శ్వాస తీసుకోవడంలో కష్టం అంటే ఏమిటి?
ఒక వ్యక్తి తన శరీర అవసరాలకు అవసరమైన ఆక్సిజన్ ను శ్వాస ద్వారా లోనికి తీసుకోవడంలో కష్టపడుతున్నా లేదా అసౌకర్యంగా ఉన్నప్పుడు, అప్పుడు ఆ వ్యక్తి శ్వాస తీసుకోవడంలో కష్టపడుతున్నారు లేదా శ్వాసకొరతను ఎదుర్కొంటున్నారని చెప్పవచ్చు. శ్వాసలో కష్టపడడం అనేది మూసుకుపోయిన ముక్కు (లేదా నాసికాద్వారాలు) వల్ల ఓ తేలికపాటి సమస్య కావచ్చు లేదా న్యుమోనియా వంటి తీవ్రమైన పరిస్థితుల కారణంగా తీవ్రమైన సమస్యగానూ ఉంటుంది .
దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
శ్వాసలో కష్టపడడం ఇబ్బందికి సంబంధించిన సంకేతాలు మరియు లక్షణాలు, ఆందోళన కలిగించేవిగా ఉండవచ్చు:
- వెల్లకిలా పడుకున్నప్పుడు శ్వాస తొందర లేదా 30 నిమిషాల కంటే ఎక్కువ సమయం పాటు ఊపిరాడని పరిస్థితిని కల్గిఉండడం, లేదా ఇన్హేలర్లను (inhalers) ఉపయోగిస్తూ ఉన్నప్పటికీ ముందున్న వ్యాధి లక్షణాల పరిస్థితి మరింత తీవ్రంగా మారిపోవడం.
- మీ శ్వాస పీల్చుకోవడం లేదా వదలడంతో ఊళశబ్దం (శ్వాసలో గురక)
- చలి మరియు దగ్గుతో కూడిన అధిక జ్వరం .
- పెదవులు లేదా చేతివేళ్లు నీలం (నీలం రంగులోకి మారిపోవడం)గా కనబడడం.
- శ్వాసలో గరగరమనే చప్పుడుతో కూడిన అధికస్థాయి శబ్దం, దీన్ని “స్ట్రైడర్” అని కూడా అంటారు.
- స్పృహ తప్పడం
- మీ పాదాలు మరియు చీలమండలంలో వాపు
దీనికి ప్రధాన కారణాలు ఏమిటి?
కింద తెలిపిన కారణాలవల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది:
- ఆందోళన మరియు భయాందోళనలు కలగడం
- శ్వాసనాళం మరియు శ్వాసనాళికయొక్క శాఖలతో సహా వాయుమార్గ వ్యవస్థ యొక్క కొన్ని భాగాలలో సమస్యలు
- అలర్జీలు
- రక్తహీనత
- తక్కువ శరీర దృఢత్వం (ఫిట్నెస్ స్థాయి)
- ఊపిరితిత్తుల పరిస్థితులు న్యుమోనియా, ఆస్తమా , మొదలైనవి.
- వ్యక్తులలో గుండె పోటు, గుండె వైఫల్యం వంటి రుగ్మతలతో ఆక్సిజన్ సరఫరా చేయడానికి తగినంత రక్తం సరఫరా చేయలేకపోవడం.
దీనిని ఎలా నిర్ధారణ చేసేది మరియు దీనికి చికిత్స ఏమిటి?
మొదట్లో, మీ వైద్యుడు ఇతర లక్షణాలతో పాటుగా మీ పరిస్థితి యొక్క వివరణాత్మక వైద్య చరిత్రను అడిగి తెల్సుకుంటాడు. అటుపై ఒక భౌతిక పరీక్ష చేయబడుతుంది. చరిత్ర, వ్యక్తి యొక్క వయస్సు, మరియు పరిశీలనపై ఆధారపడి, వైద్యుడు పరీక్షలను సూచిస్తారు:
- బ్లడ్-ఆక్సిజన్ స్థాయిల తనిఖీకి రక్త పరీక్షలు
- అలెర్జీ పరీక్షలు
- ఛాతీ ఎక్స్-రే
- ఓ గొంతు శ్వాబ్ (throat swab) పరీక్ష (మీ గొంతు వెనుక నుండి ఒక నమూనాని సేకరిస్తారు మరియు అంటువ్యాధుల తనిఖీ కోసం ఆ నమూనాను పరీక్షిస్తారు)
- శరీర ప్లోత్స్మోగ్రఫీ (body plethysmography)
- వ్యాప్తి పరీక్ష (Diffusion test)
- పుపుస (ఊపిరితిత్తులకు సంబంధించిన) పనితీరు పరీక్షలు (Pulmonary function tests).
