తలనొప్పి - Headache in Telugu

Dr. Nadheer K M (AIIMS)MBBS

July 11, 2017

March 06, 2020

తలనొప్పి
తలనొప్పి

సారాంశం

తలనొప్పి తలలోగాని, మెడలోగాని ఏ భాగంలోనైనా ఎడతెరిపి లేకుండా నొప్పి కల్పించే జబ్బు లక్షణం. అది తలలో ఒకవైపుగానీ, లేదా రెండువైపులా గాని సంక్రమించవచ్చు. నొప్పి ఒకే బిందువు వద్ద ఉండవచ్చు లేదా అక్కడ నుండి విస్తరించవచ్చు. హెచ్చు రకాల తలనొప్పులు హెచ్చుస్థాయిలో లేదా మందకొడిగా కనిపించవచ్చు. అవి కొన్ని నిమిషాలపాటు లేదా కొన్ని రోజులపాటు బాధించవచ్చు. మనకు ఎదురవుతున్న తలనొప్పిని సూటిది అయినదిగా లేదా సవాలుగా నిలిచేదిగా పరిగణించవచ్చు. హెచ్చు సమయాలలో తలనొప్పి ప్రమాదకరమైనది కాదు. అయితే కొన్ని సందర్భాలలో తలనొప్పి హెచ్చుగా ఇబ్బందిపెట్టె జబ్బుగా పేర్కొనబడుతున్నది. తలనొప్పి ప్రాథమిక లేదా ద్వితీయ స్థాయిలో కనిపించవచ్చు. ప్రాథమిక స్థాయి తలనొప్పికి ప్రత్యేక కారణం అంటూ ఉండదు. అయితే తలనొప్పి ఇబ్బంది కలిగించే జబ్బుగా లేదా స్థితిగతులపై ఆధారపడి ఉంటుంది. అది తల లోపలి భాగంలో నొప్పికి  లేదా మంటకు దారితీయవచ్చు. విభిన్నమైన తలనొప్పులు సాధారణంగా  నిర్దుష్టమైన జబ్బు లక్షణాలతో కనిపిస్తాయి. వాటికి విశిష్టత ఉంటుంది. తద్వారా తలనొప్పులకు  వాటికోసమే ముందుగా రూపొందించినట్టి చికిత్స ఆవసరం.

తలనొప్పి అంటే ఏమిటి? - What is Headache in Telugu

తలనొప్పి తల లేదా మెడ భాగంలో ఎక్కడైనా ఎడతెరిపి  లేకుండా లేదా బాధించే నొప్పి. తలనొప్పి లక్షణాలలో సాధరణంగా  నిర్ధారించే కారకాలు ఉంటాయి. అవి డాక్టరు అవగాహన చేసుకొనే తలనొప్పి రకం. తలనొప్పి సాధారణంగా చిహ్నాలు మరియు ప్రయోగశాల పరీక్షల ఫలితం ప్రాతిపదికపై  నిర్ధారించబడుతుంది. సందేహపూర్వకమైన రెండవ స్థాయి తలనొప్పి నిర్ధారణకై ఎక్స్ –రే వంటి ఇమేజింగ్ పరీక్షలు అవసరమవుతాయి.

తలనొప్పి అత్యంత హెచ్చుగా సాధారణ ఆరోగ్యంపై దెబ్బతీసే జబ్బు మరియు విభిన్నమైన నరాల సంబంధమైనట్టి క్రమం తప్పిన  ఇబ్బందులలో ఒకటి.  జీవితాంతం తలనొప్పి 96% మందిలో ఉంటుందని, ఇది పురుషుల కంటే స్త్రీలను ఎక్కువగా వేధిస్తున్నదని  అంచనా వేయబడింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మానసికంగా కృంగదీసే తలనొప్పి  40 % మేరకు, మైగ్రెయిన్  10% , తలలో సమూహంగా కనిపించే తలనొప్పి  1%  మందిలో కనిపిస్తున్నది.  ఇటీవలి రోజులలో వైద్య నిపుణులు ఫలప్రదమైన చికిత్స కల్పించడం తొలిమెట్టు అని నొక్కిచెబుతున్నారు. అయితే హెచ్చుగా ప్రధానమైన వ్యవస్థ  తలనొప్పి ప్రాథమిక స్థాయిలోనిదా  లేదా రెండవ స్థాయిలోనిదా అని నిర్ధారించడం. దీనితో తలనొప్పి లోని రకాలపై అవగాహనతో పాటుగా ముందుగా హెచ్చరికలు కల్పించే లక్షణాలు తలనొప్పి నివారణ చర్యలను మరింత సమర్థవంతంగా నిర్వహించడంలో ఎంతో ప్రగతి సాధించవచ్చు.

