విజయవంతమైన ఫలదీకరణం జరిగిన తర్వాత గర్భధారణ లేదా బిడ్డను గర్భమందు మోయడం అనేది జరుగుతుంది. గర్భం దాల్చడమనేది స్త్రీ శరీరంలో స్త్రీ-పురుషుల అసమ సంయోగ బీజాల (gametes) కలయిక ప్రక్రియ ద్వారా జరుగుతుంది. గర్భధారణ సంభవించడానికి, మగ మరియు ఆడ బీజాలు లేక అసమ సంయోగ బీజాలు అంటే, పురుషబీజకణం (వీర్యం లేక స్పెర్మ్) మరియు అండాణువులు (ova) కలుసుకోవాలి.
మగవారి వృషణాల లోపల వీర్యకణాలు నిల్వ చేయబడి ఉంటాయి మరియు లైంగిక క్రియ జరుగుతున్నపుడు ఈ వీర్యకణాలు ఎల్లప్పుడూ అంకురించగల శక్తిని కలిగిఉంటాయి, అదే స్త్రీ బీజకణాల విషయంలో అలా కాదు. గుడ్డు లేదా అండాణువులు (ova) స్త్రీలలో అండోత్పాదన (అండోత్సర్గము) సమయంలో మాత్రమే విడుదల చేయబడతాయి. పురుషులలో అయితే అనేక వీర్యకణాలు తయారై వృషణాల్లో నిల్వ చేయబడతాయి, స్త్రీలలో అయితే అలా కాదు, ఒక నెలలో ఒక గుడ్డును మాత్రమే స్త్రీ దేహం విడుదల చేస్తుంది. ఇది సాధారణంగా మీ ఋతు చక్రం మధ్యలో సంభవిస్తుంది, ఖచ్చితంగా చెప్పాలంటే, మీ తదుపరి ఋతుచక్రం ప్రారంభానికి సుమారు 14 రోజులు ముందుగా మీ దేహం (స్త్రీ దేహం) గుడ్డును విడుదల చేస్తుంది.
(మరింత చదువు: టెస్టోస్టెరాన్ స్థాయిల్ని పెంచడానికి గృహ చిట్కాలు)
ఒకసారి గుడ్డు లేక స్త్రీ బీజాణువు విడుదలైతే, ఫలదీకరణం కోసం స్త్రీ అండాణువు (ova) తక్షణం అందుబాటులో ఉండదు మరియు మీ తదుపరి ఋతుచక్రం వరకు అంటే నెల వరకు ఎప్పుడైనా గర్భం రావడమనేది జరగొచ్చు. స్త్రీ అండాణువు ఏర్పడిన తర్వాత సుమారు 12-24 గంటల వరకూ మాత్రమే అంకురించగల శక్తిని కల్గి ఉండడం జరుగుతుంది. ఈ విధంగా, మీరు శిశువును పొందడానికిగాను ప్రసవానికి ఎదురు చూస్తుంటే, లైంగిక క్రియలో పాల్గొనేందుకు ఇదే ఉత్తమ సమయంగా పరిగణించబడుతుంది, మరి అలా కాకపొతే (గర్భం) వీలు కాకపోవచ్చు.
(మరింత చదువు: ప్రెగ్నెన్సీ కిట్ ను ఎలా ఉపయోగించాలి)
గర్భధారణ గురించిన ప్రశ్నకు తిరిగి వస్తున్నాం. ఒకసారి గుడ్డు ఏర్పడిన తర్వాత, అది ఫాలోపియన్ ట్యూబ్లోకి విడుదల అవుతుంది, ఇది మహిళా పునరుత్పత్తి అవయవాల్లో ఓ భాగం. ఇప్పటికే చెప్పినట్లుగా, ఫెలోపియన్ ట్యూబ్లోకి వచ్చి చేరిన గుడ్డు ఫలదీకరణం కోసం 12 నుంచి 24 గంటల వ్యవధిపాటు అందుబాటులో ఉంటుంది. ఈ సమయంలో స్త్రీ అండాణువు (ova) మరియు పురుషుడి వీర్యకణాల (స్పెర్మ్) యొక్క మిలనం సంభవిస్తే, ఫలదీకరణం జరుగుతుంది. ఫాలోపియన్ ట్యూబ్ చివరిలో సాధారణ ఫలదీకరణం ఏర్పడుతుంది.
ఇది సంభవించడానికి, స్త్రీ అండాణువు (ova) సరైన వీర్యకణాలతో కలవడం కూడా చాలా అవసరం. అన్ని పురుష వీర్య కణాలు ఫలదీకరణం జరిగే స్థలంలోకి రాలేవు, వాటిలో చాలా కణాలు గర్భాశయ శ్లేష్మం ద్వారా సహజంగా తిరస్కరించబడతాయి. ఎంపిక చేసుకున్న వీర్యకణం అప్పుడు గర్భాశయం చేరుకుంటుంది మరియు ఫెలోపియన్ ట్యూబ్ చేరే ముందు పరిపక్వ చక్రంలోకి వస్తుంది. వీర్యకణాలు 5 రోజులవరకూ అంకురించగల శక్తిని కలిగిఉంటాయి, లైంగిక సంబంధం తర్వాత ఫలదీకరణం సంభవించవచ్చు, దీనిలో సమయం విండో (time window)ని వీర్యకణం నిర్ణయిస్తుంది. ఫలదీకరణ గుడ్డు లేదా సంయుక్తబీజము (zygote) అప్పుడు ఏర్పడుతుంది. ఈ ఫలదీకరణ గుడ్డు (సంయుక్తబీజము) ఫెలోపియన్ ట్యూబ్ ద్వారా క్రమంగా పైకి వెళ్లి గర్భాశయం చేరుకొంటుంది, ఇక్కడ అమరిక ఏర్పడుతుంది.
ఈ విధానంలో, సంయుక్తబీజము (zygote) అనేకసార్లు బహుకణ మావి లేక పిండభస్త్రిక (multicellular blastocyst) ను ఏర్పరుస్తుంది. ఇది ఫలదీకరణం అయిన ఒక వారం తర్వాత సంభవిస్తుంది. ఇది గర్భాశయాన్ని చేరుకొని దాని లైనింగ్లో పొడగడం జరుగుతుంది, దీన్నే “ఎండోమెట్రియం” లేక గర్భాశయం లోపలి పొర అని కూడా పిలువబడుతుంది. ఈ లైనింగ్ ఫలదీకరణ గుడ్డును అందుకోవడం కోసం రక్తనాళాలు మరియు పోషకాలతో కూడుకుని మందంగా ఉంటుంది. ఈ లైనింగ్ గుడ్డును అందుకోవడం మరియు దాన్ని పట్టి ఉంచడంలో సహాయపడుతుంది, మరియు అది పెరిగే కొద్దీ ఆ పిండానికి పోషణ అందించడంలో సహాయపడుతుంది.
ఇప్పుడు, మీ ముట్టుకు ముందు, ముట్టు సమయంలో లేదా ముట్టు అయిన తర్వాత గర్భధారణను (pregnant) పొందే అవకాశం గురించి చర్చిద్దాం.
(మరింత చదువు: గర్భం దాల్చడం ఎలా)