కర్పూరం కర్పూర చెట్టు యొక్క బెరడు నుండి సహజంగా ఏర్పడే ఒక రసాయన సమ్మేళనం. కర్పూర ముద్దలు ప్రధానంగా టేర్పిన్ (మొక్కలు ఉత్పత్తి చేసే ఒక రకమైన ఆర్గానిక్ సమ్మేళనాలు) తో తయారు చేయబడతాయి, టేర్పిన్ నే కర్పూరం యొక్క బలమైన వాసనకు కారణం. ఈ టేర్పిన్లు మొక్కలలోని సహజ రక్షణ వ్యవస్థ యొక్క ముఖ్యమైన భాగాలు. టేర్పిన్లు నేరుగా తినడానికి పనిచేయవు ఎందుకంటే అవి విషపూరితమైనవి. దానికుండే వాసన శాకాహార జంతువులు కర్పూర చెట్టును తినకుండా కాపాడుతుంది. కానీ, కర్పూరానికి ప్రయోజనాలు పుష్కలంగా ఉంటాయి.
కర్పూరం సాంప్రదాయ మరియు పాశ్చాత్య వైద్య విధానాలలో దాని ఔషధ మరియు వైద్య లక్షణాలకి చాలా ప్రసిద్ధి చెందింది. ముక్కుదెబ్బేడ, నొప్పులు మరియు వాపు వంటి వివిధ సమస్యలకు ఇది ఒక వివిష్టమైన జానపద మందు. నిజానికి, కొన్ని అధ్యయనాలు, కాలిన గాయాలు మరియు ఫంగల్ ఇన్ఫెక్షన్లను నయం చేయడంలో ఇది చాలా ప్రభావంతంగా ఉందని సూచించాయి.
వాస్తవానికి కర్పూర చెట్టు భారతదేశం, చైనా మరియు జపాన్ యొక్క స్థానిక వృక్షం,అయితే, ప్రపంచంలోని అత్యధిక ఉష్ణమండల ప్రాంతాల్లో కూడా కర్పూర చెట్టును విస్తృతంగా సాగు చేస్తారు. ఆసక్తికరంగా, ఇది 'గ్లోబల్ ఇన్వేసివ్ స్పీసిస్ డాటాబేస్' లో ఒక హానికర మొక్కగా పరిగణించబడింది.
కర్పూర చెట్టు 60 అడుగుల ఎత్తు వరకు పెరిగే ఒక సతత హరిత చెట్టు. కర్పూర చెట్టు అడవులలో పెరుగుతుంది మరియు చాలా విస్తరించగలదు. దాని కొమ్మలు బాగా పెద్దగా విస్తరించి చెట్టు ఒక గొడుగు వంటి ఆకృతిని ఇస్తాయి. కర్పూర చెట్టు దీర్ఘవృత్తాకారంలో ఉండే ఆకులు మరియు చిన్న తెల్లని పూలను కలిగి ఉంటుంది. దీని పండు గుండ్రంగా ఉంటుంది మరియు సాధారణంగా అది నలుపు నుండి ఊదారంగులో ఉంటుంది.
మీకు తెలుసా?
కర్పూరం కేవలం ఒక చెట్టు మాత్రమే కాదు, అది ఒక నుండే మరియు ఒక రసాయన సమ్మేళనం. ఒక రసాయన సమ్మేళనంగా , దీనిని లావెన్డేర్, కర్పూర తులసి, మరియు రొస్మేరి వంటి మొక్కల యొక్క నూనెల నుండి పొందవచ్చు.
కర్పూరం చెట్టు గురించి కొన్ని ప్రాథమిక వాస్తవాలు:
- శాస్త్రీయ నామం: సిన్నమోమం కేంఫోరా (Cinnamomum camphora)
- కుటుంబం: లారాసియే (Lauraceae)
- సాధారణ నామాలు: కామ్ఫోర్ లారెల్, కర్పూరం, కర్పూర చెట్టు,
- ఉపయోగించే భాగాలు: ఆకులు, బెరడు
- స్థానిక ప్రాంతం మరియు భౌగోళిక విస్తీర్ణం: చైనా, భారతదేశం మరియు జపాన్ వంటి ఉష్ణమండల ప్రదేశాలలో కేంఫర్ రకాలు ఉన్నాయి, కానీ ఇది యూఎస్ఏ లో ఫ్లోరిడాలో కూడా ప్రవేశపెట్టబడింది.
- శక్తి శాస్త్రం: శీతలీకరణ