సంభోగంవల్ల చాలా విస్తారమైన ఆరోగ్య ప్రయోజనాలున్నాయి, లైంగిక హార్మోన్లలో వ్యత్యాసం కారణంగా, పురుషులు మరియు మహిళల్లో సంభోగం యొక్క ప్రయోజనాలు భిన్నంగా ఉండవచ్చు. సంభోగం మహిళల్లోఈస్ట్రోజెన్ హార్మోన్ల స్థాయిని పెంచుతుంది, వారి సంతానోత్పత్తిశక్తిని కూడా పెంచుతుంది.
(మరింత చదువు: లైంగిక వాంఛను పెంచే ఆహారాలు)
ఈస్ట్రోజెన్ హార్మోన్లు స్త్రీలలో ఉండే లైంగిక హార్మోన్‌లు, ఇవి స్త్రీలలో సంతానోత్పత్తిశక్తిలో పాత్ర కాకుండా, స్త్రీలలో అనేక ఇతర విధుల్ని నిర్వహిస్తాయి. మహిళల్లో రొమ్ము కణజాల పెరుగుదలకు ఈస్ట్రోజెన్ హార్మోన్లు ముఖ్యమైనవి, మహిళలకు రొమ్ము కణజాలం చాలా ముఖ్యం, ముఖ్యంగా, చనుబాలిచ్ఛే చంటిపిల్లల తల్లులకు ఈస్ట్రోజన్లు బహు ముఖ్యం. ఈస్ట్రోజెన్ హార్మోన్లు యోని సరళతను తన జారుడుగుణం (lubricant)తో మెరుగుపరుస్తుంది, ఇది యోని ఎండిపోకుండా కందెనలా రాపిడిని తగ్గించి పొడిదనాన్ని నివారించడంలో సహాయపడుతుంది. యోని పొడిబారిపొయ్యే రుగ్మతవల్ల యోని నొప్పి మరియు యోని అంటురోగాలు సంభవిస్తాయి, కాబట్టి యోని పొడిబారడం అనేది యోనిలో నొప్పి, అంటురోగాలకు ఓ ముఖ్యమైన ప్రమాద కారకంగా గుర్తించబడింది. యోని ఈస్ట్ సంక్రమణ సంభావ్యత ముఖ్యంగా పెరిగింది.
స్త్రీలపై నిర్వహించిన అధ్యయనంలో తేలిందేమంటే సంభోగక్రియ తక్కువగా ఉన్న మహిళల్లో మైథున సమయంలో నొప్పి (లేదా బాధాకరమైన సంభోగం) మరింత ఎక్కువగా ఉంటుంది. ఇది యోనియొక్క పొడిదనం కారణంగా కూడా కావచ్చు. కాబట్టి, ఈ స్త్రీలలో యోనిసంబంధమైన ఈ రుగ్మతలన్నింటికీ ఆనందంగా సంభోగంలో పాల్గొనడమే ఓ మంచి పరిష్కారం మరియు రక్షణచర్య కావచ్చని చెప్పడం జెరిగింది.
యోనిలో నొప్పి మరియు పొడిదనాన్ని తగ్గించడానికి, ఒక తేలికపాటి కందెన (lubricant) వాడకాన్ని ఈ మహిళలకు సూచించవచ్చు. అంతేకాక, మహిళలకు సంభోగం చాలా ముఖ్యం, అంతే ముఖ్యంగా మహిళల్లో యోనిసరళతని నిర్వహించడానికి సంభోగానికి ముందు వారిలో సంభోగప్రేరణ (foreplay) కల్గించడం చాలా అవసరం, కాబట్టి ఈ సంభోగప్రేరణను భాగస్వామి సమర్ధవంతంగా నిర్వహించాలి.
ముట్లుడిగిన (మెనోపాజ్) తర్వాత మహిళల్లో యోని పొడిబారడం మరియు క్షీణత ప్రమాదం ఎక్కువగా ఉంటుంది, అందుచే ఆడవారు సంభోగానికి దూరంగా ఉండరాదు. కాబట్టి యోని క్షీణత (వయస్సు పైబడ్డ మహిళలు లేక ముట్లుడిగినవాళ్లలో యోని కణజాలం సన్నబడి పోవడం) ను ఎదుర్కొనేందుకు ముట్లు ఆగిపోయిన (ఋతుక్రమం ఆగిన) మహిళలకు యోని సరళతను నిర్వహించేందుకు క్రీములవంటి ‘యోని ఈస్ట్రోజెన్’ (topical or vaginal estrogen)లను వైద్యులు సిఫార్సు చేస్తారు.
సంభోగంవల్ల మహిళలకు కలిగే గుండె సంబంధ రక్షణచర్యలు (కార్డియోప్రొటెక్టివ్ చర్యలు) ఇప్పటికే చర్చించబడ్డాయి. కాబట్టి మహిళలకిది ముట్లుడిగిన తర్వాత (మెనోపాజ్) కూడా సంభోగ కార్యకలాపాల్లో మునిగిపోవడానికి తగినంత కారణాన్ని మరియు ఆవశ్యకతను తెలియజేస్తుంది. మరొక అత్యంత ఆశ్యర్యదాయకమైన విషయమేమంటే సంభోగంవల్ల చర్మం యొక్క రూపులో మెరుపు (glow) వస్తుంది. ఒత్తిడిని తొలగించి, ఆనందాన్ని కల్గించడంలో సంభోగం పాత్ర అమోఘంగా ఉన్నందున వయస్సు మీరుతున్న గుర్తులు కనిపించకుండా ఉండేందుకు సంభోగం దోహదపడవచ్చు .
సాధారణంగా, ఒత్తిడి ముఖంపైన, ఇతర శరీరభాగాలపై వచ్చే గీతలు (fine lines) మరియు ముడుతలతో సంబంధం కలిగి ఉంటుంది మరియు వారి సంభోగంతో కూడా సంబంధం కలిగి ఉంటుంది. ఒత్తిడి ఉపశమనం మరియు ఆనందం కల్గించడంలో సంభోగానికి ఉన్న పాత్ర కారణంగా వృద్ధాప్య సంకేతాలను తగ్గించడంలో కూడా సంభోగం సహాయపడుతుంది.
మరో సిద్ధాంతం ప్రకారం, సంభోగం ఈస్ట్రోజెన్ స్థాయిలను పెంచడంలో సహాయపడుతుంది. ఈ ఈస్ట్రోజెన్ స్థాయిలు చర్మం యొక్క స్థితిస్థాపకత (elasticity) ను నిర్వహించడానికి బాధ్యత వహిస్తుంది. చర్మం యొక్క స్థితిస్థాపకతే ముడుతలను తగ్గిస్తుంది. సిద్ధాంతం ఏది అయినా, మీ చర్మం రూపలావణ్యాదుల్ని మెరుగుపర్చడంలో సంభోగం యొక్క పాత్ర ఉండగలదని గమనించడం ముఖ్యం.
ఇది కాకుండా, సంభోగం రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడానికి కూడా అవకాశం ఉంది. జంతువుల నమూనాలపై జరిపిన కొన్ని అధ్యయనాలు కూడా సంభోగం మహిళల్లో జాగరూకతను పెంచుతుందని తెలుపగా, మరికొన్ని అధ్యయనాలు ఏ నిర్దిష్ట సంబంధాన్ని బయటపెట్టలేదు. ఈ విషయంలో మరిన్ని అధ్యయనాల అవసరం ఉంది.