క్లోస్ట్రిడియమ్ డిఫిసైల్ కొలైటిస్ అంటే ఏమిటి?
క్లోస్ట్రిడియమ్ డిఫిసిల్ కొలైటిస్ అనేది పెద్ద పేగుకు వచ్చే వాపు, మంటతో కూడిన వ్యాధి. పెద్దపేగులకొచ్చే సంక్రమణమిది. వాపు, మంట తో బాబు ఇతర లక్షణాలు కూడా ఉంటాయి. క్లోస్ట్రిడియమ్ డిఫిసిల్ కొలైటిస్ అనేది సాధారణమైన ఇన్ఫెక్షన్ కాదు, కాబట్టి ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకోవాల్సిన వ్యాధి ఇది. క్లోస్ట్రిడియమ్ డిఫిసైల్ (C. డిఫిసిల్) అనేది ఒక విషక్రిమి (బాక్టీరియం). ఈ విషక్రిమి సాధారణంగా మట్టి, గాలి, నీరు మరియు మలం లో కూడా కనిపిస్తుంది.
దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
- క్లోస్ట్రిడియమ్ డిఫిసైల్ (C. డిఫిసిల్) విషక్రిమి (bacterium) పెద్దప్రేగును బాధించినపుడు పెద్దప్రేగు గోడలు వాపును, మంటను కల్గిస్తుంది, తద్వారా ఇది జ్వరానికి దారితీస్తుంది .
- లక్షణాల్లో ఉదర నొప్పి లేదా తిమ్మిరి కూడా ఉన్నాయి .
- ఈ వ్యాధి ఇతర లక్షణాల్లో అతిసారం ఒకటి, అంటే ఒక రోజులో పలుసార్లయ్యే నీళ్ల భేదులు. భేదుల్ల్లో రక్తం పడడం సాధారణం.
- భేదుల కారణంగా శరీరంలో నిర్జలీకరణం (డీహైడ్రేషన్) ఏర్పడి, తద్వారా, ఒంట్లో ఖనిజాల అసమతుల్యతకు దారి తీస్తుంది.
- తీవ్రమైన సందర్భాల్లో, పెద్దప్రేగులు పగిలి, సంక్రమణ శరీరం ఇతర భాగాలకు వ్యాపిస్తే, ఇది ప్రాణాంతకమవుతుంది.
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
- క్లోస్ట్రిడియం డిఫిసిలే కొలైటిస్ యొక్క సాధారణ కారణం చికిత్సలో భాగంగా యాంటీబయాటిక్స్ ను ఇటీవల తీసుకోవడం. ఒక వ్యక్తి యాంటీబయాటిక్స్ ను సేవిస్తే పెద్దప్రేగులో బాక్టీరియా యొక్క సంతులనం చెదిరిపోతుంది, ఇది క్లోస్ట్రిడియమ్ డిఫిసైల్ క్రిముల సంఖ్యలో పెరుగుదలకు దారితీస్తుంది .
- అమోక్సిలిలిన్, సెఫాలోస్పోరిన్స్, పెన్సిలిన్ మరియు ఎరిత్రోమైసిన్ అనే యాంటీ బయోటిక్స్ సేవిస్తే పెద్దపేగుల గోడల వాపును, మంటను కలుగజేస్తాయి.
- బాక్టీరియా ఉన్న ప్రతి వ్యక్తికి పెద్దప్రేగు శోథము అభివృద్ధి చెందుతుందని కాదు, బ్యాక్టీరియా ఇప్పటికే ప్రేగులలో ఉండొచ్చు మరియు ఎటువంటి వ్యాధి లక్షణాలను కలుగజేయక పోవచ్చు. కేవలం ఆ బాక్టీరియా జీవులు కొందరిలో ఉంటాయంతే.
- ఈ వ్యాధి ఆసుపత్రిలో పొందిన సంక్రమణ కావచ్చు.
దీనిని ఎలా నిర్ధారణ చేసేది మరియు దీనికి చికిత్స ఏమిటి?
రోగ నిర్ధారణ చేయడానికి, వైద్యుడు ఇటీవల కాలంలో రోగి తీసుకున్న మందులు సహా ఒక సంపూర్ణ చరిత్రను పొందుతాడు.
- అటువంటి అంటురోగాలలో తెల్లరక్త కణాల (వైట్ సెల్) గణన పెరుగుతుంది మరియు రక్త పరీక్షలలో ఇది ప్రతిబింబిస్తుంది.
- క్లోస్ట్రిడియమ్ డిఫిసైల్ ఉత్పత్తి చేసిన విషాన్ని గుర్తించే ప్రత్యేకమైన మల పరీక్షలు ఉన్నాయి, దీనిద్వారా రోగ నిర్ధారణ అవుతుంది.
- కోలొనోస్కోపీ మరియు సిగ్మోయిడోస్కోపీ అనేవి వైద్యుడు పెద్దప్రేగు యొక్క స్థితిని పరిశీలించే పరీక్షలు.
సంక్రమణకు కారణమయ్యే యాంటీబయాటిక్స్ను ఆపేయడం ప్రాధమిక చికిత్స. మెట్రానిడాజోల్ వంటి యాంటీబయాటిక్స్ క్లోస్ట్రిడియమ్ డిఫిసైల్ ఇన్ఫెక్షన్కు వ్యతిరేకంగా పనిచేస్తాయి .
-
నిర్జలీకరణము మరియు ఎలెక్ట్రోలైట్ అసమతుల్యతను సరిచేయటానికి, ద్రవాలు ఇవ్వబడతాయి.
బాక్టీరియా యొక్క అసంపూర్ణ తొలగింపు వలన ఒక వ్యాధి తిరిగి సంభవిస్తే, యాంటీబయాటిక్స్ యొక్క బలమైన మోతాదు ఇవ్వబడుతుంది లేదా వేర్వేరు మందులు సూచించబడతాయి. క్లోస్ట్రిడియమ్ డిఫిసైల్ విషక్రిమిని శరీరం నుండి పూర్తిగా తొలగించే యాంటీబయాటిక్స్ గుర్తించి, సేవించడం చాలా ముఖ్యం.