పిల్లల్లో విషపడిశం (influenza) అంటే ఏమిటి?
విషపడిశం (influenza) లేక లేదా ఫ్లూ అనేది శ్వాసకోశ సంక్రమణం. ఇది వ్యక్తి నుండి వ్యక్తికి సులభంగా వ్యాపించే అంటువ్యాధి. దీన్నే శీతలజ్వరం అని కూడా అంటారు. ఈ విషపడిశం వ్యాధిని పిల్లలలో వచ్చే సాధారణ జలుబు లేదా కడుపు లోపాలతో సహా ఇతర వ్యాధులలో ఎదో ఒకటిలే అని పొరబాటు పడవచ్చు. విషపడిశం (ఇన్ఫ్లుఎంజా) వ్యాధి లక్షణాలు చాలా తీవ్రంగా వుండటంతోను మరియు ఈ అంటువ్యాధి చాలా వేగంగా వ్యాపిస్తుండటం వలన తక్షణ వైద్య సంరక్షణ చాలా ముఖ్యం.
దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
మీరు గనుక కింది లక్షణాల్ని గమనించినట్లయితే మీ పిల్లలకి విషపడిశం లేక ఫ్లూ కలిగి ఉండవచ్చు అని అంచనా వేయొచ్చు.
- జ్వలించే జ్వరం - 102oF కంటే ఎక్కువ మరియు 104oF ను తాకడం
- జ్వరముతో పాటుగా వణుకు మరియు చలి
- అలసట మరియు బద్ధకం
- గొంతు నొప్పి (గొంతు రాచుకుపోవడం) మరియు దగ్గు
- ఒంటినొప్పులు, కడుపు నొప్పి మరియు వికారం
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
విషపడిశం (ఇన్ఫ్లుఎంజా) వ్యాధి “ఇన్ఫ్లుఎంజా వైరస్” వలన కలుగుతుంది. విషపడిశం వైరస్ యొక్క మూడు రకాల ఇన్ఫ్లుఎంజా వైరసుల్లో A మరియు B రకాలు వార్షిక వ్యాధి వ్యాప్తికి కారణమవుతాయి మరియు C రకం వైరస్ క్రమరహిత (రాండమ్), ఏకాంత అనారోగ్యాన్ని కలిగిస్తుంది. ఈ సూక్ష్మజీవి (వైరస్)తో కూడిన శ్లేష్మం లేదా లాలాజలం ద్వారా విషపడిశం వ్యాప్తి చెందుతుంది. ఈవైరస్ సోకిన లేదా వైరస్కి గురైన ఇతరులతో పిల్లలు అంటుకోవడం, ముట్టుకోవడం వంటివి జరిగినప్పుడు ఈ వైరస్ వారికీ వ్యాపిస్తుంది. వ్యాధి సోకినవారికి దగ్గరగా ఉండటం వలన వారు ముక్కు చీడినపుడు తుమ్ములు తుమ్మినప్పుడు కూడా విషపడిశం వైరస్ వ్యాప్తి చెందుతుంది.
విషపడిశం ఎలా నిర్ధారణ చేయబడుతుంది మరియు దీనికి చికిత్స ఏమిటి?
విషపడిశం (ఇన్ఫ్లుఎంజా) రోగ నిర్ధారణ చాలా సులభం, ముఖ్యంగా పిల్లలలో. మరియు చాలామంది వైద్యులు పిల్లల్ని సాధారణ పరీక్షతో పరిస్థితిని ఖచ్చితంగా నిర్ధారించడం జరుగుతుంది. విషపడిశాన్నిఇతర వాహాది పరిస్థితులనుకుని పొరబడే అవకాశమున్నందున, ముక్కునుండి తీసుకున్న శ్లేష్మం యొక్క చిన్న పరిమాణాన్ని ప్రయోగశాల పరీక్షకుకు పంపబడుతుంది.
పిల్లల్లో వచ్చే విషపడిశం (ఫ్లూ) చికిత్స చేయడానికి, డాక్టర్లు మామూలుగా ఈ క్రింది మందులు, జాగ్రతల్ని సూచిస్తారు:
- జ్వరం మరియు నొప్పుల కోసం మందులు
- కడుపు సమస్యల్ని పరిష్కరించడానికి మందులు
- ఆస్త్మా వంటి సంబంధిత పరిస్థితులకు మందులు
- పుష్కలంగా విశ్రాంతి
- పుష్కలంగా ద్రవాలు తాగడం
- మూసుకుపోయిన శ్వాసనాళాలకు , పడిశంతో కారే ముక్కుకు లేదా దగ్గుకు మందులు
- విషపడిశం పునరావృతాలను నివారించడానికి ఫ్లూ టీకా మందులు
- ఇంట్లో పరిరక్షణలు (హోమ్ కేర్) (సెలైన్ నాసల్ డ్రాప్స్, హుమీడైఫైర్)
- దగ్గినప్పుడు లేదా తుమ్ములు వచ్చినపుడు పిల్లల తమ ముక్కు మరియు నోటిని మూతిపై కప్పి ఉంచిన ప్రతిసారి చేతులను వెంటనే కడుక్కోవడం వంటి నివారణ చర్యలు ; దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు ముక్కు మరియు నోటిని ఒక మందంపాటి రుమాలును పెట్టుకోవడం; ఆహారాన్ని ముట్టుకునే ముందుగా మొదట చేతులు కడుక్కోవాదం (పిల్లలు చేతులు కడుక్కోకుండా ఆహారాన్నితాకడాన్ని నివారించడం)
విషపడిశం (ఫ్లూ) యొక్క పునరాగమనాలు (relapses) సాధారణం. కాబట్టి, విషపడిశం వచ్చిన తర్వాత, పిల్లవాడిని పాఠశాలకు పంపేందుకు ముందు, కనీసం 24 గంటల పాటు గమనించాలని వైద్యులు సిఫార్సు చేస్తారు.