ఎలక్ట్రోలైట్ అసమతుల్యత ఏమిటి?
వివిధ శరీర విధుల యొక్క హోమియోస్టాసిస్ లేదా సంతుల్యతను నిర్వహించడం కోసం ఖనిజాలు లేదా ఎలెక్ట్రోలైట్లు చాలా ముఖ్యం. శరీరంలో ఎలెక్ట్రోలైట్ల స్థాయిలలో అసమతుల్యత నరములు, హార్మోన్లు మరియు శరీర ద్రవాల యొక్క సాధారణ పనితీరుకు ఆటంకం కలిగిస్తుంది. ఎలక్ట్రోలైట్ అసమతుల్యత అనగా సోడియం, క్లోరిన్, మెగ్నీషియం, కాల్షియం మరియు పొటాషియం వంటి ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఎలెక్ట్రోలైట్లు స్థాయిలు పెరగడం లేదా తగ్గడం (లోపం).
దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
శరీరంలోని ఎలెక్ట్రోలైట్స్ స్థాయి పెరుగుదల లేదా తగ్గుదల వల్ల కనిపించే కొన్ని సంకేతాలు మరియు లక్షణాలు:
- డిహైడ్రెషన్ (నిర్జలీకరణము)
- కండరాల తిమ్మిరి మరియు బలహీనత
- తలనొప్పి, మైకము, మరియు మగత
- గందరగోళం
- మూర్చ
- కుంగుబాటు
- రక్తపోటులో మార్పులు
- హృదయ లయలో అంతరాయాలు
- శరీరం అంతటా వాపు
- ఎముకల సమస్యలు
- మూత్ర ఉత్పత్తిలో మార్పులు
ఎలెక్ట్రోలైట్ అసమతుల్యతకు ప్రధాన కారణాలు ఏంటి?
ఎలెక్ట్రోలైట్ అసమతుల్యత యొక్క ప్రధాన కారణాలు:
- అతిసారం, వాంతులు, అధిక చెమటలు, తీవ్ర అంటువ్యాధులు, యాంటీడైయూరిటిక్ హార్మోన్లో (antidiuretic hormone) లోపాలు , మొదలైన వాటి వలన శరీరంలో నుండి నీటిని కోల్పోవడం
- శరీరంలో సోడియం మరియు కాల్షియం స్థాయిలతో ముడిపడి ఉండే ఆల్డోస్టెరోన్ (aldosterone,అడ్రినల్ గ్రంధి ద్వారా స్రవించబడుతుంది) మరియు పారాథైరాయిడ్ హార్మోన్ యొక్క పనితీరులో లోపాలు
- శరీరంలో ఎలెక్ట్రోలైట్స్ యొక్క అసాధారణ నష్టానికి లేదా చేరికకు (పోగు పడడం) దారితీసే మూత్రపిండాల పనితీరులో రుగ్మతలు
- రక్తపోటుకు చికిత్స చేయడానికి ఉపయోగించే మందులు (డైయూరిటిక్స్, diuretics)
- రక్త ప్రసరణ ఆగిపోవడం వలన ఏర్పడే గుండె వైఫల్యం (Congestive heart failure), ఊపిరితిత్తుల లోపాలు మొదలైనవి
ఎలక్ట్రోలైట్ అసమతుల్యత ఎలా నిర్ధారణ చేయబడుతుంది మరియు చికిత్స ఏమిటి ?
వైద్యులు ఆరోగ్య చరిత్ర, భౌతిక పరీక్ష, మరియు రక్త పరీక్షల ఆధారంగా ఎలక్ట్రోలైట్ అసమతుల్యతను నిర్ధారిస్తారు.
- రక్త పరీక్షలు
- రక్తపు pHను, మూత్రపిండాల పనితీరు, మొదలైన వాటిలో ఎలక్ట్రోలైట్ల తగ్గుదల (క్షీణత) లేదా పెరుగుదలను గుర్తించడానికి సీరం సోడియం, పొటాషియం, క్లోరైడ్, కాల్షియం, మొదలైన వాటిని కొలిచే ఒక ప్రాథమిక మెటబోలిక్ ప్యానెల్ (basic metabolic panel) ఉపయోగించబడుతుంది.
- మూత్ర పరీక్ష
- మూత్రంలో ఎలెక్ట్రోలైట్స్ స్థాయిలు కొలిచేందుకు ఉపయోగిస్తారు.
- ఇతర పరీక్షలు - ఈ ఎలక్ట్రోలైట్ అసమతుల్యత యొక్క కారణం పై ఆధారపడి ఉంటాయి.
- సీరం క్రియటినైన్ (Serum creatinine) , బ్లడ్ యూరియా నైట్రోజన్ (blood urea nitrogen)
- పారాథైరాయిడ్ హార్మోన్ స్థాయిలు
- గుండె మరియు ఊపిరితిత్తుల సమస్యలను గుర్తించడానికి ఎలక్ట్రోకార్డియోగ్రామ్, 2 డి ఎకో (2D echo), ఛాతీ ఎక్స్-రే మొదలైనవి
అసమతుల్యతను సరిచేయడానికి ఉపయోగించే చికిత్స పద్ధతులు ఈ క్రింద పేర్కొనబడ్డాయి:
- ఇంట్రావెనస్ సూది మందులు (ఇంజక్షన్) లేదా నోటి ద్వారా తీసుకునే మాత్రలు ద్వారా ఎలెక్ట్రోలైట్ సప్లిమెంట్లను అందించడం
- పొటాషియం వంటి ఎలెక్ట్రోలైట్లు అధికంగా ఉండే తాజా పళ్ళను తినడం
- కండరాలతిమ్మిరి, తలనొప్పి, వికారం, మొదలైన వాటిని నివారించడానికి లక్షణాల ఆధారిత చికిత్స
- శరీరంపై ఎడెమా (ఉబ్బడం) లేదా వాపు ఉంటే నీటిని తీసుకోవడం నిరోధించాలి
- డయ్యూటిక్స్ (diuretics) వంటి మందులు, వాపు తగ్గించేందుకు ఉపయోగిస్తారు
- ఎలెక్ట్రోలైట్ అసమతుల్యతలకు కారణమయ్యే అడ్రినల్ గ్రంథి సంబంధిత రుగ్మతలు కోసం కార్టికోస్టెరాయిడ్స్ (Corticosteroids)