శస్త్రచికిత్స (Surgery)
శస్త్రచికిత్సే గిలకవ్యాధిని నయం చేసుకునేందుకు సరైన ఎంపిక. గిలక ఉబ్బులోనికి చొచ్చుకొచ్చిన భాగాల్ని లేదా అవయవాల్ని ఉదరంలోని వాటి యథా స్థానాల్లోకి నెట్టడం లేదా పూర్తిగా తొలగించివేయడం మరియు కుట్లు వేసి ఏర్పడిన రంధ్రాన్ని మూసివేయడం అనేది ఉంటుందీశస్త్ర చికిత్సలో. గిలక ఏర్పడడానికి కారణమైన బలహీనమైన కణజాలం మరియు కండరాలకు మద్దతు (supportive) గా మెష్ (సింథెటిక్ లేదా జంతు-సంబంధ పదార్థంతో తయారైన కృత్రిమమైన వలవంటిది) ఉపయోగించబడుతుంది.
ఈ శస్త్రచికిత్సను రెండు విధాలుగా చేయవచ్చు: 1. ఓపెన్ లేదా సంప్రదాయిక శస్త్రచికిత్స మరియు 2. అతి తక్కువగా జొప్పించే క్రమమున్న శస్త్రచికిత్స లేదా లాపరోస్కోపిక్ శస్త్రచికిత్స. సంప్రదాయిక ఓపెన్ శస్త్రచికిత్సలో, గిలక (ఉబ్బు) ఉన్న చోట ఒక పొడవైన మరియు పెద్ద కట్ లేదా చీలిక చేసి లోపల ఉండే బలహీనమైన కండరాలకు వైద్యులు మరమ్మతులు చేస్తారు. లాపరోస్కోపిక్ లేదా “కీహోల్” శస్త్రచికిత్సలో, పలు చిన్న రంధ్రాలు లేదా కోతలు పెడతారు, తర్వాత ట్యూబ్-వంటి పరికరాలను ఉపయోగించి శస్త్రచికిత్స నిర్వహిస్తారు. ఒక మానిటర్ మీద వైద్యుడికి ఒక వివరణాత్మకమైన వీక్షణ పొందటానికి, అవసరమైన ప్రక్రియ నిర్వహించడానికి శస్త్రచికిత్సలో భాగంగా ఒక కెమెరా కూడా అమర్చబడి ఉంటుంది.
గజ్జల్లో ఏర్పడ్డ గిలకవ్యాధులకు, హెర్నియోటమీ, హెనియోర్రఫ్ఫి, లేదా హెర్నియోప్లాస్టీ అనేవి కీలక శస్త్రచికిత్సా పద్దతులు. “కుంట్జ్ ఆపరేషన్,” ఆండ్రూ యొక్క ఇంబ్రికేషన్స్ (imbrications), లేదా మ్వేవే లేదా న్హ్యూస్ రిపేర్ వంటి ఇతర శస్త్రచికిత్స విధానాలను కూడా అవసరాన్ని బట్టి వైద్యుడు నిర్ణయిస్తాడు. ఇలాంటి అనేక రకాల గిలకవ్యాధుల్ని నయం చేయడానికి వేర్వేరు శస్త్రచికిత్సలను చేస్తారు.
శస్త్రచికిత్స మాత్రమే గిలకవ్యాధికి ఎల్లప్పుడూ ప్రత్యామ్నాయం కాదు. మీకు ఉన్న గిలకవ్యాధి ఎలాంటి ఆరోగ్య సమస్యల్నికలిగించనట్లయితే శస్త్రచికిత్స ఏమాత్రం అవసరము లేదు. అంతేకాకుండా, వయసై పోయిన ముసలివారికి, తీవ్రంగా అనారోగ్యంతో ఉన్నవారికి శస్త్రచికిత్సను తప్పించవచ్చు.
మందులు (Medications)
అప్పుడప్పుడు, హియాటల్ హెర్నియా సమయంలో, మందుల అంగడిలో (over the counter medicines) దొరికే మందులు/ఉత్పత్తులు మరియు ఇతర మందులు కడుపు ఆమ్లం సమస్యని తగ్గిస్తాయని సూచించబడవచ్చు, తద్వారా మీరు ఎదుర్కొంటున్న అసౌకర్యం మరియు ఇతర లక్షణాలను ఉపశమనం చేస్తాయి. వీటిలో కొన్ని మందులు నొప్పిని సంహరించేవి, కడుపులో ఉండే ‘హిస్టమిన్’ అనే పదార్థానికి వ్యతిరేకంగా పనిచేసే H-2 రిసెప్టర్ బ్లాకర్స్, యాంటాసిడ్లు మరియు ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ (కడుపు ఆమ్లం ఉత్పత్తిని తగ్గించే మందులు).
జీవనశైలి నిర్వహణ (Lifestyle management)
ఆహారంలో మార్పులు చేసుకోవడం ద్వారా తరచుగా హియాటల్ హెర్నియా లక్షణాలకు చికిత్స చేయవచ్చు కానీ పూర్తిగా నయం చేయలేవు. నాణ్యమైన మరియు పరిమాణపరంగా భారీ భోజనం చేయడం మానుకోవాలి. భోజనమైన తర్వాత వెంటనే పడుకోకూడదు మరియూ అధిక శ్రమతో కూడిన భౌతికమైన పనుల్ని చేయకూడదు. దట్టమైన మసాలాలు కల్గిన పదార్థాలు లేదా అతి పుల్లని ఆహారాలను తీసుకోవడం మానుకోవడం ద్వారా హియాటల్ హెర్నియా రోగులు ఆమ్లము తిరిగి తిరిగి ఊరడం (acid reflux) అనే సమస్యను తగ్గించవచ్చు. అంతేకాక, వ్యాధి లక్షణాలున్నంత వరకూ ధూమపానం పూర్తిగా మానుకోండి. శరీర బరువును అదుపులో ఉంచాలి, వ్యక్తి యొక్క ఎత్తుననుసరించి బరువును నియంత్రించడానికి చర్యలు తీసుకోవాలి.
కొన్ని వ్యాయామాలు శరీరంలో హెర్నియా వ్యాధి కల్గిన చోటు చుట్టూ కండరాలను బలోపేతం చేయడానికి సహాయపడతాయి, అంతే కాకుండా ఇవి కొన్ని వ్యాధిలక్షణాలను తగ్గించవచ్చు కూడా. అయినప్పటికీ, వ్యాయామాలను అర్హత కలిగిన మార్గదర్శకుని పర్యవేక్షణ లేకుండా అభ్యాసం చేయడం వలన వ్యాధి లక్షణాలను మరింత పెంచవచ్చు మరియు పరిస్థితిని మరింత విషమం చేస్తుంది. అందువల్ల, ఒక ఫిజియోథెరపిస్టును సంప్రదించి, అతని/ఆమె పర్యవేక్షణలో వ్యాయామాలు చేసుకోవడం ఉత్తమం.
అవసరమైన అన్ని నివారణాచర్యలను చేపట్టిన తరువాత కూడా వ్యాధి లక్షణాలు ఉపశమనం కాకపోతే, గిలకవ్యాధి/హెర్నియాని నయం చేసుకోవడానికి శస్త్రచికిత్స చేయించుకోవచ్చు.