Nasal Congestion
₹199  ₹249  20% OFF
BUY NOW

తలనొప్పి యొక్క లక్షణాలు - Symptoms of Headache in Telugu

విభిన్న రకాల తలనొప్పులు వేర్వేరుగా కనిపిస్తాయి. అవి వాటి విశిష్ట లక్షణాలను కలిగి ఉంటాయి. తలనొప్పి విధనాన్ని పరీక్షించి నిర్ధారించిన డాక్టర్లు మీ తలనొప్పి రకాన్ని, దానికి కారణాన్ని కనుగొంటారు.  తద్వారా తదుపరి పరీక్షలు మరియు చికిత్స విధానాన్ని రూపొందిస్తారు.

ప్రాథమిక స్థాయి తలనొప్పి
కొన్ని సాధారణ తలనొప్పుల  రకాలు మరియు వాటి లక్షణాలు క్రింద పేర్కొన్న విధంగా ఉంటాయి

  • మైగ్రేన్
    మైగ్రేన్ లు  హెచ్చుగా అనువంశకమైనవి.  అవి పూర్తిగా వెనక్కు మళ్లించగల నాడుల వ్యవస్థ లక్షణాలను కలిగి ఉంటాయి.  వీటి లక్షణాలు సాధారణంగా కనిపించేవిగా లేదా అవగాహనకు  అందేవిగా ఉంటాయి. తలనొప్పులు క్రమేపీ విలక్షణంగా హెచ్చవుతాయి, తగ్గుముఖం పడతాయి, - ఈ ప్రక్రియను ‘ ఔరా’ గా పేర్కొంటారు. ఇవి తదుపరి తరచుగా వివిధ స్థాయిలలో  మళ్లీమళ్లీ కనిపించేవిగా ఉంటాయి. ఇవి వెలుగు ప్రభావానికి లోనవుతాయి అలాగే  నిద్ర విధానంపై కూడా ప్రభావం కలిగి మానసిక మాంద్యానికి దారితీస్తాయి.
  • మానసిక ఒత్తిడి రకం తలనొప్పి
    తలనొప్పి రకాలలో  ఇది సాధారణమైనది. 80% మందిలో ఇది జీవన పర్యంతం వెంటాడే జబ్బు.ఇది ద్వంద్వవైఖరితో అగుపిస్తుంది.. ఇది తల ఉభయ పార్శ్వాలాలో బాధిస్తుంది. తక్కువస్థాయి నుండి ఒక మోస్తరు వరకు నొప్పి కలిగిస్తుంది ఈ రకం నొప్పి ఒత్తిడి లేదా నొప్పికి దారితీస్తుంది. ఈ రకం తలనొప్పి లక్షణాలలో సాధారణంగా పరధ్యానం , కల్పిస్తుంది పైగా తరచుగా కాకుండా, తరచుగా, హెచ్చుగా లేదా దీర్ఘకాలిక వైఖరితో కూడి ఉంటుంది
  • క్లస్టర్ తలనొప్పి
    సమూహ వైఖరి తలనొప్పి లెదా క్లస్టర్ తలనొప్పి పెక్కు ఇబ్బందులను  కలిగిస్తుంది. ముఖం మధ్య, పైభాగం లో, కళ్ల చుట్టూ దీని ప్రభావం కలిగి ఉంటుంది. ఈ రకం తలనొప్పి రోజుకు 1 – 8 మార్లు వంతున కొన్ని వారాలు, నెలల పాటు బాధిస్తుంది.  ఈ క్లస్టర్ రకం తల నొప్పి వచ్చే రోజులలో కొన్ని సందర్భాలలో అసలు తలనొప్పి ఉండదు. ఇలా తలనొప్పిరహితమైన వ్యవధి కొన్ని నెలల నుండి సంవత్సరాల వరకు కొనసాగవచ్చు.  