యాంజియోగ్రఫీ అంటే ఏమిటి?
యాంజియోగ్రఫీ అనేది ఒక రకమైన ఎక్స్-రే సాంకేతికత, ఇది ఒక రంగు పదార్దాన్ని ఉపయోగించుకుంటుంది, గుండెకు రక్తాన్నితీసుకువెళ్లే రక్తనాళాలకి ఈ రంగు పదార్దాలని ఎక్కిస్తారు. రక్తనాళాలు ఒక సాధారణ ఎక్స్-రేలో కనిపించవు కాబట్టి, ప్రత్యేకమైన రంగు పదార్థం రక్తనాళాలలోకి వెళ్ళి గుండెలో రక్త ప్రసరణను మరియు ధమనులలో (arteries) ఎలాంటి అడ్డంకులైనా ఉన్నాయని తనిఖీ చేస్తుంది. యాంజియోగ్రఫీ సమయంలో రంగు కదలికను రికార్డ్ చేయ్యడాన్ని యాంజియోగ్రామ్ అని పిలుస్తారు మరియు దీనిని ఒక టెలివిజన్ మానిటర్లో చూడవచ్చు.
ఎందుకు యాంజియోగ్రఫీ చేయబడుతుంది?
ఒక అవయవం లో రక్త ప్రసరణను పర్యవేక్షించడానికి యాంజియోగ్రఫీని నిర్వహిస్తారు. ఇది రక్త నాళాల ఆరోగ్యాన్ని అంచనా వేయడానికి మరియు వాటి గుండా రక్తం ఎలా ప్రవహిస్తుందో గుర్తించడానికి ఉపయోగిస్తారు. ఇది రక్తనాళాలతో సంబంధం ఉన్న అనేక సమస్యలను నిర్ధారించడానికి సహాయపడుతుంది. అథెరోస్క్లెరోసిస్ (atherosclerosis), పెరిఫెరల్ ధమనుల వ్యాధి (peripheral arterial disease), మెదడు ఏయూరిజమ్ (brain aneurysm), ఏంజినా (angina), రక్తం గడ్డలు, మరియు పల్మోనరీ ఎంబోలిజం (pulmonary embolism) వంటి రక్త నాళ సంబంధిత సమస్యల చికిత్సలో కూడా ఇది ప్రణాళిక చేయడానికి.ఇది సాధారణంగా, గుండె మరియు మెదడు యొక్క రక్త నాళాల్లో అడ్డంకులను గుర్తించడానికి ఉపయోగిస్తారు.
ఎవరికి యాంజియోగ్రఫీ అవసరం?
యాంజియోగ్రఫీ అవసరమయ్యే సందర్భాలు కొన్ని క్రింద పేర్కొనబడ్డాయి:
- ఏంజినా ఉన్న వ్యక్తులకి - ఒక మనిషి ఛాతీలో చెప్పలేని నొప్పి లేదా ఒత్తిడిని అనుభవిస్తుంటే, అది భుజాలు, చేతులు, మెడ, దవడ లేదా నడుము వరకు వ్యాపించినప్పుడు, ఆ సమయంలో యాంజియోగ్రఫీ సిఫారసు చేయబడుతుంది
- కార్డియాక్ అరెస్ట్ (గుండె పోటు) ఉన్న వ్యక్తులకి - ఒక వ్యక్తి గుండె హఠాత్తుగా కొట్టుకుంటూ ఉంటే, పరిస్థితిని అంచనా వేయడానికి యాంజియోగ్రఫీని జరపవచ్చు
- గుండె జబ్బులకు సంబందించిన ఎలెక్ట్రాకార్డియోగ్రామ్ (electrocardiogram) యొక్క ఫలితాలు, వ్యాయామ ఒత్తిడి పరీక్ష(exercise stress test) లేదా ఇతర పరీక్షలను సూచిస్తే, యాంజియోగ్రఫీ జరపాలి.
- ఒక వ్యక్తికి గుండెపోటు వచ్చినట్లయితే, కరోనరీ ఆంజియోగ్రఫీ అత్యవసరంగా నిర్వహించబడుతుంది
యాంజియోగ్రఫీ ఎలా నిర్వహించబడుతుంది?
సాధారణంగా యాంజియోగ్రఫీ అనేది సురక్షితమైన ప్రక్రియ. ఇది మాములుగా ఆసుపత్రిలో ఎక్స్-రే లేదా రేడియాలజీ శాఖలో నిర్వహిస్తారు. దీనికి 2 నిమిషాల నుండి 30 నిమిషాలు సమయం పడుతుంది. రోగి అదే రోజు ఆసుపత్రి నుండి వెళ్లిపోవచ్చు. అతను / ఆమె సాధారణంగా మేల్కొని ఉంటారు, కానీ విశ్రాంతి కోసం ఒక ఉపశమనసారిని (sedative) ఇస్తారు. కొన్నిసార్లు, నిద్రను ప్రేరేపించడానికి సాధారణ అనస్థీషియా కూడా ఇవ్వబడుతుంది. వ్యక్తిని ఒక బల్ల మీద పడుకోబెడతారు. గజ్జల లేదా మణికట్టు ప్రాంతాన్ని శుభ్రపరచి స్థానిక (local) మత్తు పదార్థంతో తిమ్మిరిని ఇస్తారు. ధమని(artery) మీద చిన్న కోత కోసి దానిలో ఒక చిన్న గొట్టాన్నిపెడతారు, అది కాథెటర్ (catheter) అని పిలువబడుతుంది. నిపుణులు పరిశీలించాల్సిన అవయవం వైపు ఈ గొట్టాన్ని జాగ్రత్తగా కదిలిస్తారు. కాథెటర్ యొక్క స్థలాన్ని ధృవీకరించడానికి x- రే చిత్రాన్ని తీస్తారు. ఒక రంగు పదార్థం కాథెటర్ లోకి చొప్పించబడింది మరియు రక్తంతో పాటు ఆ రంగు పదార్థం ప్రవహిస్తుంది అప్పుడు అనేక X - రేలు తీస్తారు . ఇది ముఖ్యంగా రక్తనాళంలో ఏవైన అడ్డంకులను పరిశీలించడానికి సహాయపడుతుంది.