చాలా మంది మహిళలు, నిజానికి, వారి కుటుంబ సభ్యులు, మగ బిడ్డ పుట్టాలని రహస్యంగా కోరుకుంటూ ఉంటారు! నిజానికి జంటలు ఎల్లప్పుడూ ఆరోగ్యకరమైన బిడ్డను పొందడంపై దృష్టి పెట్టాలి, ఈ రోజుల్లోకూడా, భారతీయ సమాజంలో సాంప్రదాయక మరియు సాంఘిక కారణాల వలన మగపిల్లలు కావాలనే కోరికతో తమ లైంగిక చర్యను ప్రణాళిక చేసుకునే జంటలు ఉన్నారు. ఈ కోరికతో పాటుగా, ముసలమ్మల కథలు కూడా వ్యాప్తి చెందాయి. మగపిల్లవాడి కనడం కోసం ఎలా గర్భం ధరించవచ్చో చెప్పే కథలు అవి. ఎప్పుడు సంభోగం జరపాలి?, ఏ ఆహారాలు తినాలి? ఏ బట్టలు ధరించాలి మొదలైన కథలు ....!
మగ పిల్లవాడు తమ వారసత్వాన్ని ముందుకు తీసుకువెళతాడని మరియు వృద్ధాప్యంలో వారిని చూసుకుంటాడని తల్లిదండ్రులు మరియు సమాజం భావిస్తున్నందున ఇదంతా జరుగుతూ ఉంది.
ఈ రోజుల్లో విజ్ఞాన శాస్త్రం చాలా పురోగతి చెందింది కాబట్టి, శిశువు యొక్క లింగం శిశువు తల్లి ద్వారా కాక తండ్రి వీర్య కణం (స్పెర్మ్) ద్వారా ప్రభావితమవుతుందని మనందరికీ తెలుసు. కాని ఇంకా, అబ్బాయిని కనడం ఎలా? అనే విషయం మీద అంతర్జాలంలో మరియు బంధువులలో అనేక చిట్కాలు ఉన్నాయి! ఇప్పటికీ జాతకచక్రాలను విశ్వసించే సమాజంలో, ప్రజలు ఈ కథలను విశ్వసించడం అనేది ఆశ్చర్యం కలిగించే విషయమేమి కాదు.
బిడ్డకు జన్మనివ్వడానికి ప్రయత్నిస్తున్నవారు మరియు అబ్బాయిని కనాలనే ఉద్దేశ్యంతో ఉన్న స్త్రీలందరూ తెలుసుకోవలసిన కొన్ని అపోహలు ఈ క్రింద ఉన్నాయి. మగ బిడ్డను కనడం కోసం మీ స్నేహితులు మరియు బంధువులు ఇచ్చిన అన్ని చిట్కాలతో పోల్చుకోవడానికి ఈ వ్యాసం మీకు సహాయపడుతుంది మరియు కథలు ఎల్లప్పుడూ నిజం కాదని తెలుసుకోవడానికి మీరు దీనిని చదవాలి.
(మరింత చదవండి: గర్భంలో మగపిల్లవాడు ఉన్నాడన్న సంకేతాల చుట్టూ ఉన్న అపోహలు)