బాదం బంకను సాధారణంగా "గోండు కటిరా" అని పిలుస్తారు. ట్రగాకాంత్ గమ్ (tragacanth gum) అని కూడా పిలిచే దీన్ని “అస్ట్రాగలస్” (Astragalus) అనే మూలిక యొక్క వివిధ జాతుల చెట్ల నుండి సహజంగా లభించే సారం (sap) లేక జిగురే ఈ బాదం బంక. ఇది జిగట పదార్ధం లేక జెల్లీ లాంటిది. వాసన, రుచి ఉండదు దీనికి. బాదం బంక (ట్రగాకాంత్ గమ్) నీటిలో కరిగిపోతుంది మరియు ప్రధానంగా దీన్ని మొక్క యొక్క వేర్ల నుండి సేకరించబడుతుంది. బాదం బంకను నీటిలో నానబెట్టినపుడు ‘జెల్’ లాంటి పదార్థంగా మారుతుంది, దీనిని పేస్ట్‌గా తయారు చేసుకోవచ్చు. ఆయుర్వేద వైద్యంలో బాదం బంకను ఓ మూలికా ఔషధం (medicine)గా ఎక్కువగా ఉపయోగించబడుతోంది. ముఖ్యంగా, శీతలీకరణ మరియు జీర్ణ ప్రచోదన లక్షణాల కోసం బాదం బంకను ఆయుర్వేదం వైద్యంలో వాడటం జరుగుతోంది.
బాదం బంకను ఇవ్వగల వివిధ అస్ట్రాగలస్ (Astragalus) జాతి చెట్లున్నాయి. అస్ట్రాగలస్ యొక్క ఆ జాతులు ఏవంటే అస్ట్రాగలస్ యాడ్సెండెన్స్ (Astragalus adscendens), అస్ట్రాగలస్ బ్రాచీకాలిక్స్ (Astragalus brachycalyx), అస్ట్రాగలస్ ట్రాగా క్యాంతుస్ (Astragalus tragacanthus), మరియు అస్ట్రాగలస్ గుమ్మిఫెర్ (Astragalus gummifer). ఈ జాతులు ప్రపంచంలోని మధ్యప్రాచ్య ప్రాంతానికి చెందినవి. ఈ బాదం బంక ప్రధానంగా ఇరాన్లో ఉత్పత్తి అవుతుంది మరియు పెర్షియన్ వైద్యంలో కూడా విస్తృతంగా వాడటం జరుగుతోంది. ఆస్ట్రగలస్ మొక్కలు సాధారణంగా మూలికలు లేదా చిన్న పొదలు. 'ట్రాగోస్' (మేక) మరియు 'అకాంత' (కొమ్ము) అనే గ్రీకు పదాల నుండి ‘ట్రాగకాంత్’ అనే పేరు దీనికి వచ్చింది.
బాదం బంక గురించిన కొన్ని ప్రాథమిక వాస్తవాలు
- పేరు: బాదం బంక ("బాదం బంక ") లేక బాదం బంక
- బాదం బంకను ఏ జాతి మొక్క నుండి తీసుకోబడుతుంది: అస్ట్రాగలస్ జాతులు (species of Astragalus)
- ఉపయోగించే చెట్టు భాగం: వేరులోని జిగురు సారం లేక రసం (ఎండినది)
- సాధారణ పేరు: షిరాజ్, షిరాజ్ గమ్, గమ్ డ్రాగన్
- సంస్కృత నామం: గల్గల్
- స్థానిక ప్రాంతం మరియు భౌగోళిక విస్తీర్ణం: ప్రపంచంలోని మధ్యప్రాచ్య ప్రాంతం.