ఇది ఉన్నపళంగా కనిపించే జబ్బు. మంట రేకిత్తిస్తుంది 15 నిమిషాల నుండి 3 గంటల వరకు . కొనసాగుతుంది.  కొన్ని సందర్భాలలో ఇది 24 గంటల వ్యవధిలో పలుమార్లు రావచ్చు.  దీనితో ఈ తలనొప్పిని ‘ అలారం క్లాక్ తలనొప్పి’ గా పేర్కొంటారు . దీని విశిష్ట లక్షణాలలో  కళ్లలో నీరు కారడం, ముక్కు గడ్డకట్టడం. హెచ్చు శ్లేష్మం చేరి ఉంటాయి
  • సైనస్ తలనొప్పి
    ఈ రకం తలనొప్పి వల్ల సాధారణంగా కనిపించే లక్షణాలలో  ముఖంలో నొప్పి లేదా ఒత్తిడి, ముక్కులో అడ్దంకి తలనొప్పితో కూడిన సైనసులు. సాధారణంగా సైనస్ తలనొప్పి క్షణాలలో వ్యాపించే వైరల్ జబ్బు లేదా సూక్ష్మజీవుల ద్వారా సంక్రమించే సైనస్ ఇన్ఫెక్షన్ తర్వాత ఎదురవుతుంది. దీనివల్ల ముక్కు నుండి గట్టియైన, వర్ణరహితమైన. శ్లేష్మం కారడం, వాసన పసికట్టడంలో మాంద్యం లేదా అసలు వాసన పసికట్టలేకపోవడం, ముఖంలో నొప్పి మరియు జ్వరం ఒత్తిడి . ఇది ఆంటీబయాటిక్స్ వాడకం ద్వారా వారం రోజులలో అదుపు చేయవచ్చు.
  • థండర్ క్లాప్ తలనొప్పి
    ఈ రకం తలనొప్పి చాలా తీవ్రస్థాయిలో గరిష్టంగా ఉంటుంది. ఇదిఉన్నపళంగా రావచ్చు లేదా కొద్దికొద్దిగా నింపాదిగా కూడా రావచ్చు.ఇది ప్రాథమిక స్థాయికి లేదా మాధ్యమిక లెదా ద్వితీయస్థాయికి చెందినదిగా ఉండవచ్చు. ద్వితీయస్థాయి నొప్పి సాధారణంగా మెదడులో రక్తస్రావం, మెదడులో ఒత్తిడి తగ్గిపోవడానికి దారితీసి హైపర్ టెన్షన్ ఇబ్బందులను కలిగిస్తుంది.
  • కొత్త దైనందిన అదుపులేని తలనొప్పి
    ఈ రకం తలనొప్పి ప్రతిరోజూ అదుపు లేకుండా వస్తుంటుంది.  రోజూ రావడం జ్ఞప్తిలో ఉంటుంది. నొప్పికి విశిష్ట లక్షణాలు ఉండవు. ఇది మైగ్రేన్ లేదా ఒత్తిడి రకం తలనొప్పి వలె ఉంటుంది. నొప్పి 3 నెలలు అంతకంటే ఎక్కువ రోజులు కొనసాగితే జబ్బు నిర్ధారణ జరుగుతుంది
  • హెమిక్రేనియా కంటిన్యువా
    ఇది ఒక రకం దీర్ఘకాలిక ప్రాతిపదికగా రోజూ వచ్చే తలనొప్పి.  దీని కారణంగా ఒకే-వైపు,  మధ్యస్థాయి నుండి తీవ్రస్థాయి వరకు తలనొప్పి వస్తుంది. తద్వారా కళ్లలో నీరు కారడం, కళ్లు ఎరుపు కావడం, ముక్కుపుటాలలో గట్టితనం,  ముక్కు నుండి నీరు కారడం, క్లస్టర్ తలనొప్పి వలె కనురెప్పలు బరువుగా  క్రిందికి వాలడం జరుగుతాయి.

