కడుపు తిప్పడం అంటే ఏమిటి?
కడుపు తిప్పడం లేదా అజీర్ణం అనేది అంతర్లీన జీర్ణశయా రుగ్మతను లేదా లోపాన్ని సూచించే ఒక లక్షణం. ఏ కారణం వల్లనైనా ప్రేగులలో లేదా కడుపులో వాపు (గ్యాస్ట్రోఎంటిరైటిస్) కలిగితే అది అజీర్ణానికి దారి తీస్తుంది. ఇది కొన్ని మందులు, ప్రయాణం సమయంలో కొత్త బ్యాక్టీరియాకి, వైరస్లకి గురికావడం లేదా కలుషితమైన ఆహారం కారణంగా ఇది సంభవించవచ్చు. దాదాపు ప్రతి ఒక్కరూ వారి జీవితకాలంలో కనీసం ఒకసారైనా కడుపు తిప్పును అనుభవిస్తారు.
దాని ప్రధాన సంబంధిత సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
కడుపు తిప్పుతో ముడి పడి ఉండే ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు:
- వాంతులు లేదా వికారం యొక్క భావన
- పేగులు శబ్దం చెయ్యడం
- అలసట
- కడుపు తిమ్మిరి
- తలనొప్పి
- త్రేనుపులు
- జ్వరం మరియు చలి
- బలహీనత
- గుండెల్లో మంట
- అతిసారం
- ఆకలిలేమి
- ఉబ్బరం
- నోటిలో చేదు (ఆమ్లత) రుచి
- కడుపు ఉబ్బటం
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
కడుపు తిప్పు యొక్క ప్రధాన కారణాలు:
- తినే సమయం అధికంగా గాలిని మింగేయడం వల్ల అది కడుపు ఉబ్బరాన్నీ కలిగిస్తుంది చివరికి అజీర్ణానికి దారితీస్తుంది
- కలుషితమైన ఆహారం లేదా నీటి వలన ఇన్ఫెక్షన్ ఏర్పడడం ఉదా. టైఫాయిడ్, కలరా, మొదలైనవి.
- జీర్ణాశయం మరియు ప్రేగులలోని పూతలు/పుండ్లు
- కెఫైన్ ఉండే పానీయాలు మరియు మద్యం అధికంగా సేవించడం
- ధూమపానం
- కలుషితమైన ఆహారాన్ని తినడం
- ఆస్ప్రిన్ (Aspirin) - ఆస్పిరిన్ కొంతమందికి కడుపు గోడలలో చికాకును కలిగిస్తుంది
దీనిని ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?
వైద్యులు కడుపు పూతల వంటి అంతర్లీన సమస్యల సంభావ్యతను నిర్ములించడానికి రోగి యొక్క పూర్తి ఆరోగ్య చరిత్రను తెలుసుకుంటారు. కడుపును దగ్గర పరిశీలించడానికి మరియు అజీర్ణం యొక్క కారణాన్ని గుర్తించడానికి వైద్యులు ఉదర ఎక్స్-రేని లేదా ఎండోస్కోప్ (లైటు మరియు కెమెరాతో కూడిన ఒక గొట్టం-వంటి పరికరం) ను సిఫారసు చేయవచ్చు. అవసరమైతే గ్యాస్రోస్కోపీ (gastroscopy) కూడా సిఫార్సు చేయబడుతుంది.
కడుపు తిప్పు చికిత్సా విధానం అంతర్లీన కారణం మీద ఆధారపడి ఉంటుంది. సాధారణంగా, కడుపు తిప్పు యొక్క లక్షణాలు ఎటువంటి మందులను ఉపయోగించకుండానే కొన్ని గంటలలో తగ్గిపోతాయి. కడుపు తిప్పు ఉపశమనం కోసం ద్రవ ఆహారం సిఫారసు చేయబడుతుంది.
ఈ కింది అలవాట్లను నివారించడం ద్వారా కడుపు తిప్పు నుండి ఉపశమనం పొందవచ్చు:
- కారం/ఘాటుగా ఉండే ఆహారాలు తినడం
- రాత్రుళ్ళు ఆలస్యంగా తినడం
- భోజనం తర్వాత ఖాళీగా ఉండడం (ఎటువంటి శారీరక శ్రమ లేకుండా ఉండడం) కూడా జీవక్రియ వేగాన్ని తగ్గించవచ్చు
- భోజనం చేసే సమయంలో ద్రవాలు అధికంగా తాగడం
కడుపు పనితీరు ప్రభావితం అవుతుంటే యాంటీబయోటిక్స్, యాంటాసిడ్లు (antacids), వికారం మరియు వాంతుల మందులు మరియు అతిసార వ్యతిరేక (anti-diarrhoeal) మందులు వంటి కడుపు తిప్పును నియంత్రించే మందులను వైద్యులు సిఫారసు చేయవచ్చు.