జెరోఫ్తాల్మియా అంటే ఏమిటి?
జెరోఫ్తాల్మియా (Xerophthalmia) నేత్రవ్యాధి నే “పొడి కన్ను రుగ్మత” లేదా “కళ్లు పొడిబారడం” అని కూడా పిలుస్తారు. ఇది సాధారణంగా విటమిన్ ఎ యొక్క అకాల లోపాన్ని (వయసుకు ముందే దాపురించే రుగ్మత) సూచించే ఒక రుగ్మత. అయినప్పటికీ, విటమిన్ ఎ లోపం ఉన్న వ్యక్తులందరూ కళ్ళు పొడిబారడమనే జెరోఫ్తాల్మియా (xerophthalmia) రోగ లక్షణాలను కలిగి ఉండరని అర్థం చేసుకోవడం చాలా అవసరం. కొన్ని వ్యాధులు, మందులు మరియు కొన్ని ఇతర కారకాలు కూడా కళ్ళు పొడిబారడమనే ఈ జెరోఫ్తాల్మియా రుగ్మతకు దారితీయవచ్చు. జెరోఫ్తాల్మియాలో కంటి యొక్క బయటి పొర అయిన కార్నియా (శుక్లపటలం) పొడిబారిపోవడం మరియు పొలుసులు గలవిగా మారుతాయి. ఈ రుగ్మతకు గురైన కన్ను సంక్రమణకు గురయ్యే ఎక్కువ అవకాశం ఎక్కువగా ఉంది. కళ్ళు పొడిబారడమనే ఈ జబ్బు అన్ని వయసుల వ్యక్తులలోనూ సంభవించవచ్చు.
దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
క్రింద జాబితా చిహ్నాలు మరియు లక్షణాలు కళ్ళు పొడిబారడమనే జెరోఫ్తాల్మియా (xerophthalmia) జబ్బుకు సంబంధం ఉండవచ్చు:
- కంటి దురద
- కంటి పొడిదనం
- కంట్లో నొప్పి మరియు మంట
- కొన్ని సమయాల్లో మసకగా ఉండే అస్పష్టమైన దృష్టి మరియు తగ్గిన దృష్టి
- రేచీకటి (రాత్రి అంధత్వం)
- శుక్లపటల పుండ్లు (కార్నియల్ అల్సర్స్)
ప్రధాన కారణాలు ఏమిటి?
కళ్ళు పొడిబారడమనే జెరోఫ్తాల్మియా (xerophthalmia) జబ్బుకు గల రెండు విటమిన్ ఎ-సంబంధిత కారణాలు:
- ఆహారంలో విటమిన్ A ని తక్కువగా తీసుకోవడం వలన కళ్ళు పొడిబారడమనే జెరోఫ్తాల్మియా (xerophthalmia) సంభవించొచ్చు, సాధారణంగా ఇది అభివృద్ధి చెందుతున్న దేశాలలో గుర్తించబడుతోంది
- ఆహారంలో విటమిన్ ఎ తీసుకోవడంతో సంబంధం లేని జెరోఫ్తాల్మియా (xerophthalmia) కబ్బు, కానీ విటమిన్ A యొక్క అక్రమ విచ్ఛిన్నం మరియు నిల్వ కారణంగా
జెరోఫ్తాల్మియా ఇతర కారణాలు:
- గాలి (wind)
- పొడి గాలి
- యాంటిహిస్టమైన్స్ వంటి కొన్ని మందులు
- డయాబెటిస్, జొరెన్స్ సిండ్రోమ్ మరియు ఆర్థరైటిస్ వంటి వ్యాధులు
దీనిని ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?
డాక్టర్ క్రింది పద్ధతిలో “కళ్ళు పొడిబారడమ”నే రుగ్మతను నిర్ధారణ చేస్తారు:
- వివరణాత్మక వ్యక్తిగత వైద్య చరిత్ర
- కంటి పరీక్ష
- విటమిన్ ఎ లోపం కోసం రక్త పరీక్షల తనిఖీ
కళ్ళు పొడిబారడమనే జెరోఫ్తాల్మియా (xerophthalmia) చికిత్సకు డాక్టర్ కింది చర్యల్ని సిఫారసు చేయవచ్చు:
- శరీరంలో విటమిన్ A స్థాయిని సాధారణీకరించడానికి విటమిన్ ఎ అనుబంధకాల భర్తీ
- కళ్ళు పొడిబారడాన్ని నిరోధించడానికి డాక్టర్ సూచించిన కంటి చుక్కల మందు
- కంటి (కందెనలుగా) లూబ్రికెంట్లుగా కృత్రిమ కన్నీళ్లు
- వెచ్చని కాపాడాలు (కంప్రెస్)
- కనురెప్పను మసాజ్ చేయడం (కనురెప్పల్ని మెత్తగా రుద్దడం)
కింది దశలు కళ్ళు పొడిబారడమనే జెరోఫ్తాల్మియా (xerophthalmia) జబ్బుకు సరైన నిర్వహణను అందిస్తాయి:
- విటమిన్ ఎ కల్గిన ఆహారాల్ని ఎక్కువగా తీసుకోవడం
- విటమిన్ ఎ తో ఆహారాన్ని బలపర్చడం
- విటమిన్ ఎ తో కూడిన ఆహార అనుబంధకాల సేవనం