ఒక మహిళ లేదా జంట (భార్యా- భర్త) తమ జీవితంలో చాలా కష్టకరంగా మరియు నొప్పితో తీసుకునే బాధాకరమైన నిర్ణయాల్లో గర్భస్రావం ఒకటి. .
గర్భధారణ యొక్క ముగింపును వైద్యపరమైన పదాల్లో తెలపడంకోసం ‘గర్భస్రావం’ అనే పదాన్ని ఉపయోగించడం జరుగుతోంది. గర్భస్రావాన్ని వైద్యపరంగా లేదా శస్త్రచికిత్స ద్వారా నిర్వహించడం జరుగుతుంది. అనుసరించాల్సిన విధానం మరియు గర్భస్రావం యొక్క భద్రత గర్భం యొక్క త్రైమాసికం (మూణ్నెల్లు) మీద ఆధారపడి ఉంటుంది. ఈ గర్భస్రావ ప్రక్రియ ఎంత ముందుగా జరిగితే ప్రక్రియసమస్యలు అంత తక్కువవుంటాయి.
గర్భస్రావ విధానం చాలా సందర్భాలలో సురక్షితం కాని సాధారణంగా భారీగా రక్తస్రావం కావడం, కటి భాగాన నొప్పులు (కటి తిమ్మిరి), వికారం, మరియు వాంతులు వంటి కొన్ని దుష్ప్రభావాలూ ఉంటాయి. అయినప్పటికీ, అధిక రక్తస్రావం ద్వారా రక్తనష్టం, జ్వరం మరియు తీవ్రమైన నొప్పి వంటి తీవ్రమైన లక్షణాలను మీరు గమనించినట్లయితే వెంటనే మీరు మీ స్త్రీరోగ, ప్రసూతి వైద్యులకు (గైనకాలజిస్ట్కు) రిపోర్టు చేయాలి లేదా సంప్రదించాలి.
గర్భస్రావం భవిష్యత్తులో రానున్న గర్భాలు లేదా స్త్రీ యొక్క సంతానోత్పత్తి శక్తిని దెబ్బ తీయదు, అందుచేత, శిక్షణ పొందిన స్త్రీరోగ నిపుణులైన వైద్యుల (gynaecologist) మార్గదర్శకత్వంలో గర్భస్రావం నిర్వహించబడే పక్షంలో గర్భస్రావాన్ని ఎంచుకోవడం ప్రమాదమేమాత్రం కాదు.