సారాంశం
స్వప్న స్ఖలనాన్ని ఆంగ్లంలో నైట్ ఫాల్ (night fall), వెట్ డ్రీం (wet dream), రాత్రిపూట స్ఖలనం (nocturnal emission), రతి కల (sex dream) అని కూడా పిలుస్తారు. ఇది అసంకల్పితంగా లేదా ఆకస్మికంగా కలిగే భావప్రాప్తి (spontaneous orgasm), ఇది నిద్రలో సంభవిస్తుంది మరియు మగవారిలో వీర్యం కారిపోవడానికి (ఉత్సర్గకు) దారితీస్తుంది లేదా ఆడవారిలో యోని స్రావం అవుతుంది. కౌమారదశలో మరియు లైంగికంగా చురుకైన పెద్దలలో ఇది చాలా సాధారణం, ముఖ్యంగా వారు శృంగార కలలు కన్నప్పుడు ఇది సంభవిస్తుంది. పురుషులలో స్ఖలనం అయిన ద్రవాన్ని “వీర్యం” అంటారు మరియు అకస్మాత్తుగా లేదా ఉదయాన్నే మేల్కొన్నప్పుడు ఇది లోదుస్తులపై కొద్దిగా మందపాటిగా, అంటుకున్న ఉత్సర్గంగా కనిపిస్తుంది. దీన్ని చూచిన వెంటనే మనిషి తన మనసులో ఒకింత ఇబ్బంది పడొచ్చు మరియు దీని గురించి ఎవరితోనైనా, ముఖ్యంగా తల్లిదండ్రులతో, చర్చించడం కొన్నిసార్లు ఇబ్బందికరంగా ఉంటుంది. స్వప్న స్ఖలనానికి కారణాలు హార్మోన్ల మార్పులు మరియు పెరిగిన లైంగిక కోరికలే. రోగ నిర్ధారణ ప్రధానంగా చరిత్ర మరియు క్లినికల్ పరీక్షల ద్వారా చేయబడుతుంది. దీని నివారణకు ఆలోచనా ప్రక్రియలో మార్పులు మరియు కొన్ని జీవనశైలి అలవాట్ల మార్పులు ఉంటాయి. సలహా సంప్రదింపులు (కౌన్సెలింగ్) చికిత్స యొక్క ఎంపిక. మూలికా నివారణలు లక్షణాలను నియంత్రించడంలో సహాయపడతాయి.