కోస్టోకొండ్రైటిస్ అంటే ఏమిటి?
రొమ్ము ఎముకలతో కలిసి ఉండే కార్టిలేజ్ (cartilage) యొక్క వాపును కోస్టోకొండ్రైటిస్ అని అంటారు. ఆఖరి రెండు పక్కటెముకలు (ribs) తప్ప, అన్ని పక్కటెముకలు రొమ్ము ఎముకల కార్టిలేజ్కు అతుక్కుని ఉంటాయి. ఈ వాపు ఛాతీ నొప్పికి కారణమవుతుంది, ఇది కోస్టోకొండ్రైటిస్ యొక్క సాధారణ లక్షణం.
కోస్టోకొండ్రైటిస్ ను ఈ క్రింది విధంగా కూడా పిలుస్తారు:
- కాస్టో-స్టెర్నల్ సిండ్రోమ్ (Costo-sternal Syndrome)
- పరాస్టర్నల్ కొండ్రోడినియా (Parasternal Chondrodynia)
- అంటిరియర్ చెస్ట్ వాల్ సిండ్రోమ్ (Anterior Chest Wall Syndrome)
దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
కోస్టోకొండ్రైటిస్ యొక్క ముఖ్యమైన సంకేతాలు మరియు లక్షణాలు బాధ కలిగించే ఈ క్రింది లక్షణాలతో ఉంటాయి:
- నొప్పి తరచూ రొమ్ముఎముక ఎడమ వైపున సంభవిస్తుంది
- నొప్పి పదునుగా మరియు పోటుగా అనుభవించబడుతుంది
- రోగి ఒత్తిడి వంటి నొప్పి అనుభూతిని అనుభవిస్తారు
- గాఢ శ్వాస, దగ్గు, శ్రమ మరియు పై శరీర కదలిక నొప్పిని మరింత తీవ్రతరం చేస్తాయి
- ఒకటి కంటే ఎక్కువ పక్కటెముకలు ప్రభావితమవుతాయి
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
ఛాతీ యొక్క ముందు భాగం నొప్పి అనేది కోస్టోకొండ్రైటిస్ యొక్క అత్యంత సాధారణ కారణం. దీనికి ఒక నిర్దిష్ట అంతర్లీన కారణం లేదు. రొమ్ముఎముకుల కార్టిలేజ్ తో సంబంధం ఉన్న పక్కటెముకల వాపు కోస్టోకొండ్రైటిస్ కు దారితీస్తుంది.
సాధారణ కారణాలు:
- ఛాతీకి గాయం లేదా దెబ్బ
- అధిక వ్యాయామం లేదా దీర్ఘకాలిక తీవ్ర దగ్గు
- ఆర్థరైటిస్ సంబంధిత వాపు (మరింత సమాచారం: ఆర్థరైటిస్ చికిత్స)
- పక్కటెముకను ప్రభావితం చేసే కొన్ని సంక్రమణలు (ఇన్ఫెక్షన్స్) ఉదాహరణకు, క్షయవ్యాధి మరియు సిఫిలిస్
- ఛాతీ ప్రాంతానికి వ్యాపించిన ఊపిరితిత్తుల, రొమ్ము, లేదా థైరాయిడ్ క్యాన్సర్
కోస్టోకొండ్రైటిస్ అనేది టిటిజ్స్ సిండ్రోమ్ (Tietze’s syndrome) తో ముడి పడి ఉంటుంది, ఇది ఒకే స్థానంలో నొప్పితో కూడిన వాపును కలిగిస్తుంది.
40 ఏళ్ల వయసు పైబడిన వారిలో కోస్టోకొండ్రైటిస్ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఇది పురుషులు కంటే మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది.
ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?
కోస్టోకొండ్రైటిస్ వ్యాధి నిర్ధారణ ఆరోగ్య చరిత్ర మరియు పక్కటెముక ప్రాంతం యొక్క భౌతిక పరీక్ష ఆధారంగా ఉంటుంది. వైద్యులు రోగిని వారి యొక్క తీవ్రమైన దగ్గు లేదా అధిక వ్యాయామం గురించి అడుగుతారు. ఛాతీ యొక్క ముందు భాగం యొక్క ఎక్స్-రే అనేది అంతర్లీన కారణాన్ని గుర్తించడానికి అవసరం కావచ్చు.
- ఛాతీ ప్రాంతంలో ఉమ్మిడిలో (joints) మరియు భుజం ఉమ్మిడిలో ఆర్థరైటిస్
- సంక్రమణలు లేదా కణుతుల వలన కార్టిలేజ్ నష్టం
- ఫైబ్రోమైయాల్జియా (Fibromyalgia)
- ఛాతీలో హెర్పెస్ జోస్టర్ (Herpes zoster)
కోస్టోకొండ్రైటిస్ యొక్క చికిత్స వీటిని కలిగి ఉంటుంది:
- నొప్పినివారుణులు మరియు వాపు వ్యతిరేక మందులు
- తీవ్రమైన సందర్భాలలో అవసరమైతే స్థానిక మత్తు లేదా స్టెరాయిడ్ సూది మందులు
- డాక్టర్ సూచించిన విధంగా జెంటిల్ సాగతీత వ్యాయామాలు
స్వీయ సంరక్షణ
- వేడి నీళ్ల లేదా చన్నీళ్ల కాపడం
- తీవ్రమైన శారీరక శ్రమ లేదా ఒత్తిడిని నివారించాలి
(మరింత సమాచారం: వాపు వ్యాధి చికిత్స)