గాస్ట్రోశ్చిసిస్ అంటే ఏమిటి?
గాస్ట్రోశ్చిసిస్ అనేది పుట్టుకలో లోపం (birth defect), శిశువు ఉదర కండరాలలో లోపము వలన శిశువు ప్రేగులు రంధ్రము ద్వారా బయటకు ఉబ్బినట్టు కనిపిస్తాయి; ఇది సాధారణంగా కడుపు నాభి (బొడ్డు) కి కుడివైపున కనిపిస్తుంది. గర్భధారణ సమయంలో, శిశువు ప్రేగులు ఉదరానికి బయట ఉండడం వలన, బిడ్డ చుట్టూ ఉండే ఉమ్మనీరు యొక్క రోగనిరోధక చర్యల ప్రభావంతో అవి దెబ్బతింటాయి. ఉదర కండరాల లోపముతో కూడిన అభివృద్ధి వలన ప్రేగులు చుట్టుకుపోయి బిగువుగా మరింతగా దెబ్బతింటాయి.
దానితో ముడిపడిన ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
గాస్ట్రోశ్చిసిస్ యొక్క సంకేతాలు మరియు లక్షణాలు
- బొడ్డు తాడుతో పాటు పొట్టలోనుంచి ఒక రంధ్రము ద్వారా ప్రేగులు బయటకు ఉబికి ఉంటాయి.
- ప్రేగులు మెలితిరిగి, ఒకదానితో మరొకటి చిక్కుకుంటాయి.
- కొన్నిసార్లు చిన్న ప్రేగులతో పాటు పిత్తాశయం, పెద్ద ప్రేగులు లేదా కాలేయ వంటి ఇతర అవయవాలు కూడా ఉంటాయి.
- మెలితిరిగిన మరియు చిన్నగా ఉన్న ప్రేగుల వలన పోషకాలు సరిగ్గా అందవు (శోషించబడవు) అందువలన శిశువు ముందుగానే జన్మించడం మరియు ఎదుగుదల సరిగ్గా లేకపోవడం జరుగుతుంది
- శిశువు పుట్టిన తరువాత పాలు తాగించడం కష్టమవుతుంది.
గాస్ట్రోశ్చిసిస్ యొక్క ప్రధాన కారణాలు ఏమిటి?
ఖచ్చితమైన కారణం ఏది గాస్ట్రోశ్చిసిస్ తో ముడి పడి లేదు. కొన్ని ప్రమాద కారకాలు:
- తల్లి వయస్సు 20 సంవత్సరాల కన్నా తక్కువ ఉండడం .
- గర్భధారణ సమయంలో ధూమపానం చేయడం.
- గర్భధారణ సమయంలో మద్యపానం వినియోగం.
- గర్భధారణ సమయంలో పోషకాహార లోపాలు.
ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి ?
శిశువు జననానికి ముందు గాస్ట్రోశ్చిసిస్ ను గుర్తించడానికి వివిధ పరీక్షలు మరియు పరిశోధనలు ఉన్నాయి.
- రక్త పరీక్షలు
- తల్లి రక్తంలో ఆల్ఫా ఫెటో ప్రోటీన్ల (AFP,alpha fetoproteins) అధిక స్థాయి శిశువులో లోపాలను సూచిస్తుంది.
- ఇమేజింగ్ పద్ధతులు
- గర్భధారణ యొక్క 10 నుండి 14 వారాలలో అల్ట్రాసౌండ్ మరియు 18 నుంచి 21 వారాల మధ్య అనోమలీ స్కాన్ (anomaly scan) గాస్ట్రోశ్చిసిస్ గుర్తిస్తుంది.
- అల్ట్రాసౌండ్ స్కాన్లో కనిపించిన ఉమ్మనీరు పెరుగుదల తరచుగా/సాధారణంగా గాస్ట్రోశ్చిసిస్ ను సూచిస్తుంది.
ఓంఫెలిసిలి (Omphalocele) గాస్ట్రోశ్చిసిస్ వలె జన్మ లోపం. ప్రేగులు (మరియు కడుపు, కాలేయం లేదా పిత్తాశయం) ఉదరం యొక్క మధ్య నుండి బొడ్డు తాడు ద్వారా బయటకు ఉబికి ఉంటాయి. గాస్ట్రోశ్చిసిస్ లా కాకుండా, ఓంఫెలిసిలి, బొడ్డు తాడు పై రక్షణ పొర ప్రేగులు మరియు ఇతర అవయవాలను కప్పి ఉంచుతుంది.
శస్త్రచికిత్స మాత్రమే గాస్ట్రోశ్చిసిస్కు చికిత్సా విధానం. ముందుగా, ఉదరం వెలుపల ఉన్న ప్రేగులు మరింత దెబ్బతినడాన్నీ నివారించడానికి ఒక రక్షణ పొరతో (protective film) మూసివేయబడుతుంది. గాస్ట్రోశ్చిసిస్ చికిత్సకు రెండు రకాల శస్త్రచికిత్సలు ఉన్నాయి
- బయటకు ఉబికి వచ్చిన ప్రేగులని తిరిగి ఉదరంలోకి పెట్టి ఉదర గోడలను మూసివేయడం.
- కొన్ని దశలలో కడుపు బయట ఉన్న ప్రేగులను వాటి స్థానంలో చేర్చడం.