క్యాంఫైలోబెక్టర్ సంక్రమణం (ఇన్ఫెక్షన్) అంటే ఏమిటి?
క్యాంఫైలోబెక్టర్ సంక్రమణ అనేది ఒక రకమైన ఫుడ్ పోయిజనింగ్ (ఆహరం విషతుల్యమవ్వడం) . ఇది సాధారణంగా స్వల్పమైనదే, కానీ శిశువులు, వృద్ధులు, మరియు రోగనిరోధక శక్తి బలహీనంగా ఉన్న వ్యక్తులలో మరణానికి దారితీయవచ్చు. ఏ వయస్సులో వారికైనా ఈ సంక్రమణ సంభవిచవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఈ సంక్రమణ యొక్క సంభావ్యత మరియు ప్రాబల్యం గత దశాబ్ద కాలంలో బాగా పెరిగింది. అయితే, ఈ జీర్ణశయ వ్యాధి భారతదేశంలో తక్కువగా పరిశోధించబడింది.
దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
బాక్టీరియా శరీరంలోకి ప్రవేశించిన 2-4 రోజులలో కనిపించే సాధారణ లక్షణాలు:
- తిమ్మిరితో కూడిన కడుపు నొప్పి
- జ్వరం
- వికారం మరియు వాంతులు
- నీళ్ల విరేచనాలు, అరుదుగా రక్తస్రావం కూడా ఉంటుంది
కొందరు వ్యక్తులలో ఏ లక్షణాలను కనిపించకపోవచ్చు. సమస్యలలో బాక్టీరామియా (రక్తంలో బాక్టీరియా యొక్క ఉండడం), కాలేయపు వాపు, మరియు క్లోమం (pancreas) యొక్క వాపు వంటివి ఉంటాయి.
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
సాధారణంగా , ఈ సంక్రమణ కంఫైలోబెక్టర్ జాతుల (Campylobacter species) వలన సంభవిస్తుంది. ఈ జీవుల మృదువైన ప్రేగు గోడల మీద దాడి చేస్తాయి. బ్యాక్టీరియా అప్పుడు ఇతర శరీర వ్యవస్థలకువ్యాపించి దాడి చేయవచ్చు. సంక్రమణ యొక్క కారణాలు వండని మాంసం లేదా పౌల్ట్రీ, కలుషితమైన ఆహార పదార్థాలు, నీరు,శుద్ధి చెయ్యని పాల వినియోగం, మరియు వ్యాధి సోకిన జంతువులను తాకడం వంటివి. జీర్ణాశయ సంక్రమణం లేదా ప్రయాణం చేసే వారిలో అతిసారం యొక్క కారణాలలో ఇది ఒకటి.
ఎలా నిర్ధరించాలి మరియు చికిత్స ఏమిటి?
ఆరోగ్య సంరక్షకులు (వైద్యులు) ఈ క్రింది పరీక్షలను ఆదేశించవచ్చు:
- సంపూర్ణ రక్త గణన (Complete blood count, CBC).
- తెల్ల రక్త కణాల (WBCలు) ఉనికిని మల పరిశీలన (Stool sample for the presence of white blood cells).
- కాంపిలోబాక్టర్ జాతుల కోసం మల నమూనాల సాగు.
చాలా వరకు, సంక్రమణ దానికాదే నయమవుతుంది, కానీ కొంతమంది ప్రభావిత వ్యక్తులకు మందులు అవసరం కావచ్చు. చికిత్స యొక్క ప్రధాన లక్ష్యం డీహైడ్రేషన్ ను నివారించడం మరియు ఆరోగ్యాన్ని మెరుగుపరచడం. వ్యక్తి కనుక చాలా అనారోగ్యంగా ఉంటే యాంటిబయోటిక్ చికిత్స సూచించవచ్చు. మందులు అవసరం కన్నా స్వీయ సంరక్షణ అనేది ఎక్కువ అవసరం. గాయపడిన / శస్త్రచికిత్స నిర్వహించిన రోగులకు సూక్ష్మజీవ వ్యతిరేక మందులు (Anti-microbial drugs) ఇవ్వవచ్చు.
స్వీయ సంరక్షణ చిట్కాలు:
- రోజూ 8-10 గ్లాసుల నీరు తీసుకోవాలి.
- నీళ్ల విరేచనాలు అయ్యిన ప్రతిసారి కనీసం ఒక కప్పు ద్రవ పదార్దాలు తీసుకోవాలి.
- తాజాగా మరియు సరిగ్గా వండిన ఆహారం మరియు వేడి ఆహారాన్నితీసుకోవాలి, అది బ్యాక్టీరియాను చంపుతుంది.
- బహిరంగ స్థలాలు లేదా ప్రవాహాలలోని నీరు త్రాగకూడదు.
- ఏదైనా తినే ముందు చేతులను కడగాలి.
సంక్రమణ సాధారణంగా స్వల్పంగా ఉంటుంది, కానీ చికిత్స చేయకపోతే, ఇది తీవ్రమైన పరిణామాలను కలిగిస్తుంది. క్యాంఫైలోబెక్టర్ సంక్రమణలను సరైన సంరక్షణ మరియు సరైన పరిశుభ్రతను అనుసరించి చికిత్స చేయవచ్చు.