రొమ్ములో పాలు అధికంగా చేరడం అంటే ఏమిటి?
పాలిండ్లు గట్టిపడే సమస్యలతోను, చనుమొనలు చిట్లడం వంటి సమస్యలతోను చిన్నబిడ్డల తల్లులు ప్రసవానంతరం బాధపడుతుంటారు. అప్పుడే శిశువుకు జన్మనిచ్చిన మహిళకు ప్రారంభదినాల్లో పాలిండ్లు గట్టిపడే సమస్య తరచుగా బాధాకరంగాను, ఒత్తిడిలోనూ కూడుకుని ఉంటుంది. అధికమైన పాలు, రక్తం, ద్రవంతోను నిండి ఉండడం మూలంగా బాలింతల పాలిండ్లు వాపుకు గురవుతాయి. చనుమొనలు చదునుగా కనిపిస్తాయి.
దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
రొమ్ముల్లో పాలు అధికంగా చేరడానికి సంబంధించిన సాధారణ లక్షణాలు
- వాపు, గట్టిబారినతనం, మరియు నొప్పితో కూడిన రొమ్ములు
- చనుమొనలు చదును మరియు గట్టిగా కనిపిస్తాయి
- చనుమొన చుట్టూ ప్రాంతం చాలా గట్టిపడి పోతుంటుంది, దీనివల్ల మీ శిశువు స్తనానికి కరుచుకుని పాలు తాగడం కష్టతరం అవుతుంది.
- తేలికపాటి జ్వరం
- మీ చంకల కింది శోషరసగ్రంధుల్లో కొంచెం వాపు మరియు సున్నితత్వం ఏర్పడి బాధిస్తుంది.
తీవ్రమైన (వైద్య కేసుల్లో) సందర్భాల్లో అసాధారణ లక్షణాలు ఉంటాయి
- రొమ్ములు వాపుదేలి, గట్టిపడి , మెరిసేతత్త్వం, మరియు వెచ్చదనంతో కూడుకుని ఉంటాయి. (మరింత సమాచారం: రొమ్ము గడ్డలూ కారణాలు)
- సలుపు వంటి నొప్పి
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
ప్రసవానంతరం మొదటి కొన్ని రోజులలో రొమ్ము గట్టిపడడమనే సమస్య సాధారణంగా వస్తుంటుంది. ఇది శిశువుకు అవసరమైన పాలను సర్దుబాటు చేయడానికి శరీరంలో కలిగే యంత్రాంగం.
దీనికి ఇతర కారణాలూ ఉన్నాయి
- సరికాని మరియు చాలీ చాలకుండా చనుబాలివ్వడం
- రొమ్ము శస్త్రచికిత్స చరిత్రను కల్గి ఉండడం
దీనిని ఎలా నిర్ధారించేది మరియు దీనికి చికిత్స ఏమిటి?
పాలిండ్లు గట్టిపడడమనే సమస్య యొక్క లక్షణాలు ఈ సమస్యను నిర్ధారించడంలో సహాయపడతాయి. ఈ బాధాకర పరిస్థితికి చికిత్సనివ్వడంలో బిడ్డకు పాలివ్వడానికి తల్లి అనుసరించే పద్ధతి కూడా చాలా అవసరం. దీన్ని కిందివాటి నుండి వేరుగా పరిగణించాలి:
- హార్మోన్ల రుగ్మతలు రొమ్ములు గట్టిపడడానికి కారణమవుతాయి
- స్తనవాపు (మాస్టిటిస్)
- ద్వంద్వ, ఘనమైన, అతి కోమలత్వం సంతరించుకున్న రొమ్ముల యొక్క నిరపాయమైన విస్తరణ.
మీ బిడ్డకు సరిగా పాలు పట్టే విధానం తదితర సరైన మార్గదర్శకాలను వైద్యుడిచే పొందడం మీకు చాలా అవసరం. ఇది ఈ సమస్యను నయం చేసే చిటిత్సలో కూడా తోడ్పడుతుంది. నొప్పి మరియు వాపు నుంచి ఉపశమనం పొందేందుకు నొప్పి నివారిణులు (అనాల్జెసిక్స్) అవసరమవుతాయి. పాలిండ్లు గట్టిపడే సమస్య నుండి ఉపశమనం పొందేందుకు ప్రత్యేక హార్మోన్ల లోపాలను తగ్గించడానికి తగిన వైద్య చికిత్స అవసరం.
స్వీయ రక్షణ కింది దశలను కలిగి ఉంటుంది:
- చల్లని సంపీడనం యొక్క వాడకం, నొప్పి మరియు వాపును తగ్గించడానికి మంచు అద్దకం.
- బిడ్డకు పాలిచ్చెనందుకు అనువుగా ఉండే సౌకర్యవంతమైన మరియు వదులుగా ఉండే “నర్సింగ్ బ్రాలు” ధరించాలి.
- శిశువుకు పాలిచ్చేటపుడు చనుమొనకు ఎగువన, దిగువన కూడా శిశువు మూతిని ఆడించుకుంటూ పాలివ్వడమనే ప్రక్రియ బాలింతల్లో రొమ్ములు గట్టిపడే సమస్యలో ఉండే ఒత్తిడి, బాధను తగ్గిస్తుంది
- బిడ్డకు పాలిచ్చింతర్వాత, “హ్యాండ్ ఎక్స్ప్రెస్” పద్ధతిలో చేతులతో పాలిండ్లను తడిమి అధిక పాలను తీసివేయడం కూడా సమస్య నుండి ఉపశమనం కల్గిస్తుంది. . తీవ్రమైన సందర్భాల్లో, రొమ్ము పంపును కూడా మీరు ఉపయోగించవచ్చు