అల్ఫాల్ఫా ఒక పశుపంట, ఇది సాంప్రదాయకంగా దాని వైద్య లక్షణాలకు ప్రసిద్ది చెందింది. ఇది పెద్ద చిక్కుళ్లు మరియు కసింద చెట్టు పాటు ఫాబేసి కుటుంబానికి చెందినది మరియు ఇది అన్ని కాయధాన్యాల మాదిరిగా ప్రోటీన్లతో సమృద్ధిగా ఉంటుంది.
ఈ మొక్కపై ఎక్కువ శాస్త్రీయ పరిశోధనలు లేనప్పటికీ, ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలకు ఆసక్తి కలిగించే మూలికగా ఉంది; ప్రధానంగా దాని అధిక పోషక పరిమాణం కారణంగా ఇది మానవ వినియోగానికి సరైన ఆరోగ్య సప్లీమెంట్గా పనిచేస్తుంది. వాణిజ్యపరంగా లాభదాయకమైన పంట కావడంతో దీనిని యూఎస్ఏ లో దీనిని “గ్రీన్ గోల్డ్” అని పిలుస్తారు. అల్ఫాల్ఫా యొక్క నాణ్యత మరియు దిగుబడిని మెరుగుపరచడానికి దాని పెరుగుదల విధానం మరియు పంటకోత సమయాల్లో ఒక నిశిత పరిశీలన అవసరం అవుతుంది.
ఆసక్తికరంగా, ఈ పంట యొక్క చరిత్ర గురించి స్పష్టమైన రికార్డులు లేవు మరియు నాగరికత ప్రారంభానికి ముందు నుండి ఇది అడవులలో పెరుగుతోందని నమ్ముతారు. ఏదేమైనా, అల్ఫాల్ఫా యొక్క మూలం తూర్పు లేదా మధ్య ఆసియాకు, ముఖ్యంగా పర్షియా (ఇప్పుడు ఇరాన్), కాశ్మీర్, సిరియా, ఇరాక్, పాకిస్తాన్ మరియు బలూచిస్తాన్లలో ఉన్నట్లు పేర్కొనే కొన్ని వాదనలు కూడా ఉన్నాయి. వాస్తవానికి, అల్ఫాల్ఫా అనే పేరు పెర్షియన్ పదం నుండి వచ్చింది, దీని అర్థం “ఉత్తమ మేత” [“the best forage”]. నేడు, ఈ మూలిక ప్రపంచవ్యాప్తంగా పెరుగుతోంది.
అల్ఫాల్ఫా ఒక శాశ్వత మొక్క, ఇది 3 అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది. ఇది నిటారుగా ఉండే కాండంతో లోతైన మూలాలు మరియు కలప అంచు (వూడి బేస్) ను కలిగి ఉంటుంది. అల్ఫాల్ఫా ఆకులు అండాకారంలో మరియు త్రిదళంగా (ట్రైఫోలియేట్, మూడు ఆకులు కలిసి పెరుగుతాయి) ఉంటాయి మరియు వాటి దిగువ భాగంలో వెంట్రుకలుగా (hairy) ఉంటుందిఉంటాయి. ఇది మే నుండి జూలై నెలలో ఊదా రంగు పువ్వులను కలిగి ఉంటుంది, ఈ పువ్వులు గుత్తులుగా పెరుగుతాయి మరియు కాయలు మెలికెలు తిరిగి ఉంటాయి, ఇవి 2 నుండి 5 పసుపు నుండి ఆకుపచ్చ రంగులో మూత్రపిండాల ఆకారపు విత్తనాలను కలిగి ఉంటాయి.
ఒక అద్భుతమైన పోషక పదార్ధంగా మాత్రమే కాకుండా, అల్ఫాల్ఫాకు అనేక వైద్య ప్రయోజనాలు ఉన్నాయి. ఆయుర్వేదంలో, అల్ఫాల్ఫా మొలకలు కాలేయ ఆరోగ్యానికి మరియు రక్త శుద్ధికి మంచివిగా పరిగణించబడతాయి, ఇది సమర్థవంతమైన యాంటీ- ఆర్థరైటిక్ మరియు ఊబకాయ నిరోధక ఏజెంట్. ఇది సాధారణంగా దాని హైపోలిపిడెమిక్ (కొవ్వును తగ్గిస్తుంది) మరియు యాంటీ-డయాబెటిక్ లక్షణాల కోసం అధ్యయనం చేయబడుతుంది. సాంప్రదాయ వాదనలను ధృవీకరించడానికి మరియు ఈ మూలిక నుండి గరిష్ట ప్రయోజనాలను పొందటానికి పరిశోధన ఇంకా కొనసాగుతోంది.
అల్ఫాల్ఫా గురించి కొన్ని ప్రాథమిక వాస్తవాలు:
- శాస్త్రీయ నామం: మెడికాగో సాటివా (Medicago sativa)
- కుటుంబం: ఫాబేసి (Fabaceae)
- సాధారణ పేర్లు: అల్ఫాల్ఫా, లూసర్న్ (Lucerne), బాస్టర్డ్ మెడిక్ (Bastard medic), బఫల్ హెర్బ్ (Buffal herb), ఎండుగడ్డి
- సంస్కృత పేరు: అశ్వబాలా
- ఉపయోగించే భాగాలు: ఆకులు, విత్తనాలు
- స్థానిక ప్రాంతం మరియు భౌగోళిక విస్తీర్ణం: ఆగ్నేయాసియాకు చెందిన అల్ఫాల్ఫాను చైనా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఆఫ్రికా మరియు ఉత్తర మరియు దక్షిణ అమెరికాలో పండిస్తారు.
- శక్తిశాస్త్రం: చల్లదనం