సెకండరీ తలనొప్పి
తలనొప్పి ప్రాథమిక స్థాయిలో దేనిలో కూడా ఇమడకపోయినప్పుడు, పైగా మరింత తీవ్రమైనప్పుడు, జబ్బు కారణం తెలుసుకొనేందుకు మరియు పరిస్థితి అదుపునకు తీవ్రచర్యలు చేపట్టవలసి ఉంటుంది. ఈ ద్వితీయస్థాయి తలనొప్పికి తీవ్రస్థాయి  లక్షణాలు కనిపించవు.

తలనొప్పి యొక్క చికిత్స - Treatment of Headache in Telugu

తలనొప్పి పరిష్కారానికై  చికిత్సకై వీలయినంత త్వరగా డాక్టరు సలహా పాటించడం ముఖ్యం. మీ నొప్పి లక్షణాల ఆధారంగా  మీ డాక్టరు క్రింది చికిత్సలను కొనసాగించవచ్చు.

అవగాహన పెంపొందించుకోండి
విజయవంతమైన చికిత్స కై గల కారకాలలో ఒకటి మీలో మీరు  అవగాహన పెంపొందించుకోవడమే. మీరు ఏ రకం తలనొప్పిని అనుభవిస్తున్నారో దానిని తెలుసుకోవడం అవసరం. మీ డాక్టరు మీకు తలనొప్పి డెయిరీని కేటాయిస్తాడు.  దానిలో మీరు మీ ఎదుర్కొంటున్న జబ్బు వివరాలను విపులంగా వ్రాస్తూ ఉండాలి. జబ్బు వివరాలతో పాటు ఎదురయ్యే కారకాలను , ఉపశమనానికై తీసుకొన్న చికిత్స, మరియు చెప్పుకొనదగిన తదుపరి అంశాలను పొందుపరచాలి.

మానసిక ఒత్తిడి నిర్వహణ
ఒత్తిడిని అదుపు చేయడం ఇదివరకు పేర్కొన్న విధంగా,  నేటి పరిస్థితిలో మానసిక ఒత్తిడి తలనొప్పికి సాధారణ  కారకాలలో ఒకటి. మీ డాక్టరు మీకు ఫలప్రదమైనట్టి ఒత్తిడి నివారణ ఉపాయాలను పేర్కొనవచ్చు. వాటిలో యోగా,  ధ్యానం,  లోతుగా శ్వాసక్రియ జరపడం వంటి వ్యాయామం, అరోమా థెరపీ, మ్యూజిక్ థెరపీ, వాటితోపాటు పెంపుడు జంతువుల, ప్రాణుల థెరపీ కూడా చేరి ఉండవచ్చు.

ధ్యానం గురించి మీ డాక్టరును సంప్రతించండి
జబ్బు లక్షణాలు తీవ్రంగా ఉన్నట్లయితే, లేదా అదుపు లేకుండా కొనసాగుతున్నట్లయితే, డాక్టరు మందులు సూచించవచ్చు. సాధారణంగా ఇవి మూడు రకాలుగా వర్గీకరింపబడుతాయి. :

