డెంటిన్ డిస్ప్లేసియా టైప్ II అంటే ఏమిటి?
దంతధాతువు అసహజత లేదా డెంటిన్ అసహజత అనేది జన్యుపరమైన ఓ రుగ్మత, ఇది దంతాల ధాతువు (పండ్లు ఏర్పడడానికి ఉండే మెత్తనిపదార్థము) ను బాధిస్తుంది.
అసహజత లేదా “డైస్ప్లాసియా” అంటే అసాధారణమైన పెరుగుదల, అంటే డెంటిన్ డైస్ప్లాసియా టైప్ II తో బాధపడుతున్న పిల్లలు అసాధారణ దంత ధాతువు (డెంటిన్) నిర్మాణాన్ని కలిగి ఉంటారు. ఈ రుగ్మతలో పాలపండ్లు లేదా ప్రాధమిక పండ్లు (deciduous) సాధారణంగా బాధింపబడుతాయి. పంటి కిరీటంలో దంత ధాతువు (డెంటిన్-పండ్లు ఏర్పడునట్టి మెత్తనిపదార్థము) ప్రధాన భాగంగా ఏర్పడి ఉండటంతో దీన్ని పంటి కిరీట అసహజాత లేదా “కరోనల్ అసహజత” అని కూడా అంటారు. దంతాల డైస్ప్లాసియా రెండో రకం రుగ్మత కేవలం పండ్లను మాత్రమే బాధించే జబ్బు. అంతేకాకుండా, శాశ్వత దంతాలు అరుదుగా లేదా స్వల్పంగా బాధింపబడుతాయి. పురుషులు మరియు మహిళలు ఇద్దరికీ ఈ పంటి జబ్బు సమానంగా సంక్రమిస్తుంది. .
దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
డెంటిన్ డిస్ప్లేసియా రెండో రకం అనేది ప్రాధమిక దంతాల అమరికలో దంతాలు అసాధారణ రూపాన్ని కలిగి ఉంటాయి, ఎక్కువగా సాధారణ దంతమూలాలనే (రూట్ని) కల్గి ఉంటుంది కానీ పంటి కిరీటంలో దంతగోర్ధము తొఱ్ఱలు (pulp chambers) తక్కువైపోయి ఉంటాయి. . ఈ పంటి కిరీటం గుండ్రంగా (bulbous) కనబడుతుంది. దంతాల రంగులో తేడా ఏర్పడడం మరియు దంతగోర్ధము తొఱ్ఱలు (పల్ప్ చాంబర్ను) తగ్గిపోయి ఉండడమనే ఈ రెండూ ఈ దంత రుగ్మత యొక్క కీలక లక్షణాలు. రంగుమారిన దంతాలు సాధారణంగా గోధుమరంగు -నీలం కలిసిన వర్ణం, గోధుమ రంగు లేదా పసుపు రంగులో ఉంటాయి. .
సాధారణంగా శాశ్వత దంతాలు (permanent teeth) చెక్కుచెదరకుండా ఉంటాయి. కానీ శాశ్వత దంతాలకు ఈ రుగ్మత వచ్చినపుడు పంటి యొక్క రంగు, ఆకారం మరియు పరిమాణంలో ఎలాంటి మార్పు లేకుండా సాధారణ రూపంలోనే కనబడుతాయి. డెంటిన్ డైస్ప్లాసియా రెండో రకం యొక్క లక్షణాలు డెంటినోజెనిసిస్ ఇంపర్ఫెక్టా రకాలు I, II మరియు III మరియు ఒకటో రకం డెంటిన్ అసహజతకు సమానంగా ఉంటాయి.
దీనికి ప్రధాన కారణాలు ఏమిటి?
దంతధాతువు అసహజత రెండో రకం వ్యాధి అనేది దంత ధాతువు సియోలోఫాస్ఫాప్రొటీన్ (DSPP) జన్యువులో పరివర్తన వల్ల ఏర్పడే ఒక వంశపారంపర్యంగా వచ్చే వ్యాధి ఆధిపత్య (autosomal dominant) పరిస్థితి. పుట్టే పిల్లలు ఆడా లేక మగా అన్న తేడా లేకుండా 50% కేసులలో ఈ జన్యువుకల్గిన తల్లి నుండి పిల్లలకు బదిలీ చేయబడుతుంది.
డెంటిన్ డిస్ప్లేసియా రెండో రకం వ్యాధిని ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?
డెంటిన్ డిస్ప్లేసియా రెండో రకం వ్యాధిని క్షుణ్ణంగా క్లినికల్ పరీక్ష చేయడం ద్వారా నిర్ధారణ చేస్తారు. మీ దంతవైద్యుడు మీ నుండి వివరణాత్మక చరిత్రను తీసుకొని దానితో మీకున్న వ్యాధి లక్షణాలను పరస్పర సంబందాన్ని పోల్చి పరిశీలిస్తారు. ఈ వ్యాధి నిర్ధారణకు తీసిన X- రే దంతగోర్ధము తొఱ్ఱలు (pulp chambers) లోని రాళ్లను చూపవచ్చు. ఇంకా ఈ X- రే ద్వారా రూపమే మారిపోయి తుడుచుపెట్టుకుపోయిన దంతగోర్ధము తొఱ్ఱ (pulp chamber), అసాధారణంగా రూపుదాల్చిన కిరీట దంతగోర్దనిర్మాణం లేదా దంతగోర్ద తొఱ్ఱ యొక్క గుండ్రని ఆకారపు వైకల్యాలను చూడవచ్చు.
పంటికేర్పడ్డ వైకల్యం యొక్క విస్తృతి మీద ఆధారపడి ఉండే ఈ చికిత్స రోగి రోగికీ మారుతుంది. లోనికి కూరుకుపోయి ఉన్న దంత మూలాలు (resorbed roots) మరియు రూపుమాసిపోయి తుడిచిపెట్టుకు పోయిన దంతగోర్దానికి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ నిర్వహించబడదు. పండ్లను సరిగా అమర్చేందుకు కొన్నిసార్లు, ఆర్థోడాంటిక్ (orthodontic) చికిత్స అవసరం కావచ్చు. ఇతర ఎంపిక ఏదంటే అన్ని దంతాలను పీకేసి వాటి స్థానంలో కట్టుడు పళ్ళు లేదా కృత్రిమ పండ్లు ఇంప్లాంట్ ప్రొస్థెసిస్లతో (implant prosthesis) భర్తీ చేయడం. చికిత్స యొక్క వ్యవధి దంతాల లోపం యొక్క పరిమాణంపై ఆధారపడి మారుతూ ఉంటుంది.
(మరింత చదువు: దంత క్షయ చికిత్స )