చీలమండ విరిగడం (ఎంకిల్ ఫ్రాక్చర్) అంటే ఏమిటి?
చీలమండ(ankle) ఉమ్మడి (joint) మూడు ఎముకలతో చేయబడి ఉంటుంది - టిబియా (షిన్ బోన్) {tibia (shinbone)}, ఫిబ్యులా (కాల్ఫ్ బోన్) {fibula (calf bone)}, మరియు టాలస్ {talus} (టిబియా , ఫిబ్యులా మరియు మడమ ఎముక మధ్య ఉండే ఒక చిన్న ఎముక) తయారు చేయబడుతుంది. ఒక విరిగిన చీలమండలో, చీలమండ ఉమ్మడి ఉండే ఏ ఎముకకైనా పగులు (బ్రేక్) రావచ్చు. ఫ్రాక్చర్ ఒకే ఎముకలో (ఒక సాధారణ జరుగుతుంది) సంభవించవచ్చు, ఇది రోజువారీ కార్యకలాపాలకు ఆటంకం కలిగించదు లేదా వైద్య శ్రద్ధ అవసరమయ్యే, చీలమండ ఎముకకు హానికలిగే ఒక తీవ్ర ఫ్రాక్చర్ కూడా సంభవించవచ్చు. ఏ వయస్సులో ఒక చీలమండకు ఫ్రాక్చర్ కావచ్చు. చీలమండ పక్కన ఉండే ఎముక (lateral malleolus ) పగులు అనేది తరచూ సంభవించే రకమైన చీలమండ ఫ్రాక్చర్ (అన్ని రకాల చీలమండ ఫ్రాక్చర్లలో 55%గా ఉంది). US లో నిర్వహించిన ఒక అధ్యయనంలో, చీలమండ ఫ్రాక్చర్ల సంభవం 100,000 వ్యక్తులకి 187మందిగా గుర్తించబడింది. భారతదేశంలో, వార్షిక సంభవం 100,000 వ్యక్తులకు 122 చీలమండ ఫ్రాక్చర్లు.
దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
విరిగిన చీలమండ యొక్క అత్యంత సాధారణ లక్షణాలలో ఇవి ఉంటాయి:
- ప్రభావిత ప్రాంతం నుండి మోకాలి వరకు వ్యాపించే భరించలేని నొప్పి.
- స్థానికంగా ఉండే లేదా మొత్తం కాలికి ఉండే ఎడెమా (వాపు).
- పొలుసుగల బొబ్బ ఏర్పాడడం.
- నడవడానికి అసమర్థత.
- ఎముక చర్మంలోకి గుచ్చుకుపోవడం.
సున్నితత్వం/ తాకితెనే నొప్పి సంభవిస్తుంది, మరియు వ్యక్తి ప్రభావిత పాదము బరువును భరించలేక పోవచ్చు. విరిగిన చీలమండ ఒక సాధారణ బెణుకుగా అయోమయాన్ని కలిగించవచ్చు.
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
చీలమండ ఫ్రాక్చర్లు ఎక్కువగా సంభవించడానికి కారణాలు కాలి పాదం బెణకడం / ఇలుకు పట్టడం మరియు ఆటలు ఆడుతున్నప్పుడు ఆ బెణుకు ఎక్కువై ఫ్రాక్చర్ గా ఏర్పడుతుంది. అధిక రక్త చక్కెర స్థాయి కలిగిన రోగులు తమ సెన్సారీ (sensory) నరాలకు నష్టం కలగడం వలన వారి శరీరానికి గాయం తగిలిందని వారు గ్రహించలేరు అది ఎముకకి ఇంకా ఎక్కువ హాని కలిగించి ఎముకు చుట్టు ఉన్న భాగాలకు కూడా నష్టం కలిగిస్తుంది. ధూమపానం మరియు అధిక శరీర బరువు సూచిక (BMI ,body mass index) నిష్పత్తి కూడా తరచుగా చీలమండ ఫ్రాక్చర్లతో ముడి పడి ఉంటుంది.
ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?
వైద్యులు చీలమండ విరగడానికి గల బాధాకరమైన సంఘటన గురించి తనిఖీ చేయవచ్చు అలాగే దానిని అనుసరించి ఉన్న ఆరోగ్య పరిస్థితిను, లక్షణాలను మరియు ప్రభావిత చీలమండను మరింత క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఎక్స్ - రే ద్వారా పగులు (ఫ్రాక్చర్) విశ్లేషించబడుతుంది. ఇతర పరీక్షలలో సిటి (CT) స్కాన్ మరియు ఎంఆర్ఐ (MRI) స్కాన్లు ఉన్నాయి. శస్త్రచికిత్స ఏమైనా అవసరముందా అని తెలుసుకోవడానికి ఒత్తిడి పరీక్ష (stress test) నిర్వహించబడుతుంది.
చికిత్స విధానాలు ఇలా ఉంటాయి:
శస్త్రచికిత్స పద్ధతి: దాని స్థానం నుండి తొలగించబడిన చీలమండకు లేదా చర్మంలోకి చొచ్చుకుపోయిన ఎముక కోసం శస్త్రచికిత్స అవసరం అవుతుంది.
శస్త్రచికిత్స అవసరం లేని పద్ధతులు:
- ప్రభావిత కాలి పై ఐసు ముక్క వాడకం మరియు ప్రభావిత కాలుని పైకి పెట్టి ఉంచడం అవి నొప్పిని మరియు వాపుని తగ్గిస్తాయి
- ఎముక దాని స్థానం నుండి తొలగించబడకపోతే స్ప్రింట్ (బద్ద కట్టడం) ఉపయోగం అనేది ప్రభావితమైన చీలమండకు సహాయపడుతుంది.
- పూర్తి విశ్రాంతి తీసుకోవడం మరియు పాదం మీద బరువు పెట్టకుండా ఉండటం.
- ఫుట్ ఇమ్మోబిలిజర్స్ (పాదాన్నికదలకుండా చేసేవి) లేదా ప్లాస్టర్ (plaster) వాడకం అనేవి కాలి కదలికలను నిరోధించవచ్చు.
నొప్పి మరియు వాపును నియంత్రించడానికి కొన్ని నొప్పి నివారణలు మరియు స్టెరాయిడ్ లేని యాంటి ఇన్ఫ్లమేటరీ మందులు (NSAID,non-steroidal anti-inflammatory drugs) ఉపయోగించవచ్చు. వేగవంతమైన మెరుగుదల కోసం మందులతో పాటు ఫీజియోథెరపీ కూడా అనుసరించవచ్చు.
చీలమండ విరగడం అనేది దీర్ఘకాలిక సమస్య కాదు, ప్రభావితమైన పాదం సంరక్షణ మరియు నిర్వహణ ద్వారా దానిని వేగంగా నయం చేయవచ్చు.