బీజెల్ రోగం అంటే ఏమిటి?
బీజెల్ అనేది ఓ అంటువ్యాధి. ట్రెపోనెమా బ్యాక్టీరియా కారణంగా సంక్రమించే వ్యాధి ఇది. బీజెల్ రోగం ఓ కొరుకుడు వ్యాధి. ఇది సిఫిలిస్ బ్యాక్టీరియాతో దగ్గరి సంబంధాన్ని కలిగి ఉంటుంది మరియు ఈ వ్యాధి పరిస్థితిని “స్థానిక సిఫిలిస్ వ్యాధి” (endemic syphilis) అని కూడా పిలుస్తారు. ఇది ఆసియా మరియు ఆఫ్రికా దేశాల్లో సర్వసాధారణంగా కనిపించే రోగం. అమెరికాలో ఈ రోగం అరుదైనది. ఇది పెద్దల కంటే పిల్లలకే ఎక్కువగా దాపురిస్తుంది.
సిఫిలిస్ మాదిరిగా కాకుండా, ఇది లైంగికంగా ఒకరి నుండి మరొకరికి సోకదు. కానీ ప్రత్యక్ష పరిచయం ద్వారా లేదా ఒకరి వస్తువులు మరొకరు వాడడంవల్ల ఒకరి నుండి మరొకరికి వ్యాపిస్తుంది.
బీజెల్ రోగం సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
- నోటిలో చిన్న చిన్న మచ్చలు మరియు బొబ్బలు రూపంలో ఈ వ్యాధి మొదలవుతుంది.
- బొబ్బలు క్రమంగా చేతులు మరియు కాళ్ళకు వ్యాపిస్తాయి.
- కాళ్ళు-చేతుల ఎముకలు నొప్పి పెట్టడం మొదలవుతుంది. తీవ్రమైన కేసులలో వికటించి అంగవైకల్యాన్ని కల్గించగలదు.
- ఎముకల్లో మరియు నోటిలో మెత్తని గడ్డలు లేక గ్రంథులు, ప్రత్యేకించి అంగిలి లో ఏర్పడతాయి. గమ్మాస్ (gummas) గా పిలువబడే ఈ గడ్డలు లేక గ్రంథులు, ఎముకల్ని నాశనం చేసి, వికారంగా మారుస్తాయి.
- శోషరస కణుపుల (lymph nodes) వాపు కూడా చూడవచ్చు.
బీజెల్ రోగం ప్రధాన కారణాలు ఏమిటి?
- ట్రెపోనెమా అని పిలువబడే ఒక బాక్టీరియా వల్ల బీజెల్ వ్యాధి దాపురిస్తుంది. ఈ సూక్ష్మజీవి బ్యాక్టీరియా యొక్క ఒకే కుటుంబానికి చెందినది, ఇది సిఫిలిస్, ట్రెపోనెమ పల్లిడం.
- ఇది లైంగిక సంబంధం లేకుండా ఒకరి నుండి మరొకరికి అంటురోగంగా వ్యాప్తి చెందుతుంది. మరియు శుష్క, అనారోగ్యకరమైన పరిస్థితులలో నివసించే పిల్లలలో సాధారణంగా కన్పిస్తుంది ఈ రోగం.
బీజెల్ రోగం నిర్ధారణను ఎలా చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?
బీజెల్ రోగాన్ని రోగి చరిత్ర మరియు సూక్ష్మదర్శిని పరీక్షల కలయికతో నిర్ధారణ అవుతుంది.
- బీజెల్ రోగ నిర్ధారణకు ఒక వ్యక్తి యొక్క భౌగోళిక చరిత్ర చాలా ముఖ్యం. ఆసియా, ఆఫ్రికా మరియు మధ్యధరా ప్రాంతాలు ఈ సంక్రమణంతో బాధపడుతున్న రోగులను ఎక్కువగా కలిగి ఉంటాయి.
- గాయాల్నిఓ ప్రత్యేక “డార్క్ ఫీల్డ్ సూక్ష్మదర్శిని” కింద ఈ రోగకారక బ్యాక్టీరియా కోసం పరీక్షించబడతాయి.
- రోగపీడితుడైన శిశువు కుటుంబ చరిత్ర మరియు ఒక ఆ శిశువు జీవనశైలి గురించిన వివరణాత్మక జ్ఞానం రోగ నిర్ధారణకు తోడ్పడుతుంది.
- సిఫిలిస్ వ్యాధి-బీజెల్ రోగాల మధ్య వ్యత్యాసాన్ని కనుగొనేందుకు రోగి పూర్తి చరిత్ర మరియు చికిత్సా పరీక్షలు అవసరమవుతాయి. ఎందుకంటే మైక్రోస్కోప్ కింద ఈ రెండు రోగాలకు చెందిన బాక్టీరియాలు దాదాపు ఒకేలా కనిపిస్తాయి.
చికిత్సలో అంటువ్యాధిని నియంత్రించడానికి యాంటీబయాటిక్స్ ఉంటాయి.
- ప్రామాణికమైన మందు పెన్సిల్లిన్ G ని, ఇంట్రాముస్కులర్గా ఇంజక్షన్ వేస్తారు.
- పెన్సిలిన్కు అలెర్జీ ఉన్న రోగులలో, డాక్సీసైక్లిన్ లేదా అజిత్రోమిసిన్ వంటి ఇతర యాంటీబయాటిక్స్ ఇవ్వవచ్చు. అయితే, అన్ని మందులు వైద్యుడు సూచించినవి మాత్రమే ఇవ్వాలి, ప్రత్యేకించి గర్భిణీ స్త్రీలకు.
- పూర్తిగా సంక్రమణను తొలగించడానికి కుటుంబంలోని అందరి పిల్లలను చికిత్స చేయటం చాలా ముఖ్యం.