగా వెస్టర్న్ బ్లాట్ టెస్టును చేయించుకొని తీరాలి. హెచ్ఐవి/ఎయిడ్స్ కు నయము లేదు, ఐతే యాంటీరిట్రోవైరల్ థెరపీ (ఎ.ఆర్.టి) తో దీర్ఘకాలం పాటు యాజమాన్యము చేసుకోవచ్చు. హెచ్ఐవి కొరకు అత్యధిక మందులు నిరోధకాలుగా ఉంటాయి, వైరస్ ప్రవర్ధమానం కావడానికి సహకరించే కొన్ని రకాల ప్రొటీన్లు రూపొందటాన్ని ఇవి అడ్డుకుంటాయి, కాగా మరి కొన్ని సిడి 4 కణాలు అనబడే కొన్నిరకాల రోగనిరోధక కణాలలోనికి వైరస్ ప్రవేశించకుండా అడ్డుకుంటాయి. ఆహారములో కొన్ని మార్పులు మరియు చికిత్స తీసుకోవడం కొరకు కుటుంబము నుండి మధ్ధతు మరియు మానసిక మరియు శారీరక ఒత్తిడితో జీవించడము పరిస్థితిని బాగుగా నిర్వహించుటకు సహాయము చేస్తుంది. చికిత్స యొక్క దుష్ప్రభవాలు, సంబంధిత వ్యాధులు వంటి అనేక సమస్యలు కూడా ఉంటాయి, వీటి వృధ్ధి కారణముగా బలహీనమైన నిరోధక వ్యవస్థ మరియు క్యాన్సర్ ఏర్పడుతుంది, ఇది దశ 3 లో ఉన్న ప్రజలపై ప్రభావమును చూపుతుంది. ఒకవేళ సకాలములో చికిత్స తీసుకున్నట్లయితే హెచ్ఐవి తో ఉన్న వ్యక్తులు ఇన్ఫెక్షన్ తో 50 సంవత్సరాల వరకూ చురుకైన జీవితం గడపగలుగుతారు మరియు ఎయిడ్స్ తో ఉన్న వ్యక్తులు తమ జీవిత కాలాన్ని మరో 10 సంవత్సరాలు పెంచుకోగలుగుతారు.