గ్లోమెరులోనెఫ్రైటిస్ అంటే ఏమిటి?
గ్లోమెరులోనెఫ్రైటిస్ అనేది కిడ్నీగ్లోమెరూలి (రక్తం నుండి వ్యర్ధాలను మరియు ద్రవాలను ఫిల్టర్ [వడకట్టడానికి] చేయటానికి సహాయపడే మూత్రపిండాల లోపల ఉండే చిన్న వడపోతలు)కి నష్టం కలిగించే ఒక మూత్రపిండాల వ్యాధి . ఇది సాధారణంగా ఆరోగ్యకరమైన మూత్రపిండాల కణజాలంపై రోగనిరోధక వ్యవస్థ దాడి చేయడం కలుగుతుంది/సంభవిస్తుంది.
దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
గ్లోమెరులోనెఫ్రైటిస్ తో ముడిపడి ఉండే సంకేతాలు మరియు లక్షణాలు:
- అలసట
- శ్వాస తీసుకోవడం కష్టం
- కాళ్ళు లేదా శరీర ఇతర భాగాల వాపు (ఎడిమ)
- అధికరక్తపోటు
- కీళ్ళ నొప్పి
- దద్దుర్లు
- మూత్రంలో అధిక మోతాదులో ప్రోటీన్లు ఉండడం
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
గ్లోమెరులోనెఫ్రైటిస్ యొక్క ప్రధాన కారణాలు:
- వాస్కులైటిస్ మరియు సిస్టమిక్ ల్యూపస్ ఎరిథమాటోస్ (SLE) వంటి రోగనిరోధక వ్యవస్థ యొక్క సమస్యలు/వ్యాధులు.
- కొంత మంది వ్యక్తులలో, కొన్ని అంటువ్యాధులు (ఇన్ఫెక్షన్) రోగనిరోధక వ్యవస్థలో అసాధారణతలను ప్రేరేపిస్తాయి. అవి:
- గుండె కవాటాలు (హార్ట్ వాల్వ్) కు సంక్రమించే ఎండోకార్డైటిస్
- హెపటైటిస్ బి మరియు హెపటైటిస్ సి వంటి కాలేయపు వైరల్ ఇన్ఫెక్షన్లు
- హ్యూమన్ ఇమ్మ్యూనో డెఫిసియన్సీ వైరస్ (HIV)
- వారసత్వంగా సంభవిచే అవకాశం ఉంది
దీనిని ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?
లక్షణాల సరైన వివరాలు తెలుసుకున్న తర్వాత వైద్యులు ఈ కింది పరీక్షలను ఆదేశించవచ్చు:
- రక్త పరీక్షలు:
- క్రియాటినిన్ (Creatinine) స్థాయిలు, ఇవి మూత్రపిండాల రుగ్మతలు ఉన్న వ్యక్తులలో అధికంగా ఉంటాయి.
- ఎస్టిమేట్డ్ గ్లోమెరులర్ ఫిల్టరేషన్ రేటు (eGFR, Estimated glomerular filtration rate), ఇది కిడ్నీ వ్యాధులలో తగ్గుతుంది.
- ఆటో ఇమ్యూన్ రియాక్షన్ (స్వయం ప్రతిరక్షక దాడిని) ప్రేరేపించే వివిధ రకాల యాంటీబాడీల తనిఖీ కోసం పరీక్షలు.
- మూత్ర పరీక్ష: మూత్రంలో రక్తం లేదా ప్రోటీన్ల ఉనికిని తనిఖీ చేసేందుకు.
- అల్ట్రాసౌండ్ స్కాన్: మూత్రపిండాలలో ఏవైనా సమస్యలు ఉంటే తనిఖీ చేయడానికి, అడ్డంకులు వంటివి ఏవైనా ఉంటే వాటి తనిఖీ కోసం.
- జీవాణుపరీక్ష (బయాప్సీ): మూత్రపిండ కణజాల నమూనాను సేకరించి దానిని మైక్రోస్కోప్ తో పరిశీలిస్తారు.
గ్లోమెరులోనెఫ్రైటిస్ చికిత్స వ్యాధి తీవ్రతను బట్టి, లక్షణాలు బట్టి ఉంటుంది. తేలికపాటి కేసుల్లో, చికిత్స అవసరం లేదు.
చికిత్స పద్ధతుల్లో కొన్ని ఈ విధంగా ఉంటాయి:
- ఆహార విధాన మార్పులు: అధిక రక్తపోటును నియంత్రణలో ఉంచేందుకు ఉప్పు, పొటాషియం అధికంగా ఉండే ఆహార పదార్ధాలు మరియు ద్రవాలను తీసుకోవడం తగ్గించాలి.
- పొగ త్రాగడం ఆపివేయాలి: ధూమపానాన్ని నివారించాలని సలహా ఇస్తారు, ఎందుకంటే ఇది గ్లోమెరులోనెఫ్రైటిస్ను మరింత తీవ్రతరం చేస్తుంది మరియు గుండె జబ్బులు, స్ట్రోక్ ల ప్రమాదాన్ని పెంచుతుంది.
- మందులు:
- ఆంజియోటెన్సెన్ రిసెప్టర్ బ్లాకర్స్ (ARBs,angiotensin receptor blockers), యాంజియోటెన్సిన్-కన్వర్టింగ్ ఎంజైమ్ (ACE, angiotensin-converting enzyme) ఇన్హిబిటర్లు, డైయూరిటిక్స్ మరియు మొదలైన మందుల వంటి రక్తపోటును తగ్గించే మందులు.
- వాపు తగ్గించడానికి మరియు రోగనిరోధక వ్యవస్థ ప్రతిచర్యలు అణిచివేసేందుకు (తగ్గించేందుకు), కార్టికోస్టెరాయిడ్స్ (ప్రిడ్నిసోన్ [prednisone]) సూచించబడతాయి.
- రోగనిరోధక వ్యవస్థలో సమస్యలు ఎదురైనప్పుడు, టాక్రోలిమస్ (tacrolimus), సైక్లోస్పోరిన్ (cyclosporine), అజాథయోప్రైన్ (azathioprine), రిట్యుక్సిమాబ్ (rituximab) లేదా మైకోఫెనోలట్ మోఫేటిల్ (mycophenolate mofetil) వంటి ఇమ్యునోసప్రెసెంట్స్ సూచించబడవచ్చు.
- తక్కువ మోతాదులలో సైక్లోఫాస్ఫమైడ్ (Cyclophosphamide) కూడా ఇమ్యునోసప్రెసెంట్స్ గా ఉపయోగిస్తారు.
- వైరల్ ఇన్ఫెక్షన్ ఉన్నవారికి యాంటీవైరల్ మందులు ఇవ్వబడతాయి.
- గ్లోమెరులోనెఫ్రైటిస్ ఉన్నవారిలో సాధారణంగా కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువగా ఉంటాయి, అందువల్ల కొలెస్ట్రాల్-తగ్గించే మందులు సూచించబడతాయి.
-
తీవ్ర సందర్భాలలో ప్లాస్మా మార్పు జరుపవచ్చు