ఎగువ శ్వాసనాళ (upper trachea) అవరోధం అంటే ఏమిటి?
ఎగువ శ్వాసనాళంలోని ఏదైనా భాగంలో అడ్డంకి ఏర్పడితే దాన్నే “ఎగువ శ్వాసనాళ అడ్డంకి”గా పిలుస్తారు. ఈ ఎగువ శ్వాసనాళం ముక్కు నుండి స్వరపేటిక (voice box) వరకూ ఉంటుంది. ఈ ఎగువ శ్వాసనాళం ఇరుకైపోవడమో లేదా పూర్తిగా నిరోధించబడినప్పుడు ఎగువ శ్వాసనాళ అడ్డంకి సమస్య సంభవిస్తుంది. ఇది గొంతు, శ్వాసనాళం మరియు స్వరపేటిక లను దెబ్బ తీస్తుంది. ఎగువ శ్వాసనాళ అడ్డంకి వ్యక్తికి శ్వాసప్రక్రియలో కష్టం కల్గిస్తుంది.
దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
ఎగువ శ్వాసనాళ అడ్డంకి యొక్క ప్రధాన చిహ్నాలు మరియు లక్షణాలు:
- శ్వాసలో “గుర్రు గుర్రు” మనే శబ్దం రావడం
- గొంతులో అడ్డు ఏర్పడడం
- శ్వాసలో సమస్య
- స్పృహ కోల్పోవడం లేదా మూర్ఛ
- సైనోసిస్ (చర్మం నీలిరంగుగా మారడం)
- మానసిక గందరగోళం
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
ఎగువ శ్వాసనాళ అడ్డంకి యొక్క ప్రధాన కారణాలు:
- రసాయనాల కారణంగా కాలడం (బర్న్స్) లేదా ప్రతిచర్యలు
- వేరుశెనగలు తినడం, తేనెటీగ కుట్టడం, లేదా మందులసేవనంవల్ల అలెర్జీ ప్రతిచర్యలు, ఉదాహరణకు యాంటీబయాటిక్స్ (పెన్సిలిన్)
- ఎగువశ్వాసనాళంలో ఎక్కడైనా గాయం
- తీవ్రమైన ఆస్తమా దాడి
- స్ట్రిక్నైన్ (Strychnine) విషప్రక్రియ
- ఎపిగ్లోటిటీస్ (ఎపిగ్లోటిస్ యొక్క బాక్టీరియల్ వ్యాధి)
- స్వరతంతువుతో సమస్యలు
- స్పృహ కోల్పోవడం లేక స్పృహ కోల్పోయి తేరుకోవడం, దీనివల్ల నాలుక వెనుకవైపుకు పడిపోయి శ్వాసనాళం పైపుకు ప్రవేశాన్ని అడ్డుకోవటానికి కారణం కావచ్చు
- అంటువ్యాధులు
- గొంతు క్యాన్సర్
- క్రూప్ (శ్వాసకోశ అనారోగ్యం, కింకవాయువు లేక దీన్నే పిల్లికూతల జబ్బు అని అంటారు)
- రెట్రోఫరింగిల్ అబ్సెస్ (Retropharyngeal abscess-గొంతు వెనుక భాగంలో చీము పట్టడం)
దీనిని ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?
వైద్యుడు శ్వాసనాళాన్ని పరిశీలించడం కోసం శారీరక పరీక్షను నిర్వహిస్తాడు. ఎగువ శ్వాస నాళం మార్గంలో అడ్డంకి కోసం ఏవైనా కారణాలను కనుగొనడానికి డాక్టర్ మీ వైద్య చరిత్రను కూడా తనిఖీ చేస్తాడు. కొన్నిసార్లు, వైద్యుడు ఎగువ శ్వాసనాళంలో అడ్డంకి గల కారణాన్ని గుర్తించడానికి ఒక లారెంగోస్కోపీ, బ్రోన్కోస్కోపీ లేదా X- రే సిఫార్సు చేస్తారు.
శ్వాసమార్గంలో అడ్డంకి ఏర్పడడానికి ఉన్న కారణంపై ఆధారపడి “ఎగువ శ్వాస నాళం మార్గంలో అడ్డంకి” రుగ్మతకు చికిత్స చేయడానికి క్రింది పద్ధతులను ఉపయోగిస్తారు:
- శ్వాసలో సహాయం చేయడానికి గొంతులోని ఒక ప్రారంభ రంధ్రం ద్వారా శ్వాసనాళం లోకి ఒక ఎండోట్రాషియల్ ట్యూబ్ (endotracheal tube) ను జొప్పించడం
- ట్రాచోస్టోమీ లేదా క్రికోథైరోటోమీ: శ్వాసమార్గంలోకి ప్రవేశించడానికి మెడలో కొంత భాగాన్ని తెరిచి చికిత్స చేసే ఒక ప్రక్రియ.
- శ్వాసమార్గాల్లో ఏవైనా విదేశీ శరీరాలు (foreign bodies) గాని లేదా ఏవైనా ఆహార కణాలు చిక్కుకుని అడ్డంకిని కలిగిస్తున్నట్లైతే వాటిని తొలగించడానికి ఛాతీ సంపీడనం, చేతితో వెలికితీత (manual extraction), లేదా పొత్తికడుపుపై పొడుపులు పొడవడం చేస్తారు.
ఈ రుగ్మతకు చికిత్సా పద్ధతి యొక్క ఎంపిక డాక్టర్ రుగ్మతపై చేసే అంచనాపైన, శ్వాసమార్గంలోని అవరోధం యొక్క కారణం, ఏవైనా అధునాతన శ్వాసనాళ పద్ధతులను నిర్వహించడానికి అవసరమైన సహాయక లభ్యతపై ఆధారపడి ఉంటుంది.