అంతర్లీన వ్యాధి కారకానికి వెంటనే చికిత్స చేయడం ముఖ్యం. ఇందులో యాంటీబయాటిక్స్, మూత్రకారక మందులు (డ్యూరటిక్స్), మంట, వాపు నివారణా (యాంటీ ఇన్ఫ్లమేటరీ) మందులు, మందు శక్తిని పెంచే మందు (స్టెరాయిడ్స్)లు, మొదలైనవి ఉన్నాయి.
శ్వాసలో కష్టపడడం రుగ్మతకు చేసే చికిత్సలో అదనంగా క్రింద పేర్కొన్న ప్రక్రియలు ఉంటాయి.
- పెదవులు లేదా ముక్కు మూసి శ్వాస పీల్చడం (Pursed-lip breathing)
ఈ పద్ధతిలో, నోరు లేదా ముక్కు ద్వారా శ్వాస పీల్చుకోవడానికి వ్యక్తి ఆదేశించబడతాడు, పెదాల (పెదాలను)ను ఊళ వేస్తున్న రీతిలో (పెదాల్ని మూస్తూ) ఉంచి, ఊపిరితిత్తులలోని గాలిని అంతటినీ బయటకు వదలడాన్ని “పుర్సెడ్ లిప్ బ్రీతింగ్” అంటారు. - స్థాన భంగిమలో
ఈ పద్ధతి సాధారణంగా శ్వాస తగ్గిపోయే సందర్భంలో (shortness of breath) ఉపయోగిస్తారు, కండరాలను సడలించి ఉన్నపుడు శ్వాస తీసుకోవడం సులభం. మెట్లు ఎక్కేటప్పుడు సాధారణంగా శ్వాసించేందుకు ఈ పద్ధతిని ఉపయోగిస్తారు. ఈ పద్ధతిలో, కింది విధంగా జరుగుతుంది:
గోడకు వాలి విశ్రాంతి తీసుకున్న తరువాత, మీరు ముందుకు వంగి మీ చేతులను, మీ ఛాతీని మరియు భుజాల్ని విశ్రాంతి తీసుకోవడానికి సహాయపడే, మీ తొడలమీద అమర్చాలి. ఆ విధంగా , అవి శ్వేఛ్చ పొందినపుడు, మీరు ఊపిరి తీసుకోవడానికి సహాయం లభిస్తుంది. కాబట్టి పుర్సెడ్-లిప్ శ్వాసను ఉపయోగించవచ్చు.
- నెమ్మదిగా లోతైన శ్వాస (Paced Breathing)
మీరు నడిచేటప్పుడు లేదా తక్కువ బరువుగల వస్తువులను ఎత్త వలసి వచ్చినపుడు ఈ శ్వాస పద్ధతి ఉపయోగించబడుతుంది, ఎందుకంటే ఇది శ్వాస అందక పోవడమనే పరిస్థితిని నిరోధిస్తుంది లేదా సమస్య తీవ్రతను తగ్గిస్తుంది. - నడవటం (వాకింగ్) కోసం: వ్యక్తి నిశ్చలంగా నిలబడాలి, లోనికి గాలి పీల్చాలి, తర్వాత కొన్ని అడుగులేసింతర్వాత పీల్చిన గాలిని బయటకు వదలాలి. తర్వాత విశ్రాంతి తీసుకొని మళ్లీ ఇలాగే ప్రారంభించండి.
- వస్తువుల్ని ఎత్తడం (for lifting) కోసం: వ్యక్తి ఏదైనా వస్తువును మోసుకెళ్ళేటప్పుడు, అతడు/ఆమె ఆ వస్తువును తన శరీరానికి దగ్గరగా ఉంచుకుని మోసుకెళ్ళాలి, ఇలా చేయడంవల్ల ఏంతో శక్తి ఆదా అవుతుంది మరియు వ్యక్తి వస్తువును ఎత్తేందుకు ముందు ఒక లోతైన శ్వాస తీసుకుని తర్వాత వస్తువును ఎత్తాలి.
- సున్నితత్వాన్ని తగ్గించడం
- ఈ పద్ధతి మీరు ఆందోళన చెందకుండా శ్వాస తీసుకోవడంలో సహాయపడుతుంది. దీనిలో కింద తెల్పిన ప్రక్రియలున్నాయి:
ఓ స్థానంలో భంగిమ తీసుకోవడం (positioning), పెదవులు లేదా ముక్కు మూసి శ్వాస పీల్చడం (Pursed-lip breathing), మరియు నెమ్మదిగా లోతైన శ్వాస (Paced Breathing)ను క్రమం తప్పకుండా సాధన చేయడం. ఈ శ్వాస వ్యాయామం మీ ఆత్మ విశ్వాసాన్ని పెంచుతుంది. మీ చుట్టూ ఉన్న వారికి (మీ హితులు, సన్నిహితులు కావచ్చు) మీ పరిస్థితి గురించి తెలియజేయాలి.