  • జబ్బు చిహ్నాల ఆధారంగా ఔషధాలు
    వీటిలో సరళంగా  కౌంటరులో లభ్యమయ్యే పారాసెటమాల్ , అస్పిరిన్, లేదా ఇబు ప్రోఫెన్ వంటి మందులు ఉంటాయి. అయితే హెచ్చుగా మందులు వాడటం  వల్ల ప్రయోజనం కంటే ముప్పు ఎక్కువని గ్రహించాలి. భద్రత రక్షణ వివరాలకై మీ దాక్టరును సంప్రతించదం మంచిది.
  • నిష్ఫలమైన  మందులు
    వీటి పేరును బట్టి ఇవి, తలనొప్పి చిహ్నాలను తొలగిస్తాయి  తొలి చిహ్నం విస్తరించగానే ఇవి చికిత్స ప్రారంభిస్తాయి. ఈ వర్గం లో ఉపయోగించే మందులలో  ఇంజక్షన్ మందులు, ఎర్గోటమిన్ మరియు సుమాట్రిప్టాన్ ఉంటాయి. అయితే వీటి కొనుగొలుకు ఔషధ సూచిక ( ప్రిస్కిప్షన్) అవసరం.
  • నివారణ ఔషధాలు
    ఈ రకం ఔషధాలు తరచుగా వచ్చే లేదా తీవ్రస్థాయిలో ఉండే తలనొప్పికి ఉపయోగిస్తారు. వాటిలో ట్రైసైక్లిక్ ఆంటిడిప్రెషంట్స్, అమిట్రైప్టిలిన్ వంటివి. కాల్షియం చానల్ బ్లాకర్స్, ఆమ్లోడిపైన్ వంటివి, ఆంటిహిస్టామైన్స్, ఫెనిరామిన్ వంటివి, ఆంటికాన్వల్సంట్స్ వాల్ప్రోయేట్ వంటివి,  వీటిని మీ డాక్టరు సూచిస్తారు, వాటిని జాగ్రత్తగా వాడాలి.

ప్రత్యామ్నాయ థెరపీలను ప్రయత్నించండి
ఇప్పుడు కొత్త తరహా థెరపీలు లభిస్తున్నాయి, వాటిని సంరదాయకమైన థెరపీలతో సహా ఫలితాల మెరగుకై ఉపయోగించవచ్చు. వాటిలో చేరినవి :

  • ఆక్యుపంచర్
  • డీప్ బ్రెయిన్ స్టిములేషన్
  • బయో ఫీడ్ బ్యాక్
  • ప్రోగ్రెసివ్ మజుల్ రిలాక్సేషన్
  • కౌన్సెలింగ్ థెరెపీ

జీవన సరళి ఔషధాలు

  • తలనొప్పి సాధారణంగా జీవనసరళితో , అలవాట్లతో ముడిపడినందున, దాని నివారణ , అదుపునకు మీ జీవన విధానంలో కొద్దిపాటి, తేలిక అయిన చిన్న మార్పులను చేపట్టడం అవసరం,. అవి క్రింద పేర్కొన్నవాటికి మాత్రమే పరిమితం కావు
  • రోజువారీ క్రమం తప్పకుండా నిద్రించడం
  • రోజువారీ క్రమం తప్పకుండా భుజించడం
  • రోజువారీ క్రమం తప్పకుండా వ్యాయామం
  • క్రియాత్మకతను  మానుకోవడం
  • మానసిక ఒత్తిడి నిర్వహణ
  • బరువు తగ్గించుకోవడం (వీలయితే)
  • కాఫీని మానడం


వనరులు

  1. Paul Rizzoli, William J. Mullally. Headache. Harvard Medical School, Boston. January 2018 Volume 131. American Journal of Medicine,131(1), pp.17-24.
  2. Hale N, Paauw DS. Diagnosis and treatment of headache in the ambulatory care setting: a review of classic presentations and new considerations in diagnosis and management. Med Clin North Am. 2014 May;98(3):505-27. PMID: 24758958.
  3. Science Direct (Elsevier) [Internet]; Oral and Maxillofacial Pathology 3rd Edition
  4. American Migraine Foundation. [Internet]. Mount Royal, NJ.2019 American Migraine Foundation. Sinus Headaches.
  5. Dodick DW Thunderclap. Thunderclap headache. Headache Journal of Neurology, Neurosurgery & Psychiatry 2002;72:6-11.
  6. Cleveland Clinic. [Internet]. Cleveland, Ohio. Diagnosing Headache
  7. Probyn K, Bowers H, Caldwell F, Mistry D, Underwood M, Matharu M, Pincus T. Prognostic factors for chronic headache: A systematic review.. Neurology. 2017 Jul 18;89(3):291-301. PMID: 28615422.
  8. Winchester Hospital. [Internet]. Beth Israel Lahey Health, Winchester, MA. Risk Factors for Headache.

తలనొప్పి కొరకు మందులు

Medicines listed below are available for తలనొప్పి. Please note that you should not take any medicines without doctor consultation. Taking any medicine without doctor's consultation can cause serious problems.