పిల్లలలో జ్వరం వలన మూర్ఛ అంటే ఏమిటి?
జ్వరం వలన మూర్ఛలను ఫైబ్రిల్ సెజెర్స్ అని కూడా పిలుస్తారు, పిల్లలలో అధిక జ్వరంతో పాటు కలిగే మూర్ఛలు (convulsions). సాధారణంగా 6 నెలల నుండి 5 సంవత్సరాల వయస్సు ఉన్న పిల్లలు ఈ మూర్ఛల వలన ప్రభావితం అవుతారు. 12 నుంచి 18 నెలల వయస్సులో ఉన్న పసిపిల్లలో కూడా ఇవి కనిపిస్తాయి.
దాని ప్రధాన సంబంధిత సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
పిల్లల్లో జ్వరం వలన మూర్ఛలతో ముడిపడి ఉన్న సాధారణ లక్షణాలు:
- స్పృహ కోల్పోవడం
- చేతులు మరియు / లేదా కాళ్లను నియంత్రించలేని విధంగా కదిలించడం
అరుదైన లక్షణాలు:
- శ్వాస తీసుకోవడంలో సమస్య
- వంగని లేదా గట్టిబడిన కాళ్లు
- నోరు నుండి నురుగు
- చెయ్యి లేదా కాలు ఎదో ఒకటి లేదా ఒక భాగం మాత్రమే మెలిపడడం
- చర్మం పసుపు రంగు లేదా నీలం రంగులోకి మారడం
- కనుగుడ్లు తిరిగిపోవడం
- మూలగడం
- మూర్ఛ సంభవించిన తర్వాత తిరిగి స్పృహ పొందడానికి బిడ్డకు కనీసం 10 నుంచి 15 నిమిషాలు పట్టవచ్చు. ఈ సమయంలో మండిపడవచ్చు (చిరాకు పడవచ్చు), మరియు సుపరిచితమైన ముఖాలను గుర్తించలేకపోవచ్చు.
దాని ప్రధాన కారణాలు ఏమిటి?
జ్వరం వలన మూర్ఛలు జన్యుపరమైన కారకాలు మరియు పర్యావరణ కారకాలు రెండింటి ద్వారా సంభవించవచ్చు.
సాధారణ కారణాలు వీటిని కలిగి ఉంటాయి:
- ఏ కారణం వలనైనా జ్వరం
- పిల్లలలోని ఏదైనా అనారోగ్యం శరీర ఉష్ణోగ్రతను వేగంగా పెంచినప్పుడు
- ఎగువ శ్వాసకోశంలో వైరల్ సంక్రమణలు
- చెవి సంక్రమణలు
- న్యుమోనియా
- బాక్టీరియల్ డయేరియా/ అతిసారం
- రక్తంలో ఇన్ఫెక్షన్ (సెప్సిస్)
- మెదడు మరియు వెన్ను పూస (spinal cord) తో కలిసి ఉన్న మెదడును కప్పి ఉంచే పొరల (మెనింజెస్, meninges) యొక్క సంక్రమణ, దీనిని మెనింజైటిస్ అని కూడా పిలుస్తారు
దీనిని ఎలా నిర్ధారిస్తారు మరియు చికిత్స ఏమిటి?
జ్వరం యొక్క కారణాన్ని గుర్తించడం అనేది ఈ రుగ్మతను అర్థం చేసుకోవడానికి మరియు చికిత్స చేయడానికి చాలా ముఖ్యమైనది.
ఆరోగ్య చరిత్రలో మూర్ఛ యొక్క కుటుంబ చరిత్ర, ఇటీవలి యాంటిబయోటిక్ల వాడకం, మూర్ఛ యొక్క వ్యవధి, మూర్ఛ తర్వాతి దశ, వ్యాధి నిరోధక స్థితి, మరియు లక్షణాల గురించి తెలుసుకోవడం జరుగుతుంది.
వైద్యులు పిల్లల స్పృహ స్థాయిని విశ్లేషించి, కేంద్ర నాడీ వ్యవస్థ (central nervous system) లో సంక్రమణ యొక్క సంకేతాలు ఉన్నాయా అని కూడా తనిఖీ చేస్తారు.
అవసరమైన పరిశోధనలు వీటిని కలిగి ఉంటాయి:
- నడుముకు సంభందించిన పంక్చర్ (Lumbar Puncture)
- ఎలక్ట్రోఎన్స్ఫలోగ్రఫీ (EEG, Electroencephalography)
- న్యూరోఇమేజింగ్ (CT మరియు MRI స్కాన్లు)
- పూర్తి రక్త గణన (Complete blood count)
పిల్లల్లో జ్వరం వలన మూర్ఛలు యొక్క చికిత్స ఈ విధంగా ఉంటుంది:
- మూర్ఛ కోసం మరియు పిల్లల నిదానపరచడం కోసం మందులు. వాటిని వైద్యులు సూచించినప్పుడు మాత్రమే తీసుకోవాలి.
- జ్వరం వ్యతిరేక ఏజెంట్ల (anti-pyretic agents) యొక్క వాడకం, అయితే మందుల చికిత్సపై ఎక్కువగా ఆధారపడకుండా ఉండటం ఉత్తమం.
రోగుల నిర్వహణ మరియు సంరక్షణ వీటిని కలిగి ఉంటుంది:
- పిల్లలకు అధికంగా దుస్తులు వేయకుండా ఉండడం, ద్రవాలు పుష్కలంగా తీసుకోవడం మరియు చన్నీటి స్నానాలు చేయించకుండా ఉండడం అనేవి పిల్లలో జ్వరం యొక్క నిర్వహణకు మరియు ఉష్ణోగ్రత యొక్క వేగవంతమైన పెరుగుదలను నివారిస్తుంది.
- పిల్లల చుట్టూ ఉన్న ప్రాంతం సురక్షితంగా ఉండాలి. మూర్ఛలు వచ్చిన సమయంలో, పిల్లవాడిని పదునైన వస్తువుల నుండి లేదా పిల్లలకి హాని కలిగించే వస్తువుల నుండి దూరంగా ఉంచాలి. పిల్లల చుట్టూ ఉన్న ప్రమాదం కలిగించే వస్తువులను తీసివేయాలి.
- మూర్ఛల సమయంలో, పిల్లవాడిని ఒక వైపుకు తిప్పాలి.
- ఎల్లప్పుడూ బిడ్డ చుట్టూ ఎవరైనా ఉండడం మంచిది.
- మూర్ఛల తర్వాత పిల్లలను శాంతపరచడం మరియు స్థిమిత పరచడం అనేవి ఉపయోగకరంగా ఉంటాయి.
- మూర్ఛల సమయంలో పిల్లలను పట్టుకోవటానికి కానీ లేదా పిల్లవాని నోటిలో ఏదైనా పెట్టడానికి కానీ ప్రయత్నించకూడదు.