సురక్షితమైన సంభోగం అనేది సంభోగ చర్యకు ముందు మరియు సంభోగం జరిపే సమయంలోను కూడా తీసుకోవాల్సిన పలు జాగ్రత్త చర్యల అభ్యాసాన్ని సూచిస్తుంది. ఇది మిమ్మల్ని మరియు మీ భాగస్వామిని సుఖవ్యాధులు (లేక లైంగికంగా సంక్రమించే వ్యాధులు-STDs) మరియు సంబంధిత అంటురోగాల (STIs) నుండి రక్షించడంలో సహాయపడుతుంది. సురక్షితమైన సంభోగం మీ ఆరోగ్యాన్ని, ఆయుస్సును కూడా మెరుగుపరుస్తుంది మరియు మీ లైంగిక అనుభవాన్ని పెంచుతుంది. అలా కాకుండా సంభోగంలో జాగ్రత్త చర్యల అభ్యాసాన్ని పాటించకపోతే, అసురక్షిత సంభోగంవల్ల, లైంగికచర్యల ద్వారా వ్యాపించే వ్యాధుల (STDs) చేత బాధించబడే అవకాశం ఉంది. అత్యంత సాధారణమైన లైంగికచర్యల ద్వారా వ్యాపించే వ్యాధులు (STDs) మరియు లైంగికచర్యల ద్వారా వ్యాపించే అంటువ్యాధులు (STIs):
- హెచ్ఐవి-ఎయిడ్స్
- సిఫిలిస్
- హెపటైటిస్
- గోనేరియా
- క్లమిడియా
- హెర్పెస్
- ట్రిఖోమోనియాసిస్
- జననేంద్రియ పొక్కులు
సంభోగంలో పాల్గొన్నపుడల్లా సుఖవ్యాధుల (STDs) గురించిన ప్రమాదం మదిలో మెదుల్తుంది. అయితే సురక్షితమైన సంభోగాన్ని పాటించడం ద్వారా ఈ సుఖవ్యాధుల ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. ఒక భాగస్వామితో సంభోగాన్ని (లైంగిక సంబంధం) కలిగి ఉండటం సురక్షితం అని సూచించబడింది, ఎందుకంటే చాలామంది సంభోగ భాగస్వాముల్ని కలిగివున్న వ్యక్తులలో సుఖవ్యాధుల (ఎస్.డి.డిల). యొక్క ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ, ఎవరైనా చాలామంది సంభోగ భాగస్వాముల్ని కల్గినవారితో సంభోగాన్ని జరపాల్సివస్తే సంభోగం సమయంలో రక్షణను (కండోమ్స్ వంటివి) ఉపయోగించడం చాలా అగత్యం.
సుఖవ్యాధులు లేదా లైంగిక సంక్రమణ వ్యాధులు (STDs) యోని సంభోగంలోనే వ్యాపిస్తాయి ఇతర (యోనేతర) సంభోగచర్యల కార్యకలాపాలలో వ్యాపించవు అనే నమ్మకానికి విరుద్ధంగా, ఈ లైంగిక వ్యాధులలో అధికభాగం తరచూ పాయువుమార్గం ద్వారానే వ్యాపిస్తాయని గమనించండి. మౌఖిక సంభోగం (oral sex) లేదా నోటి సెక్స్ ద్వారా కూడా గనేరియా (Gonorrhea) వంటి సుఖవ్యాధులు వ్యాపిస్తాయి. కాబట్టి, ఏ విధమైన సంభోగం (అంటే యోని, పాయువు లేదా నోటితో చేసే సంభోగం) చేసినా రక్షణను ఉపయోగించడం చాలా అవసరం.
సంభోగ సమయంలో కండోమ్స్ లేదా ఆడ కండోమ్లు (ఫెమిడోమ్స్) వంటి గర్భనిరోధక పరికరాలను ఉపయోగించడం అత్యంత సాధారణ మరియు సమర్థవంతమైన రక్షణా పద్ధతి. సురక్షితమైన సంభోగానికి ఇతర పద్ధతులు, చిట్కాలు, (కండోమ్ల వంటి) పరికరాలతోపాటు గర్భనిరోధకాల ఉపయోగం గురించి ఈ వ్యాసంలో చర్చించబడింది.