శృంగార సమయంలో నొప్పి లేదా డైస్పరేనియా అనేది లైంగిక సంభోగ సమయంలో స్త్రీ జననేంద్రియ నొప్పిని అనుభవించే పరిస్థితి. ఇది స్త్రీ జీవన నాణ్యతను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. డిస్పెరేనియా యొక్క ప్రాబల్యం రేటు అధికంగా ఉంది, ఇది గణనీయమైన ఆర్థిక మరియు ఆరోగ్య భారాన్ని కలిగిస్తుంది. చాలా మంది ఆరోగ్య నిపుణులు (వైద్యులు) దీని గురించి విచారించకపోవడం లేదా సిగ్గు కారణంగా మహిళలు దానిని ఎప్పుడూ వైద్యులకి నివేదించకపోవడం వల్ల సాధారణంగా డిస్స్పరేనియా లక్షణాలు పైకి తెలియబడవు. ఆరోగ్య పరిస్థితులు, స్త్రీ జననేంద్రియ సమస్యలు, మందులు మరియు సామాజిక నమ్మకాలు వంటి అనేక అంశాలు స్త్రీ లైంగిక రుగ్మతల యొక్క అధిక ప్రాబల్యానికి దారితీశాయి. సెక్స్ సమయంలో నొప్పి, సాధారణమైనప్పటికీ, తరచుగా ఇది నిర్లక్ష్యం చేయబడే సమస్య. ప్రపంచ జనాభాలో 3% నుండి 18% మందిలో వరకు ఇది కనిపిస్తుంది.
డిస్స్పరేనియాతో బాధపడుతున్న మహిళలు తమ భాగస్వామి మరియు కుటుంబం నుండి సహకారం లేకపోవడం వల్ల మానసిక ఒంటరితనాన్ని అనుభవిస్తారు. శృంగార సమయంలో నొప్పి అనేది శృంగారంపై ఆసక్తి మరియు లైంగిక ప్రాధాన్యతల వంటి విషయాల పై కూడా ఆధారపడి ఉంటుందని నివేదించబడింది. ఇటువంటి అంశాలు లైంగిక భాగస్వామితో సరైన సంభాషణ లేకపోవడం అనే విషయాలతో బలంగా సంబంధం కలిగి ఉంటాయి. తగినంత ఫోర్ ప్లే లేకపోవడం, లూబ్రికేషన్ తగినంతగా లేకపోవడం మరియు బిగుతుదనం వంటివి తరచుగా బాధాకరమైన లైంగిక చర్యతో ముడిపడి ఉంటాయి. కొన్నిసార్లు, కటి భాగపు పరీక్ష లేదా స్పెక్యులం (speculum) పరీక్ష నొప్పిని పెంచుతాయి. రోగ నిర్ధారణ ప్రధానంగా వైద్య పరీక్ష ఆధారంగా ఉంటుంది మరియు వివరణాత్మక ఆరోగ్య చరిత్రను తెలుసుకోవడం మరియు శారీరక పరీక్ష ద్వారా నిర్వహించబడుతుంది. డైస్పరేనియాకు దారితీసే అంతర్లీన ఆరోగ్య సమస్యల సంభావ్యతను నిర్ములించడానికి పూర్తిగా ఇమేజింగ్ పరీక్షలు అవసరం కావచ్చు. తగిన చికిత్స కోసం శారీరక మరియు/లేదా మానసిక కారణాలను తెలుసుకోవడం చాలా అవసరం. చికిత్సలో సైకాలాజిస్ట్ లేదా లైంగిక ఆరోగ్య సలహాదారు (sexual health counsellor), వివాహ సలహాదారుతో కౌన్సెలింగ్, భాగస్వామితో ఉండే సఖ్యతను మెరుగుపరచడం మరియు శారీరక కారణాలకు చికిత్స చేయడం వంటివి ఉంటాయి.
అక్షరాస్యత రేటు పెరిగినప్పటికీ, భారతదేశంలో సెక్స్ ఇప్పటికీ ఒక నిషిద్ధంగా విషయంగా పరిగణించబడుతుంది. చాలా మందికి లైంగిక పరిజ్ఞానం లేదు మరియు అలాంటి అనారోగ్యంతో బాధపడుతున్న వారు చికిత్స కూడా తీసుకోరు. ప్రతి వ్యక్తి తమ భాగస్వామితో ఆరోగ్యకరమైన లైంగిక సంబంధాన్ని కలిగి ఉండాలి, ఎందుకంటే ఇది వివాహం బంధంలోని ముఖ్య అంశాలలో ఒకటి.